సబ్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన
సంతబొమ్మాళి, పెన్ పవర్
సంతబొమ్మాళి మండలంలో సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా లక్ష్మీపురం టౌన్ షిప్ లో గతంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా రెండోదశ ఉధృతంగా ఉండడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడి క్వారంటైన్ సెంటర్ ను పునః ప్రారంభించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయో లేవో అని పరిశీలించారు. ఆర్ హెచ్ పురం లో ఎఫ్సిఐ గొడౌను నిర్మాణానికి కావలసిన సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలం అంత అనుకూలంగా లేకపోవడంతో తిరస్కరించారు. ఈ పర్యటనలో సంతబొమ్మాలి మండల తాసిల్దార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment