మాస్క్ ఉంటే చాక్లెట్...లేకుంటే పైకి టికెట్
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కోవిడ్ కట్టడికి పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్విన్ పేట కూడలిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, యస్.ఐ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యం ప్రజలకు కరోనా కట్టడికి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపారు. అవకాశం ఉన్నప్పుడు సానీటైజర్ రాసుకోవాలని తెలిపారు. ప్రతి వ్యక్తీ జాగ్రత్తలు పాటిస్తూ ఇతరులకు కరోనా కట్టడికి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. మాస్కులు ధరించని వారికి అపరాధారుసుములు విధించి బాధ్యతగా మాస్క్ ధరించిన వారికి చాక్లెట్లు ఇచ్చి అభినందించారు.

No comments:
Post a Comment