Followers

గాంధీ బొమ్మ సెంటర్ లో మహాత్మా జ్యోతిరావు పూలే 194 వ జయంతి వేడుకలు

 గాంధీ బొమ్మ సెంటర్ లో మహాత్మా జ్యోతిరావు పూలే 194 వ జయంతి వేడుకలు

తాళ్లపూడి, పెన్ పవర్               

మహాత్మా జ్యోతిరావు పూలే 194 వ జయంతి వేడుకలు తాళ్లపూడి గాంధీ బొమ్మ సెంటర్లో వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షులు వంబోలు పోసిబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా వంబోలు పోసిబాబు  మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి కృషిచేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని,  ఆనాడు ప్రజలు  ఎదుర్కొంటున్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు దేశంలో సగభాగమైన స్త్రీలహక్కులు, వారి చదువుకోసం నవీన ఉద్యమానికి రూపకల్పన చేశాడన్నారు. వితంతువులు,గర్భవతుల రక్షణ కోసం ప్రత్యేక ఆశ్రమాలు నిర్మించినటువంటి సంఘ సంస్కర్త అని అన్నారు. స్త్రీలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి కాగలదని  తెలియచేసిన మహోన్నత వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. సమాజ సేవకుడిగా రచయితగా ఉద్యమకర్తగా పూలే సేవలు నాడూ నేడూ ఏనాడూ ప్రజలు మర్చిపోలేరని అన్నారు.  మహోన్నత వ్యక్తుల్లో పూలే ఒకరని ముఖ్యంగా కుల నిర్మూలనకు మహిళా విద్య కోసం అతను నిరంతర కృషి చేశాడని అతని ఆదర్శాలు, ఆశయాలు నేటితరం  స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఏఎంసి డైరెక్టర్ కంకిపాటి బాబురావు, బిసి నాయకులు తడికుప్పల శ్రీనివాస్, చెల్లు పవన్ కుమార్, రాజు, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...