రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా
Followers
రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా
జగన్ గూగ్లీకి టీడీపీ బౌల్డ్
జగన్ గూగ్లీకి టీడీపీ బౌల్డ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలివిగా వేసిన గూగ్లీకి టీడీపీ క్లీన్ బౌల్డ్ అయింది. సెంటిమెంట్ తో కొట్టిన దెబ్బకు.. సెంటిమెంట్ గానే రియాక్ట్ అయింది. సన్నాయి నొక్కులు నొక్కుతూ.. అలా కాదు ఇలా కాదు అలా అంటూ చెప్పుకొచ్చింది. రెండు రోజులయ్యాక.. ఆలోచించుకుని.. ఇప్పుడు డొంక తిరుగుళ్లు మానేసి.. స్ట్రెయిట్ పాయింట్ కొచ్చేసింది. కాని అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడిక ఏం చేసినా.. అది కవర్ అయ్యే సమస్యే లేదు. జగన్ సడెన్ డెసిషన్ తో సడెన్ గా రియాక్ట్ అవ్వాల్సి రావడంతో.. కన్ఫ్యూజ్ అయిపోయి.. ఇప్పుడు తల కొట్టుకుంటున్నారు. ఇదంతా 125 అడుగు అంబేద్కర్ విగ్రహం గురించే. సడెన్ గా జగన్మోహన్ రెడ్డి విజయవాడ స్వరాజ్ మైదాన్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని.. అక్కడే స్మృతివనం కూడా నిర్మిస్తామని ప్రకటించారు. ప్రకటించిన తెల్లారే శంకుస్థాపన చేస్తారని చెప్పారు. పెట్టేది అంబేద్కర్ విగ్రహం.. అది కూడా విజయవాడ నడిబొడ్డున.. అవుననాలా.. కాదనాలా అని ఆలోచనలో పడింది తెలుగుదేశం. గతంలో చంద్రబాబు ఈ స్మృతివనం అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాన్ చేశారు. అది అక్కడ నిర్మించాల్సి ఉండగా.. జగన్ తెలివిగా దాన్ని విజయవాడకు మార్చేశారు. రాజధాని విశాఖకు మారిపోతున్నందున.. అమరావతిని మరింత బలహీనం చేసేందుకే ఈ ఎత్తుగడ వేశారని అందరికీ అర్ధమైంది. కాని టీడీపీ నేతలు మాత్రం ఈ మాట చెబుతూనే.. విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తున్నాం అన్నారు. ఒకరోజు అయ్యాక.. విగ్రహం ఇక్కడ పెట్టినా స్మృతివనం అమరావతిలోనే పెట్టాలన్నారు. ఇప్పుడు క్లారిటీ వచ్చాక.. విగ్రహం, స్మృతివనం రెండూ అమరావతిలోనే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ టీడీపీ నేతలు ఏమీ మాట్లాడటం లేదు.. కాని గుంటూరు టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనందబాబు మాత్రం అమరావతిలోనే స్మృతివనం, విగ్రహం పెట్టాలని.. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. జనానికి మాత్రం మొదటిరోజు స్వాగతిస్తున్నాం అని చెప్పిన టీడీపీ నేతల మాటలనే ఫాలో అయిపోయారు. వైసీపీ దళిత నేతలు మాత్రం దీనిని ఫుల్లు హైలెట్ చేసుకునే పనిలో పడ్డారు. అసలు మహానుభావుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏ మాత్రం గౌరవించకుండా.. ఆ నిబంధనలన్నిటికి తూట్లు పొడవటమే కాక.. తాననుకున్నదే రాజ్యాంగంలా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి అనర్హుడు.. ఈ మాట మాత్రం ఒక్క టీడీపీ నేత కూడా అనలేకపోయారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారం, పంచాయతీ ఆఫీసుకు పార్టీ రంగుల వ్యవహారం, డిపార్ట్ మెంట్ల తరలింపు, మండలి రద్దు.. మండలిలో రెండుసార్లు బిల్లులు పెట్టడం.. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి..చెప్పడానికి .. కాని ఇవేమీ ఎత్తకుండా.. అంబేద్కర్ విగ్రహం అనే సబ్జెక్ట్ లో పడిపోయి.. టీడీపీవాళ్లు ఘోరంగా దెబ్బ తిన్నారు. అంతేకాదు.. ఇదే స్వరాజ్ మైదాన్ ను అమ్మేయాలని కూడా ప్రభుత్వం ప్రయత్నించింది.. ఆ విషయం కూడా ఎవరూ నొక్కి చెప్పలేదు. కాని ఇప్పుడు ఏం చెప్పినా.. ఎవరూ పట్టించుకునే పరిస్ధితిలో లేరు.
ఆందోళనకు పిలుపునిస్తాం: ' అంబేద్కర్ విగ్రహం'పై నక్కా ఆనంద్ బాబు
రాత్రికి రాత్రి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏముంది..
