Followers

తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చో డానికి కారణం మేం కాదా

 తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చో డానికి కారణం మేం కాదా                

టీజెఎస్ నేత  ప్రొఫెసర్ కోదండరాం

నెల్లికుదురు,పెన్ పవర్. 

కేసీర్ సార్ మీరు కుర్చీలో కూర్చో డానికి కారణం మేం కాదా?అయినప్పుడు ప్రజల అవసరాలకు కావలసినవి మేం అడుగుతే తప్పేంటి?అని టీజేఎస్ పార్టీ  అధ్యక్షులు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ  అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యమంత్రి కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహుబూబబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రం  అంబేద్కర్ సెంటర్లో హాజరైన పట్టభద్రులు, ప్రజలను  ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం అణచివేత ధోరణి పాల్పడుతోందని ఇదేమిటని అడిగితే అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారో  కనీసం చెప్పకపోవడం దారుణమన్నారు.నీళ్లు నియామకాలు నిధుల కోసం ఏర్పడిన తెలంగాణలో ఇంతవరకు  ఏమి నెరవేర లేదన్నారు.తాము పదవుల కోసం మాట్లాడడం లేదని పదవి కావాలంటే ఏనాడో అడిగి తీసుకునే వాడిని అని జయశంకర్ సార్ కోరిక మేరకే ప్రజల పక్షాన కొట్లాడుతున్న అన్నారు.ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తోందని నియంత్రిత సాగు పేరుతో రైతుల ను ఇబ్బంది పెట్టిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.ఉద్యోగులకు నిరుద్యోగులు వెరసి అన్ని వర్గాల ప్రజల పక్షాన మరింతగా పోరాడి సమస్యలను సాధించుకోవడానికి తమకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.అనంతరంస్థానిక ప్రభుత్వ కళాశాల పాఠశాలలో నీ అధ్యాపకులు ఉద్యోగులను తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు . ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షులు డోలి సత్యనారాయణ,నాయకులు పిల్లి సుధాకర్ ఆరుద్ర పరమాత్మ చారి ఇరుగు మనోజ్ రాజ కు మార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

అంబిర్ చెరువును పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ

 అంబిర్ చెరువును పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ

కూకట్ పల్లి,పెన్ పవర్



ప్రగతినగర్ అంబీర్ చెరువు సుందరీకరణ పనులను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీల గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజు యాదవ్ తో కలిసి పరిశీలించిన  ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తితో శుక్రవారం అంబిర్ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వేగవంతం చేసి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈసందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, గోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నాయినేని చంద్రకాంత్, జోగిపేట్ భాస్కర్, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

కొల్లి సింహాచలం కు ఘనస్వాగతం పలికిన కోటవీది ముస్లిం పెద్దలు,స్థానికులు

కొల్లి సింహాచలం కు ఘనస్వాగతం పలికిన కోటవీది ముస్లిం పెద్దలు,స్థానికులు




మహారాణి పేట, పెన్ పవర్



39 వ వార్డు లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం కోటవీధి ముస్లిం  ఆజి అబు సరంగి మసీద్  దగ్గర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు ఘనస్వాగతం పలికారు.39వ వార్డ్ ఎన్నికల ప్రచారంలో  భాగంగా ఈరోజు కార్పొరేటర్ అభ్యర్థి కోల్లి సింహాచలం ముస్లిం ఆజి అబు సరంగి మసీద్ కి వెళ్లి  అక్కడ ప్రార్థనలు చేసి అనంతరం అక్కడ ఉన్న మత పెద్దలు, కలిసి  జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో గెలిపించ వలసినదిగా ప్రతి ఒక్కరిని కోరారు.శుక్రవారం సందర్భంగా స్థానిక ముస్లిం మహిళల తో కలిసి  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు. స్థానిక మహిళలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన..

 పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన..              

బెల్లంపల్లి రూరల్ , పెన్ పవర్

దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నీరసనగ శుక్రవారం సింటా, ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ బందులో భాగంగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్నాల ఫ్లై ఓవర్ నుండి కాల్ టెక్స్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిరాజోద్దీన్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్,డీజిల్ రేట్లను తగ్గించాలని,పెట్రోల్,డీజిల్ ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని,స్క్రాప్ట్ పాలసీని అమలు చేయాలని,థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని,గ్రీన్ టాక్స్ వసూలు నిర్ణయాన్ని విరమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సందీప్,పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన.......                    

