రైట్ రెవ.డాక్టర్ కె.ప్రశాంత్ కుమార్ మరణం
రాజమహేంద్రవరం, పెన్ పవర్
ప్రముఖ క్రైస్తవ నాయకులు, అంతర్జాతీయంగా మరియు భారతదేశంలో ప్రముఖ దైవ జనులుగా పేరు గాంచిన రైట్. రెవ. డా. కె. ప్రశాంత్ కుమార్ (82 సంవత్సరాలు) ఏప్రిల్ 9వ తేదీ శుక్రవారం,2021న మరణించి యున్నారు.వీరు ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులుగాను,రాష్ట్ర బైబిల్ సొసైటీ అధ్యక్షులుగాను, బ్రదరన్ మిషన్ ఇండియా వ్యవస్థాపకులు, అధ్యక్షులుగాను మరియు అనేక వివిధ సంస్థలలో అధ్యక్షులుగాను వ్యవహరించి యున్నారు.వీరి యొక్క అంతిమ యాత్ర ఏప్రిల్ 10వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు రాజమండ్రి, ఎయిర్ పోర్ట్ రోడ్డులో గల బ్రదరన్ చర్చి నుండి ప్రారంభమగునని కుటుంబ సభ్యులు తెలియపరచడమైనది.

No comments:
Post a Comment