వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఆధార్ కేంద్రం
వనపర్తి, పెన్ పవర్వనపర్తి పట్టణ ప్రజలకు అందుబాటు లో ఉండే విధంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ప్రజలను కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఏవో అడ్మిన్, కలెక్టరేట్ టెక్నికల్ సిబ్బంది ఆధార్ సేవా కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment