ఔట్ గేట్లో వంశి గారి ఎన్నికల ప్రచారంలో ఘన స్వాగతం పలికిన స్థానిక మహిళలు, యువత..
పెన్ పవర్ విశాఖపట్నం
ఔట్ గేట్లో వంశి గారి ఎన్నికల ప్రచారంలో ఘన స్వాగతం పలికిన స్థానిక మహిళలు, యువత..
పెన్ పవర్ విశాఖపట్నం
నిర్వాసితుల భూములు తిరిగి వెనక్కి ఇవ్వాలని - ఆర్ కార్డు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి
నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ఇచ్చిన భూములు నేడు ప్రైవేటీకరణ చేస్తారు కాబట్టి నిర్వాసితుల భూములు తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్వాసితులు ఉద్దేశించి ఎమ్మార్వో కార్యాలయం దగ్గర, గాజువాకలో తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రసంగించారు.ఆనాడు మొత్తం 22 వేల ఎకరాల భూమి రైతుల దగ్గర తీసుకున్నారు అందులో 13 వేల ఎకరాలు స్టీల్ ప్లాంటు నిర్మాణానికి క్వార్టర్స్ , పార్కుల, విద్యాలయాలు పెట్రోల్ బంకులు చేపట్టారు మిగిలిన తొమ్మిది వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉంది కాబట్టి ఆ భూములు నిర్వాసితులకు పంపిణీ చేయాలని రామ్ డిమాండ్ చేశారు.స్థానికులకు అవకాశం కల్పించకుండా పక్క రాష్ట్రాలైన ఒరిస్సా , బీహార్ , వెస్ట్ బెంగాల్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పటికైనా సరే ఏవైతే ఆర్ కార్డు నిరుద్యోగ సమస్య ఉన్నాయో 8500 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పేద ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ - అదితి గజపతిరాజు
విజయనగరం,పెన్ పవర్
పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటూ, వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అదితి గజపతిరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం 7వ డివిజన్లో, సాయంత్రం 36వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ కార్పొరేషన్ లో పన్నులను పెంచుతూ వైకాపా ప్రభుత్వం జీవోలను జారీ చేసిందన్నారు. పెంచిన పన్నులను తగ్గించేవరకు తెలుగుదేశం పార్టీ తరపున పోరాటం చేస్తామన్నారు. నిత్యవసర ధరలు పెరగడంతో సామాన్యుల జీవనం దుర్భరమైందన్నారు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని వాలంటీర్లు ద్వారా బెదిరింపులు చేయడం దారుణమన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వైకాపా నాయకులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌ను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. వైకాపా అవినీతి పాలను ప్రజలు బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, మేయర్ అభ్యర్ధి కంది శమంతకమణి, మాజీ మున్సిపల్ చైర్మన్లు ప్రసాదుల రామకృష్ణ, ప్రసాదుల కనకమహాలక్ష్మి, 36 డివిజన్ టీడీపీ కార్పొరేట్ అభ్యర్ధి బమ్మిడి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కంప్యూటర్ శిక్షణ
లక్షెట్టిపెట్ / పెన్ పవర్:
పట్టణంలోని ఆంధ్రబోర్ లో గల ధర్మన్న జనసేవ కేంద్రంలో ప్రధానమంత్రి ఆశయ సాధనలో బాగంగా అంగన్వాడీ,ఆశ కార్యకర్తలకు మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభిస్తునట్లు,ధర్మన్న జనసేవ నిర్వహికులు గురువారం తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహికులు మాట్లాడుతూ మహిళలకు అంగన్వాడీ,ఆశ కార్యకర్తలకు తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు డిజిజల్ పరిజ్ఞానం ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ టైపింగ్, కంప్యూటర్ గురించి తరగతులు చెప్తునట్లు తెలిపారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిరుదుల సంతోష్, అంగన్వాడీ,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళ ఆత్మ రక్షణ పై అవగాహన సదస్సు
మందమర్రి / పెన్ పవర్ :
సమాజంలో స్త్రీల పై దాడులు అధికమవుతున్నాయని, దాడి జరుగుతున్న సమయంలో మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, ఆ సమయంలో ఏం చేయాలి ఇలాంటి విషయాలపై ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మహిళ దైర్యంగా ఉండాలని, మీ దైర్యమే మీకు రక్షణ అని పేర్కొన్నారు. ఎవరైనా మహిళలు ఎలాంటి ఆపదలకు, వేదింపులకు గురి అయితే దైర్యంగా షీ టీంను సంప్రదించాలని, ఎవరైన అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలిస్ స్టేషన్ కీ సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా పట్టణ ప్రముఖ కరాటే మాస్టర్. రంగు శ్రీనివాస్ ఆత్మ రక్షణకు మెరుగైన మెలకువలు, సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్, ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్, కెప్టెన్ రాజు, లోబో చింటూ, బన్నీ, పాఠశాల ఉపాద్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం పెన్ పవర్
విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతాపరమైన చర్యలుచేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఫిబ్రవరి 25, గురువారం నాడు ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పోలీసు అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ - విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, నెల్లిమర్ల నగరపంచాయతీలకు మార్చి 10న జరగబోవు ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలను చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పార్వతీపురంకు అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావును, సాలూరు మున్సిపాల్టీకి ఓఎస్ డి ఎన్.సూర్యచంద్రరావు, బొబ్బిలికి డిఎస్పీ బి.మోహనరావు, విజయనగరంకు పి. అనిల్ కుమార్, నెల్లిమర్లకు సిసిఎస్డి ఎస్పీ జె.పాపారావులను ప్రత్యేకంగా పర్యవేక్షణాధికారులుగా నియమించామన్నారు. హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ వార్డులను,తగాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను డిఎస్పీలు, సిఐలు సందర్శించి,గొడవలు జరగకుండా అక్కడి ప్రజలతో అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో గొడవలు జరిగిన ప్రాంతాలను, ఆయా గొడవల్లో నిందితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వార్డుల్లో సమస్యలు సృష్టించే వారిని ముందుగా గుర్తించి, మంచి ప్రవర్తనకుగాను మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు వద్ద వారి నుండి బాండులు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమన్వయంగా మెలిగి, మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.రెవెన్యూశాఖ నుండి కూడా ఒక్కొక్క మున్సిపాల్టీకి ప్రత్యేకాధికారులను ఉన్నతాధికారులను నియమించిందని, వారితో సంయుక్తంగా వార్డుల సందర్శన చేయాలని, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వార్డుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేకంగా కొద్దిమంది పోలీసు సిబ్బందిని నియమించి, ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. సెక్షను 30 పోలీసు చట్టం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్నందున పోలీసుశాఖ నుండి ముందస్తు అనుమతులు లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలనుకొంటే తప్పనిసరిగా పోలీసుశాఖ నుండి ముందస్తు అనుమతి పొందాలన్నారు. వాహన తనిఖీలు, నాఖాబందీలు ఆకస్మికంగా చేపట్టాలన్నారు. వాహనాలు, మైక్ పెర్మిషన్లును సంబంధిత డిఎస్పీలు వారు ఇచ్చిన దరఖాస్తులను కుణ్ణంగా పరిశీలించిన తరువాతనే అనుమతులు మంజూరు చేయాలన్నారు.సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ వార్డుల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్లాగ్ మార్చ్ లు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు, విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, బొబ్బిలి బి.మోహనరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, సిసిఎస్ డిఎస్పీ జె.పాపారావు, ఎస్సీ మరియు ఎన్టీ సెల్ డిఎస్పీలు ఆర్.శ్రీనివాసరావు, పి. రామారావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్బీ సిఐలు జి. రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, రుద్రశేఖర్,డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు, 1వ పట్టణ సిఐ జె.మురళి, 2వ పట్టణ సిఐ సిహెచ్. శ్రీనివాసరావు, రూరల్ సీఐ టి.ఎస్.మంగవేని, సాలూరు సిఐ అప్పలనాయుడు, బొబ్బిలి సిఐ కె.కేశవరావు, ఎస్టలు ఫకృద్దీన్,పి.నారాయణరావు, కళాధర్,దామోదరరావు, ధనుంజయనాయుడు,అశోక్ కుమార్, గంగరాజు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పెన్ పవర్,విజయనగరం
జిల్లాలో స్థానిక సంస్థల నుండి గ్రంధాలయ సంస్థకు రావాల్సిన సెస్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా చొరవ చూపాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కె.దయానంద్ JC కిశోర్ కుమార్ ను కోరారు. గురువారం నాడు పార్టీ సభ్యులతో జాయింట్ కలెక్టర్ ను కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా దయానంద్ మాట్లాడుతూ గత పదేళ్లుగా జిల్లాలో వున్న మున్సిపాలిటీ లు, పంచాయతీల నుండి సుమారు 10 కోట్ల రూపాయలు వరకూ రావాల్సి ఉందని, సకాలంలో సెస్ అందకపోవడం వలన నిధుల కొరత ఏర్పడిందని అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి నిధుల కొరత తీవ్ర ఆటంకంగా మారిందని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 40శాఖ గ్రంధాలయాలు వున్నాయని , అందులో 20 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తుండగా 10 గ్రంధాలయాలు దాతల విరాళం తోనూ, మరో 10 అద్దె భవనాల్లోనూ నడుస్తున్నాయని అన్నారు. గతం కన్నా గ్రంథాలయాలకు వచ్చే యువత, విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని, అయితే అవసరమైన పుస్తకాలు, మౌలిక సదుపాయాలు కొరవడ్డాయని, దీనికి కారణం నిధుల కొరతేనని అన్నారు. మీ-సేవా కేంద్రాలలో చెల్లించే పన్నుల ద్వారా గ్రంధాలయ సెస్ వెంటనే సంస్థకు చేరుతున్నా మున్సిపాలిటీలు, పంచాయతీలలో నేరుగా చెల్లిస్తున్న పన్నుల ద్వారా రావాల్సిన సెస్ మాత్రం పదేళ్లుగా గ్రంధాలయ సంస్థకు చేరకపోవడం దారుణమని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి కొత్తగా ప్రజాప్రతినిధులు ఎన్నికైనందున గ్రంధాలయ సెస్ వేరే కార్యక్రమాలకు వెచ్చించకుండా తక్షణమే సెస్ మొత్తాన్ని స్థానిక సంస్థల నుండి గ్రంధాలయ సంస్థకు ఇప్పించేలా చొరవ చూపాలని ఆయన కోరారు. జేసీ ని కలిసిన వారిలో యూత్ కన్వీనర్ రొబ్బా లోవరాజు, నియోజకవర్గం కన్వీనర్ తిప్పాన కోటేశ్వరరావు, విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...