Followers

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల మృతి

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల మృతి

పెన్ పవర్, ఆలమూరు

 కొత్తపేట నియోజకవర్గం  ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామానికి చెందిన  తోట వీరబాబు (25), తోట వరలక్ష్మి (22)లు ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ద్విచక్ర వాహనంపై దొడ్డుగుంట వెళుతుండగా మడికి వద్దకు వచ్చేసరికి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇరువురూ సంఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్రమాద సంఘటనపై తెలుసుకున్న మండపేట రూరల్ సీఐ కె మంగాదేవి, ఎస్సై, హైవే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. కాగా వాహనం ఆచూకీ కొరకు జాతీయ రహదారిపై గల అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...