ఆందోళనకు పిలుపునిస్తాం: '
అంబేద్కర్ విగ్రహం'పై నక్కా ఆనంద్ బాబు
అమరావతి ప్రాంతంలో అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణంలో ఉంది
దాన్ని పూర్తి చేయకుండా విజయవాడలో నిర్మించాలనుకోవడం మంచిది కాదు
తాడేపల్లిలో ఉండి ఆన్ లైన్లో శంకుస్థాపన చేశారు
విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ స్మృతి వనాన్ని పూర్తి చేయకుండా... విజయవాడలో నిర్మించాలనుకోవడం మంచిది కాదని విమర్శించారు. విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న తాడేపల్లిలో ఉండి కూడా ఆన్ లైన్లో శంకుస్థాపన చేశారని... ఇది అంబేద్కర్ ను కించపరిచినట్టేనని అన్నారు. ఈ అంశంపై కనీసం ఎవరితో చర్చించలేదని ఆనంద్ బాబు దుయ్యబట్టారు. ఇంత హడావుడిగా రాత్రికి రాత్రి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారో అక్కడే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర స్థాయి ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
నెల్లూరులో డిగ్రీ విద్యార్థిని సెల్ఫీ సూసైడ్
నెల్లూరులో డిగ్రీ విద్యార్థిని సెల్ఫీ సూసైడ్
ఫ్యాన్ కు ఉరేసుకుంటూ వీడియోలో చిత్రీకరించిన అమ్మాయి
కుటుంబ సభ్యులు వచ్చేసరికి మృతి
ముగ్గురు యువకుల వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు
నెల్లూరులో బీవీ నగర్ లో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. సెల్ఫీ వీడియో అనంతరం ఆమె తనువు చాలించడం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుంటూ వీడియోలో చిత్రీకరించింది. ఈ వీడియోను కుటుంబ సభ్యులు ఆలస్యంగా చూడడంతో అప్పటికే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తలుపులు పగులగొట్టి చూసేసరికి విద్యార్థిని మృతి చెందింది. ముగ్గురు యువకుల వేధింపులే కారణమని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.
స్పీకర్ తమ్మినేని వెళ్లిపోయిన తర్వాత, రెండు వర్గాలుగా చీలి కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు
స్పీకర్ తమ్మినేని వెళ్లిపోయిన తర్వాత,
రెండు వర్గాలుగా చీలి కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు
శ్రీకాకుళంలో రైతు భరోసా కేంద్రానికి స్పీకర్ శంకుస్థాపన
చొక్కాలు చిరిగిపోయేలా కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు
నాయకులు సర్దిచెప్పడంతో సద్దుమణిగిన ఘర్షణ
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలి ముష్టి యుద్ధానికి దిగారు. ఓ వీధి పోరాటాన్ని తలపించేలా కొట్టుకున్నారు. ఇదంతా స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్లిన అనంతరం జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం జిల్లాలోని ఆమదాలవలస మండలం దన్ననపేటలో రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన వెళ్లాడో, లేదో స్థానిక వైసీపీ కార్యకర్తల్లో వైషమ్యాలు బట్టబయలయ్యాయి. పోలీసులు ఉన్నా గానీ లెక్కచేయకుండా చొక్కాలు చిరిగిపోయేలా పరస్పరం దాడులు చేసుకున్నారు. నాయకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆయుధాలను పరీక్షించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆయుధాలను పరీక్షించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
కమాండో దుస్తుల్లో ఏపీ డీజీపీ
షార్ట్ వెపన్స్ ను పరిశీలించిన వైనం
ఫైరింగ్ రేంజ్ లో నైపుణ్యాన్ని పరీక్షించుకున్న సవాంగ్
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కు చెందని ఫైరింగ్ రేంజ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ కమాండో దుస్తుల్లో కొత్తగా కనిపించారు. ప్రత్యేక బలగాలకు అందించే అత్యాధునిక షార్ట్ వెపన్స్ ను ఆయన పరీక్షించారు. ఓ అత్యాధునిక తుపాకీని లక్ష్యానికి ఎక్కుపెట్టి పలు రౌండ్లు కాల్చారు. అంతేకాదు, ఎడమ చేత్తో పిస్టల్ పట్టుకుని తన నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు
వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌తో ఠాకూర్లపై మండిపడుతున్న బ్రాహ్మణులు
వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌తో ఠాకూర్లపై
మండిపడుతున్న బ్రాహ్మణులు
ఉత్తరప్రదేశ్‌లో కుల రాజకీయం అన్ని రాజకీయపక్షాలకు అచ్చొచ్చిన అంశం! కుల రాజకీయ ప్రయోగాలు సదా విజయం సాధిస్తూనే ఉంటాయక్కడ! గత పాతికేళ్లుగా అక్కడ సాగుతున్నవి అవే! ఇప్పుడు వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో మరోసారి కులాల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది..
మొదట్నుంచి అక్కడ ఠాకూర్లకు, బ్రాహ్మణులకు పడదు.. అసలు ఠాకూర్ సామాజికవర్గమైన యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొబెట్టినప్పుడే చాలా మంది బ్రాహ్మణులు ముఖం మార్చుకున్నారు.. ఇప్పుడు వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో బ్రాహ్మణ సామాజికవర్గం యోగిపై కారాలు మిరియాలు నూరుతోంది.. ఎన్‌కౌంటర్ చేసింది వికాస్‌దూబే అనే గ్యాంగ్‌స్టర్‌ను కాదని, బ్రాహ్మణ గౌరవ ప్రతిష్టలను అని సోషల్ మీడియాలో యూపీ బ్రాహ్మణ వర్గాలు మొత్తుకుంటున్నాయి. బ్రాహ్మణ సామాజికవర్గానికి అమితంగా ప్రేమించే, గౌరవించే పులిలాంటి వ్యక్తిగా వికాస్ దూబేను కీర్తిస్తున్నాయి. అక్కడితో ఆగకుండా పరుశురాముడి ప్రతినిధి అంటూ ప్రస్తావిస్తున్నాయి.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...