Followers

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

మాస్కులు ధరించకపోతే 500 రూపాయల జరిమానా. 

సర్పంచ్ కడెం యాకయ్య.

తొర్రూరు, పెన్ పవర్

రెండోసారి కరోన విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, మాస్కులు ధరించని వారికి 500 రూపాయల జరిమానా విధించబడుతుందని, సర్పంచ్ కడెం యాకయ్య, ఎంపీటీసీలు డోనుక ఉప్పలయ్య, ముద్థం విక్రమ్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామములో గ్రామ పంచాయతీ అవరణలో రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణ పై అవగాహన కలిగించేందుకు, గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఎంపీటీసీలు మాట్లాడుతూ... కరోనా సెకండ్ వెజ్ విజృంభిస్తున్న నేపద్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండి, మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని, అన్నారు. 45 సంవత్సరాలు పై బడినవారు తప్పనిసరిగా కరోనా టీకాలు వేయించుకోవాలని, అన్నారు. కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం గ్రామంలో కరోనా వైరస్ నివారణ, టీకా తీసుకోవడం పై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు,పంచాయతీ కార్యదర్శి లెనిన్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...