జోన్ 4,స్థానిక వెంకటేశ్వర మెట్ట సచివాలయంలో ఉగాది సంబరాలు
మహారాణి పేట, పెన్ పవర్
జీవీఎంసీ జోన్ 4,స్థానిక వెంకటేశ్వర మెట్ట సచివాలయం లో ఉగాది ని పురస్కరించుకొని వాలంటీర్ లు సెక్రెటరీలు తమ ఈ సంవత్సర కాలంగా చేస్తున్న సంక్షేమ పథకాల,ప్రభుత్వం తమకు అందచేసిన భాద్యతలు అవసరమైన చర్యలు కోసం, చర్చించటం జరిగింది. వార్డ్ స్పెషల్ ఆఫీసర్ పార్వతి కరోనా 2వ వేవ్ పట్ల అవగాహన,జాగ్రత్తలు వివరించారు. ఈ సందర్బంగా ఉగాది పురస్కరించుకొని వాలంటీర్ లకు బహుమతి ప్రదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో 33 వ వార్డ్ సెక్రటరీ లు పి వి కిరణ్ కుమార్, పవన్ కుమార్, భార్గవ్,రేణుక, ప్రమీల, రమేష్,హారిక,నూర్జహాన్ చిరంజీవి,వెల్ఫేర్ లలిత,జాన్ షాహిద్,ఏ.ఆన్.ఎం లు లక్ష్మి,తులసి, వాలంటీర్ లు గౌరీ,చైతన్య,తారక్,నవీన్,చంద్రకళ, లోక త్రివేణి,కుమారి,పద్మ,రమ్య సంధ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment