Followers

అమరులైన జర్నలిస్టుల కు జోహార్లు...జోహార్లు.....

 అమరులైన జర్నలిస్టుల కు జోహార్లు...జోహార్లు.....

అమరులైన జర్నలిస్ట్ కుటుంబాలకు 

50 లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలి

కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.


 ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

 తెలంగాణ రాష్ట్రం లో కరోనా మహామ్మారీ వలన ఇప్పటివరకు   17 మంది జర్నలిస్టులు  మృత్యువాత పడి అమరులయ్యారనీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన  జర్నలిస్టులు గురువారం సాయంత్రం 7-00 గంటల సమయంలో   పెధ్ధ ఎత్తున కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు..వారికి నివాళులర్పించారు.   ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బండారి పాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమరులైన 17 మంది జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అదే విధంగా మరణించిన జర్నలిస్టు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు అదేవిధంగా అదేవిధంగా మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు జర్నలిస్టులు అమరులైన జర్నలిస్టులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అనంతరం నివాళులు అర్పించారు ఈ ర్యాలీలో జర్నలిస్టులు బండారి బాల్ రెడ్డి .ఓగ్గు బాలరాజు యాదవ్ .శ్రీ రామోజు దేవరాజు.కూలేరీ దీప్తి కిషోర్ బాబు విజయ్.మారేపు  భూశంకర్ కొండ్లేపు జగదీష్. . కూలేరీ కిషోర్.  దుర్గం విజయ్. బురుక బాబ్జి . కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ దోమ్మాటి నరసయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు.శేఖ్ గౌస్ .బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మద్దుల బుగ్గా రెడ్డి  పారి పెల్లి సంజీవరెడ్డి రామిండ్ల జయపాలా. ఆటో యూనియన్ మల్లయ్య. నీజామ్. పంతంగి పర్షరాములు. ర్యాలీలో పాల్గొని నివాళులు అర్పించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...