మావోయిస్టు దళంలో చేరిన వంతాల సంగీత
పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం
రెండేళ్ల క్రితం అదృశ్యమైన గిరిజన యువతి మావోయిస్ట్ దళంలో చేరినట్లు పోలీసులు గుర్తించారు. అదృశ్యమైన యువతి కోసం పోలీసులు విచారణ చేస్తుండగా గిరిజన యువతి మావోయిస్టు దళంలో చేరి దళ సభ్యురాలిగా కొనసాగుతున్నట్లు గ్రామంలో దండోరా వేయించారు. వివరాల్లోకి వెళితే ఏజెన్సీలోని కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయితీ నల్లబెల్లి గ్రామానికి చెందిన వంతాల సంగీత( 21) అదృశ్యమైనట్లు రెండేళ్ల క్రితం కుటుంబీకులు మంప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ గిరిజన యువతి ఆచూకీ లభించలేదు. కానీ పోలీసులు నేటి వరకు యువతి కోసం గాలిస్తూనే ఉన్నారు. వంతాల సంగీత మావోయిస్టు దళంలో చేరిందని ప్రస్తుతం దళ సభ్యురాలిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లబెల్లి గ్రామంలో మంప ఎస్ ఐ సన్ని బాబు సంగీత మావోయిస్ట్ దళంలో ఉన్నట్లు దండోరా వేయించారు.

No comments:
Post a Comment