Followers

10 లీటర్ల నాటు సారాయి  స్వాధీనం  ఒ వ్యక్తి   అరెస్ట్.           


10 లీటర్ల నాటు సారాయి  స్వాధీనం 



800 లీటర్ల పులసిన బెల్లపు ఊట ధ్వంసం        


                             
ఒక వ్యక్తి   అరెస్ట్.           



జగ్గంపేట,  పెన్ పవర్ :


 


పెద్దాపురం  స్పెషల్  ఎన్ ఫోర్స్ మెంట్  బ్యూరో టీమ్ లు  దాడులు  నిర్వహించగా రంగం పేట మండలం  వెంకటాపురం  గ్రామ పరిధిలో    దుళ్ళ లాజరు అను వ్యక్తి  ని 10  లీటర్ల సారాయి తో పట్టుకుని అరెస్ట్ చేశారు. పెద్దాపురం  మండలం   పులిమేరు  గ్రామ పరిధిలో  సారాయి తయారీ కు నిల్వుంచిన   800 లీటర్ల  పులసిన బెల్లపు ఊట ను  కనుగొని, కేసు  నమోదు చేసి  బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగిందని పెద్దాపురం ఎక్సైజ్ సి ఐ. ఎం. రామ కృష్ణ దాస్ తెలిపారు.ఈదాడుల్లో పెద్దాపురంఎక్సైజ్   ఎస్ ఐ. లు    జె.విజయకుమార్ ,కె.తాతారెడ్డి తదితర సిబ్బంది   పాల్గొన్నా రు.


పునరావాస గ్రామాల ప్రజలను తరలించే లోపే  పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలి.



పునరావాస గ్రామాల ప్రజలను తరలించే లోపే 
పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలి.


ఐ టి డి ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి అనిల్ కుమార్



పోలవరం పెన్ పవర్


నిర్వాసితులకు సంబంధించిన ప్యాకేజీలు తలెత్తిన సమస్యలపై చర్చించేందుకు గురువారం పోలవరం మండలం స్థానిక సుజల గెస్ట్ హౌస్ కు ఆర్ అండ్ ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె గీతాంజలి విచ్చేసారు. వివిధ సమస్యలతో ప్యాకేజీలు, పునరావాస లు, ఇల్లు, పొలాలు, జీరో అకౌంట్, అకౌంట్ ఫెయిల్ తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్వాసితులు సంబంధిత పత్రాలతో స్పెషల్ డిప్యూటీ  కలెక్టర్ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం ఐ టి డి ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను  నియమించారని అయితే గురు, శుక్రవారం రెండు రోజులలో నిర్వాసితుల సమస్యలు తీరవని, పునరావాస గ్రామాల ప్రజలను తరలించే వరకు వారానికి ఒకరోజు అయిన  పునరావాస గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాలరాజు కోరారు .  పునరావాస గ్రామాల ప్రజల సమస్యలపై త్వరితగతిన స్పందించి ప్యాకేజీ, ఇల్లు, చెట్టులు, భూమికి భూమి, ఎకౌంట్స్ ఫెయిల్యూర్ వంటి సమస్యలతో ప్యాకేజీ అందక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు అని వారందరి  సమస్యలను త్వరితగతిన పూర్తిచేసి పునరావాస గ్రామాల ప్రజలను తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. పునరావాస గ్రామాల ప్రజలకు ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని ఆయన అన్నారు. పునరావాస గ్రామాల ప్రజలను తరలించే లోపే సమస్యలపై పూర్తి పరిష్కారం కావాలని కోరారు. 


కరోనా ఫీవర్ మండపేటను పట్టి పీడిస్తోంది


కరోనా ఫీవర్ మండపేటను పట్టి పీడిస్తోంది


మండపేట, పెన్ పవర్ 


ప్రస్తుతం కరోనా ఫీవర్ మండపేటను పట్టి పీడిస్తోంది. ఒకే రోజు మొత్తం 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కార్యాలయంలో ఒకరు, హౌసింగ్ కార్యాలయంలో మరొకరు ఈ వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా చూసుకుంటే 26వ వార్డులో మూడు కేసులు, గొల్లపుంత కాలనీలో మరో మూడు, 14వ వార్డులోని కుక్కల వారి వీధిలో ఒకటి, 11వ వార్డు న్యూ కొలనీలో ఇంకొకటి, రజక పేటలో ఒకటి, శ్రీనగర్ మొదటి వీధిలో మరొకటి, ఆలమూరు రోడ్డులో ఒకటి, కొండపల్లి వారి వీధిలో మారొకటి, ఏడిద రోడ్డులోని పేరంటాలమ్మ గుడి వద్ద ఇంకొకటి, విజయలక్ష్మి నగర్ లో మరొకటి నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా పారిశుధ్య కార్మికులకు రెట్టింపు పని భారం పడింది. మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఆదేశాలు మేరకు  ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బంది పట్టణం లో ప్రత్యేక శానిటేషన్ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఒకరికి కరోనా రావడంతో అధికారులు కార్యాలయాన్ని ఖాళీ చేశారు. హైపో క్లోరైడ్ ద్రావణం తో కార్యాలయాన్ని సానిటైజ్ చేశారు. ప్రస్తుతం కార్యాలయం కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి రావడంతో కొద్దీ రోజులు పాటు మూసివేయనున్నారు.


డాక్టర్ లేక రోగులు సతమతం


డాక్టర్ లేక రోగులు సతమతం


అనకాపల్లి, పెన్ పవర్ 


పట్టణంలో విజయరామరాజుపేట వద్దనున్న ఎఎం సి కాలనీ లో ఆరోగ్యశ్రీ హెల్త్ వెల్ నెస్ పేరిట ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో వైద్యులు లేక రోగులు సతమతమవుతున్నారు అని ఆమ్ ఆద్మీ నాయకులు కొణతాల హరనాథ్ బాబు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎనిమిదేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో ఉన్న డాక్టర్ను కరోనా సేవల కోసం వేరే చోటికి పంపించారన్నారు. కానీ అక్కడ మరో డాక్టర్ను నియమించికపోవడంతో రోగులు వందల్లో రోజు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. ఆర్డిఓ అధికారులకు వినతి పత్రం అందజేసిన ఈ కార్యక్రమంలో  మా వూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే కన్నబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి


 


ఎమ్మెల్యే కన్నబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి



మండల వైసీపీ అధ్యక్షుడు కాండ్రేగుల నూకరాజు



         మునగపాక, పెన్ పవర్ 



మునగపాక మండలం:ఈనెల 11 వ తేదీన జరుగనున్న ప్రియతమ నేత యలమంచిలి నియోజకవర్గం శాసనసభ్యులు కన్నబాబు రాజు గారి జన్మదినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించాలి అని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాండ్రేగుల నూకరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.జన్మదినం పురస్కరించుకుని ఆరోజు పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కేక్ కటింగ్,ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. సమావేశంలో ఆడారి గణపతి అచ్చియ్య నాయుడు , జెడ్ పి టి సి అభ్యర్థి పెంటకోట స్వామి సత్యనారాయణ ఎంపీటీసీ అభ్యర్థి మళ్ళ జయలక్ష్మి ,సూరిశెట్టి రాము , బొగడకుర్తి గణేష్ , సర్పంచ్ అభ్యర్థి కోనపల్లి రామ్మోహన్ రావు , ఉమ్మలాడ యాస్ ఆర్ , బొడ్డేడ లిల్లీ , అల్లవరపు రాంబాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


రూ.4కోట్లతో గంధవరంలో విత్తన శుద్ధి కర్మాగారం


రూ.4కోట్లతో గంధవరంలో విత్తన శుద్ధి కర్మాగారం



శంకు స్థాపన చేసి న విజయ్ సాయి రెడ్డి.


      విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ రంగానికి ఎంతో ప్రధాన్యత ఇస్తుందని రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయ్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీ నివాసరావులు అన్నారు. గురువారం చోడవరం పట్టణానికి తొలిసారిగా విచ్చేసిన వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ సాయిరెడ్డి మరియు మంత్రులు కురసాల కన్నబాబు అవంతి శ్రీనివాస్  అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బి.వి సత్యవతి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ లను స్వయంభు విగ్నేశ్వర స్వామి వారి ఆలయం వద్ద శాసనసభ్యులు  కరణం ధర్మశ్రీ  స్వాగతం పలికారు.. స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సిపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం సాయి రెడ్డి  ద్వారా నిర్వహించారు. అనంతరం విజయసాయి రెడ్డి కన్నబాబు అవంతి శ్రీనివాస్ శాసనసభ్యులు ఘనంగా సత్కరించారు. తరువాత గందవరం గ్రామంలో రూ.4 కోట్లరూపాయల వ్యయంతో నిర్మించనున్న విత్తన శుద్ధి కర్మాగార భవనానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.తర్వాత చోడవరం.  రైతు బజార్ ను మరియు మార్కెట్ యార్డ్ ను సందర్శించిన తర్వాత సహకార చక్కెర కర్మాగారాన్ని మంత్రులు కురసాల కన్నబాబు అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సందర్శించారు. తదనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలని ప్రజలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో సుగర్స్ ఎండి నాయుడు వైసిపి నాయకులు పాల్గొన్నారు


వేగవంతంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు



పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి


 ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్


పోలవరం పెన్ పవర్


కరొనా విపత్తు సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిపించడం గొప్ప విషయమని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవి రెడ్డి శ్రీనాథ్ అన్నారు బుధవారం పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చిన ఆయన కు పోలవరం ప్రాజెక్టు ఎస్ ఈ నాగిరెడ్డి సి ఈ  సుధాకర్ బాబు లు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఈ ప్రాంతం నుండి పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఛానల్ పనులను ఆయన పరిశీలించారు ఈ నాగిరెడ్డి వారికి జరుగుతున్న పనుల వివరాలను తెలిపారు అనంతరం పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కం రాక్ ఫీల్ రాక్ ఫీల్ డ్యాం ఎగువ దిగువ కాపర్ డ్యాం లను   శ్రీనాథ్ పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో కార్మికులు తమ రాష్ట్రాలకు వెళ్లి పోయిన కార్మికులు పనులు చేయించడం సామాన్యమైన విషయం కాదని 22 మీటర్ల వరకు ఉండే స్పిల్ వే పనులను 52 మీటర్ల వరకు త్వరితగతిన నిర్మాణం చేయడం చూస్తే మెగా కంపెనీ గుత్తేదారులు ఇంజనీర్లు పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు భావిస్తున్నానని ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి మీడియాకు పూర్తిస్థాయిలో సమాచారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు పోలవరం పనులు ప్రభుత్వం ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. అధికారులు ఇప్పటి వరకు మీడియాకు సమాచారం ఇవ్వకపోవడం తగదన్నారు. జాతీయ రాష్ట్ర మీడియా ముందుగా పోలవరం ప్రాజెక్టు ఆహ్వానించి వాస్తవ పరిస్థితులను వివరిస్తే ఈ విషయంలో మీడియా పూర్తిస్థాయిలో ప్రజలకు సమాచారం ఇస్తుందన్నారు జర్నలిస్టు అక్రిడేషన్ ఇళ్ల స్థలాలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించినట్లు తెలిపారు వైయస్ జయంతి రోజున ఆయన కన్న కలలను నిజం చేసే పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...