Followers

ప్రసన్నకు నివాళులర్పించిన మంత్రి వనిత

 ప్రసన్నకు నివాళులర్పించిన మంత్రి వనిత

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ జొన్నకూటి ప్రమోద్ కుమార్ చెల్లెలు డివియల్.ప్రసన్న అకాల మరణం చెందారు. రాష్ట్ర స్త్రీ,  శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రసన్న కుటుంబ సభ్యులను పరామర్శించడానికి  ఆదివారం విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రసన్న చిత్రపటానికి పూలమాలవేసి  నివాళులు అర్పించారు. ప్రసన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు యాళ్ల బాబురావు,  వైసిపి జిల్లా కార్యదర్శి మరియు పెద్దేవం వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ, వైసిపి సీనియర్ నాయకులు పోశిన శ్రీకృష్ణదేవరాయలు,   వైసీపీ పైడిమెట్ట గ్రామ కన్వీనర్ కొల్లి దుర్గారావు, వైసీపీ నాయకులు చిరంజీవి, పిట్టా శ్రీనివాస్,  నంద, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...