పంట పొలాలు పరిశీలన
తాళ్లపూడి, పెన్ పవర్మొన్న ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలకి అరటి తోటలు నేల కొరిగి పంటలు దెబ్బతిన్నాయి. వీటిని పరిశీలించడానికి హెచ్ఓ సిహెచ్.శ్రీనివాసరావు వచ్చారు. ఈయన రావూరుపాడు, మలకపల్లి, పెద్దేవం గ్రామాలలో ఆదివారం తిరిగి పంట ఎంత వరకు డేమేజ్ జరిగిందని పరిశీలించారు. మొత్తం ఈ మూడు గ్రామాల్లో అరటి తోటల పంట నష్టం 250 ఎకరాలుగా గుర్తించారు. పంట నష్టం వచ్చిన రైతులకు పంటనష్టానికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు తోట రామకృష్ణ, రాపాక తిలక్, విఆర్వో లు, విహెచ్ఏ లు శ్రీరామ్, సాగర్, రైతులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment