Followers

ఉప్పరపల్లి లో ఘనంగా లింగమంతుల జాతర:హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్.

 ఉప్పరపల్లి లో ఘనంగా లింగమంతుల జాతర:హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్. 

మహబూబాబాద్/పెన్ పవర్;


మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామం లో బుధవారం లింగమంతుల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా యాదవ కులస్తులు తమ ఇంటి నుంచి బోనాలు ఎత్తుకుని ఆలయ ప్రాంగణానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోళ్లను యాటలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ రంగారావు, జడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, దామర కొండ ప్రవీణ్ కుమార్, సర్పంచులు సారయ్య బట్టి శ్రీను సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు

హమాలీలను దోచుకుంటున్నా ప్రభుత్వం

 హమాలీలను దోచుకుంటున్నా ప్రభుత్వం

 మహబూబాబాద్ ,పెన్ పవర్ ;

పెంచిన హమాలీ రేట్లను అమలు చేయకుండా ప్రభుత్వం హమాలీల శ్రమను దోచుకుంటోందని ఏఐటీయూసీ మండల కార్యదర్శి మంద భాస్కర్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాం ఎదురుగా ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లయిస్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో కళ్లు, చెవులు ,నోరు మూసుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంద భాస్కర్ మాట్లాడుతూ దారిద్ర్య  రేఖకు దిగువనున్న ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యం ను సకాలంలో చేర్చేందుకు హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్లు హమాలీలకు పెరగాల్సి ఉండగా గత సంవత్సరం నవంబర్ రెండున నూతన రేట్ల   విషయమై సివిల్ సప్లై అధికారులు మరియు యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి చర్చించి ఎగుమతి దిగుమతి క్వింటా ఒక్కంటికి 18 రూపాయలనుండి23 రూపాయల వరకు పెంచి ఆమోదం తెలిపారన్నారు.పెంచి నాలుగునెలలు అవుతున్నా నేటికీ అమలు చేయడంలో గానీ,జీవోను విడుదల చేయడం లో  ప్రభుత్వం మరియు సివిల్ సప్లయ్ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హమాలీలు శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఒప్పందం ప్రకారం నూతన రేట్లు అమలు చేసేదాకా  నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే రేట్లు దేనికి సరిపోవని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని ,హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనివ్వవ, గత ఒప్పందం ప్రకారం ఈఎస్ఐ సౌకర్యం తక్షణమే  కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు వడ్డెబోయిన లక్ష్మీనర్సయ్య, బుక్యా వీరన్న,నరముల యాకయ్య ,  యాకూబ్ రెడ్డి , సూరారెడ్డి, రాజు' శ్రీను , భిక్షపతి, వెంకన్న,మాణిక్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన జాగృతి వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షులు కత్తి బాల కోటయ్య కు సన్మానము

 గిరిజన జాగృతి వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షులు కత్తి బాల కోటయ్య కు సన్మానము

  పెన్ పవర్ ఉలవపాడు 

       సింగరాయకొండ mpdo కార్యాలయము నందు జరిగిన ఫోరమ్ పర్  ఆ .ర్ .ఐ .నిర్వహించిన సభలో కరోనా విజ్రంభించిన సమయములో ఉలవపాడు మండలములో వివిధ సేవా కార్యక్రమాలు చేప్పట్టిన సందర్భముగా కత్తి బాల కోటయ్య గార్ని సమాచార హక్కు చట్టము వారు ఘనo గా సన్మానించి నారు .ఉలవపాడు మండల ఫోరమ్ పర్ ఆ .ర్ .టి .ఐ .మండల కన్వీనర్ గా నియమిచటము జరిగింది .ఆ .ర్ .టి .ఐ .ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఫోరమ్ అధ్యక్షులు వారు కోరారు .ఫోరమ్ పర్ ఆ .ర్ .టి .ఐ .జిల్లా కన్వీనర్ ఎం .గోoపాల కృష్ణ గిరిజన జాగృతి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల వెంకట పతి రాష్ట్ర ఉపాధ్యక్షులు చలంచర్ల ప్రసాద్  యానాది సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసులు  రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేవూరి పద్మ జిల్లా అధ్యక్షులు బాపట్ల చిన్న బ్రహ్మయ్య  జాగృతి వేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలు కె .నారాయణమ్మ మండల నాయకులు నంబూరి వెంకటేశ్వరులు సురేష్ తదితరులు పాల్గొన్నారు .

   



వాడపల్లి వెంకన్న కు మొక్కుబడులు తీర్చుకుంటున్న భక్తులు

 వాడపల్లి వెంకన్న కు మొక్కుబడులు తీర్చుకుంటున్న భక్తులు

 పెన్ పవర్ ఆత్రేయపురం 


 ఆత్రేయపురం మండలం వాడ పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు పద్మావతి సమేత   వాడపల్లి గ్రామం లో కొలువై ఉన్నాడు ఈ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రంలో  నలుమూలల నుండి భక్తులు తరలి వస్తున్నారు కోరుకున్న కోరికలు తీర్చే     వెంకన్నకు ఈరోజు ఒక భక్తులు రావులపాలెం  గ్రామానికి చెందిన  మల్లిడి ఆంజనేయులు రెడ్డి తులాభారం వేయించుకున్నారు ఈ తులాభారం లో 85 కేజీలు బెల్లంతో  వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి తీసుకోవడం జరిగినది అనంతరం ఆ స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులును మర్యాదపూర్వకంగా కలిసిన గబ్బర్ సింగ్

 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులును  మర్యాదపూర్వకంగా కలిసిన గబ్బర్ సింగ్

  పెన్  పవర్ ఆత్రేయపురం 

 
ఆత్రేయపురం మండలం   ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆత్రేయపురం మండలంలో ఉన్న 17 గ్రాముల గాను పంచాయతీ ఎన్నికలు జరగగా అందులో పది గ్రామపంచాయతీలో  వైసీపీ కైవసం చేసుకుంది మిగతా  7 గ్రామపంచాయతీలో తెలుగుదేశం కైవసం చేసుకోగా మండలంలో ఆత్రేయపురం గ్రామపంచాయతీ హోరాహోరి జరిగిన ఎన్నికల్లో 14 వార్డ్ నెంబర్ గాను  పది వార్డులను వైసిపి కైవసం చేసుకుంది తెలుగుదేశం మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట రాజు గబ్బర్ సింగ్ కేవలం నాలుగు వార్డుల్లో సత్తా చాటుకుని  సర్పంచ్ అభ్యర్థిని గడ్డం సుధా 443 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది గబ్బర్ సింగ్ చేసిన కృషికి ఫలితముగా ఆత్రేయపురం గ్రామ ప్రజలు గబ్బర్ సింగ్ బలపరిచిన అభ్యర్థిని పంచాయతీ సర్పంచ్ గా గెలిపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు మండల డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం అమలాపురం పార్లమెంటు  అధ్యక్షురాలు  రెడ్డి అనంతలక్ష్మి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ల దగ్గర నుండి  సలహాలు సూచనలు తీసుకోవడం జరిగినది.

అధికారమివ్వండి ... అభివృద్ది చేసి చూపిస్తా

 అధికారమివ్వండి ... అభివృద్ది చేసి చూపిస్తా

 24వ వార్డులో వైసిపి అభ్యర్ధి ఏకా శివప్రసాద్ 

 నర్సీపట్నం  పెన్ పవర్ 

నర్సీపట్నం మున్సిపాలిటీ 24వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకా శివప్రసాద్ , తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. సహజంగా సౌమ్యుడు, పట్టభద్రుడైన ఏకా శివప్రసాద్ కు వార్డులో మంచి పేరుంది. కరోనా వంటి కష్టకాలంలో పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేయడంతోపాటు, గత రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే అండదండలతో వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వార్డు అవసరాలకోసం చిన్న చిన్న పనులు, తన సొంత నిధులతో పూర్తి చేస్తూ, వార్డు ప్రజల మన్ననలు పొందుతూ వచ్చారు. ప్రస్తుతం 24వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏకా శివప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. రానున్న కాలంలో ఎమ్మెల్యే అండదండలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తానని భరోసా ఇస్తున్నారు. వార్డు సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, ఒక్క అవకాశం ఇస్తే ఎమ్మెల్యే సహకారంతో వార్డు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని శివప్రసాద్ హామీ ఇస్తున్నారు.

తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసిన గబ్బర్ సింగ్

 తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసిన గబ్బర్ సింగ్

 పెన్  పవర్ ఆత్రేయపురం 

 ఆత్రేయపురం మండలం   ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆత్రేయపురం మండలంలో ఉన్న 17 గ్రాముల గాను పంచాయతీ ఎన్నికలు జరగగా అందులో పది గ్రామపంచాయతీలో  వైసీపీ కైవసం చేసుకుంది మిగతా  7 గ్రామపంచాయతీలో తెలుగుదేశం కైవసం చేసుకోగా మండలంలో ఆత్రేయపురం గ్రామపంచాయతీ హోరాహోరి జరిగిన ఎన్నికల్లో 14 వార్డ్ నెంబర్ గాను  పది వార్డులను వైసిపి కైవసం చేసుకుంది తెలుగుదేశం మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట రాజు గబ్బర్ సింగ్ కేవలం నాలుగు వార్డుల్లో సత్తా చాటుకుని  సర్పంచ్ అభ్యర్థిని గడ్డం సుధా 443 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది గబ్బర్ సింగ్ చేసిన కృషికి ఫలితముగా ఆత్రేయపురం గ్రామ ప్రజలు గబ్బర్ సింగ్ బలపరిచిన అభ్యర్థిని పంచాయతీ సర్పంచ్ గా  గెలిపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశంఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు మండల డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం అమలాపురం పార్లమెంటు  అధ్యక్షురాలు  రెడ్డి అనంతలక్ష్మి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ల దగ్గర నుండి  సలహాలు సూచనలు తీసుకోవడం జరిగినది.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...