ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
మెంటాడ, పెన్ పవర్
వెంటాడు మండలంలోని కం టు భక్త వలస గ్రామంలో సర్పంచ్ కోరుపల్లి బంగారమ్మ ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలో ఉన్న సీసీ కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదని, ప్రస్తుతము అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయనీ సీసీ కాలువల్లో పెరిగిపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నట్లు సర్పంచ్ బంగారమ్మ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment