ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకే రిజిస్ట్రేషన్లు
జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజన ప్రకటన
కోవిడ్ నియంత్రణంలో భాగంగా విధించిన కర్ఫ్యూ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జిల్లాలో భూ క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పు చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పని చేస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాల వచ్చే వరకు జిల్లాలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు.
No comments:
Post a Comment