ఇస్లాం ధార్మిక మహాసభ
తాళ్లపూడి, పెన్ పవర్ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు తాళ్లపూడి మండల జమా ఆత్ వారి ఆధ్వర్యంలో ఇస్లాం ధార్మిక మహాసభ ప్రక్కిలంక రావిపాటి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ సభకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా విచ్చేసారు. ముస్లిం సోదరులు, సోదరీమణులు మంత్రి వనితను ఘనంగా సన్మానించారు. తదుపరి ముస్లిం సోదరులు ఈ సభలో ఇస్లామీయ మౌళిక విశ్వాసాలు, రంజాన్ విశిష్టత, మహమ్మద్ ప్రవక్త విశిష్టత మొదలగు విషయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, సోదరీమణులు, తాళ్లపూడి మండల వైసీపీ కన్వీనర్ కుంటముక్కల కేశవనారాయణ, కొవ్వూరు ఏఎంసి ఛైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాసరావు, వైసీపీ జిల్లా కార్యదర్శి మరియు పెద్దేవం వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ, కొవ్వూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు యాళ్ల బాబురావు, వైసీపీ సీనియర్ నాయకులు పోశిన శ్రీకృష్ణ దేవరాయలు, జెడ్పిటిసి అభ్యర్థిని పోశిన శ్రీలేఖ, సీనియర్ బీసీ నాయకులు నక్కా చిట్టిబాబు, మండల యువజన విభాగం అధ్యక్షులు వంబోలు పోసిబాబు, వైసీపీ నాయకులు బండ్రెడ్డి వెంకటేశ్వరరావు, కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, పిట్టా శ్రీనివాస్, మైగాపుల ఆంజనేయులు, సిద్దంశెట్టి కృష్ణ, విత్తం నాని, కొల్లి దుర్గారావు, చిరంజీవి, గన్నిన రత్నాజీ, ఎలిపే రాజు, నంద, వేగేశ్వరపురం సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు, పెద్దేవం సర్పంచ్ తిగిరిపల్లి వెంకట్రావు, తాడిపూడి సర్పంచ్ నామా శ్రీనివాస్, ప్రక్కిలంక సర్పంచ్ యాళ్ల స్వప్న, గజ్జరం సర్పంచ్ గండి రాంబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment