విద్యా నిమిత్తం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సాయం
తాళ్లపూడి, పెన్ పవర్ఆదివారం నాడు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తాళ్లపూడి శాఖ ఆధ్వర్యంలో తాళ్లపూడి గ్రామంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తలారి రాజశ్రీ అను విద్యార్థినికి విద్య నిమిత్తం రూ.4000/- ఆర్థిక సాయం అందజేశారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు బారనాల శంకరరావు, సెక్రటరీ జోడాల వెంకటేశ్వరరావు, కోశాధికారి చెరుకు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు తుంపూడి నాగ భూషణ గుప్త, మాజీ అధ్యక్షులు అప్పన చంద్రధర గుప్త, మాధవరవు రామచంద్రరావు, గెడ్డం సాయిబాబా, సభ్యులు సనపల రాజశేఖర్, కూన రమేష్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment