ఆదివాసులకు కుల ధృవ పత్రాలు ఇవ్వాలి
ఎటపాక, పెన్ పవర్ఆదివాసీలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని సోమవారం ఎట పాక మండల తహశీల్దార్ కార్యాలయంలో తసిల్డార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలోని క్తిష్ణవరం పంచాయితీ లో కొందరికి మా బంధువులకు ఇచ్చారని, మాకు కూడ ఇవ్వాలని, ఆధార్ కార్డు లు, రేషన్ కార్డు లు, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు. కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో విద్యార్థులకి సమస్యలు ఎదురవు తున్నాయి అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కోల్పోతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయం లక్ష్మ య్యా , దుర్గా రావు, సీతయ్య, సుశీల, మార్త, రింకు బాబు, వెట్టి రాములమ్మ, సొడే లక్ష్మి , సోదే ముత్తమ్మ పాల్గొన్నారు.

No comments:
Post a Comment