బెల్లంపల్లి రూరల్ /పెన్ పవర్...

దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నీరసనగ శుక్రవారం సింటా, ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ బందులో భాగంగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్నాల ఫ్లై ఓవర్ నుండి కాల్ టెక్స్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిరాజోద్దీన్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్,డీజిల్ రేట్లను తగ్గించాలని,పెట్రోల్,డీజిల్ ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని,స్క్రాప్ట్ పాలసీని అమలు చేయాలని,థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని,గ్రీన్ టాక్స్ వసూలు నిర్ణయాన్ని విరమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సందీప్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కమిటీ నాయకులు ఎండి ఎజాజ్, అప్జల్, సలీమ్,ముజాంబిల్,రాజు,తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కమిటీ నాయకులు ఎండి ఎజాజ్, అప్జల్, సలీమ్,ముజాంబిల్,రాజు,తదితరులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం 32 వ వార్డులో విజయవంతం...

 టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం 32 వ వార్డులో విజయవంతం...



బెల్లంపల్లి ,  పెన్ పవర్ 

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని 32వ వార్డు కౌన్సిలర్ నీలి. కృష్ణ ఆధ్వర్యం పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కనులపండువగా విజయవంతం చేశారు. శుక్రవారం పూర్తి చేసిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం బుక్కులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు ఇచ్చి, టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వార్డ్ ప్రజలకు, సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన, ప్రతి ఒక్కరికి వార్డు కౌన్సిలర్ కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు 32 వార్డు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాల ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే చిన్నయ్య

 ఆశ్రమ పాఠశాల ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే చిన్నయ్య


బెల్లంపల్లి రూరల్, పెన్ పవర్

 కాసిపేట మండలంలోని రేగులగూడెం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆకస్మిక తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్బంగా వారు తరగతి గదులలో కరోనా నిబంధనలను పాటించి,విద్యాబోధన చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ , వైస్ ఎంపీపీ విక్రమ్, జడ్పీటీసీ చంద్రయ్య , మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి , మండల సర్పంచ్లు ఆడే జంగు,శ్రీనివాస్,ఎంపీటీసీలు,తెరాస నాయకులు,మాజీ జడ్పిటిసి సత్తయ్య,పొశం, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రంలో సీఐటీయూ, గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో రహదారి పై రాస్తారోకో

మండల కేంద్రంలో సీఐటీయూ, గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో రహదారి పై రాస్తారోకో









 గూడెం కోత్తవీధి పెన్ పవర్

62 మంది శాసనసభ్యులు, 8 మంది ఎంపీలు రాజీనామా చేయటంతో పాటు 32 మంది ప్రాణత్యాగాలు ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ కానివ్వదంటూ సిఐటియు అధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు,ఈ కార్యక్రమంలో మండల సీఐటీయూ కార్యదర్శి అంపురింగి బుజ్జిబాబు మాట్లాడుతూ 62 గ్రామాల నిర్వాసితులు నుండి 22 వేల ఎకరాల భూమిని సేకరించి ఏర్పాటు చేసిన ఉక్కు కర్మాగారం ను కేంద్రంలో పాలక పార్టీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు కుట్రలు చేస్తుందని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెచ్చుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులుపరంకాకుడా కాపాడుకుందామన్నారు, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ మెంబర్ సలిమితి సాంతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట‌‌‌ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేదవారికి, మధ్యతరగతి కుటుంబాల పై పెను భారం మోపిందన్నారు, ప్రభుత్వం రంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడం, నిత్యావసర సరుకుల పై ధరలు విపరీతంగా పెంచినా ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కించుకుందనిన్నారు, వ్యవసాయానికి కూడా ప్రైవేటు చేయడానికి మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకుని వచ్చి ఆదాని, అంబానీలకు కట్టబెలని చూస్తుందని, ఉక్కు కర్మాగారంను ప్రభుత్వం రంగంలో నడిపించాలని ఆమె డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో రహదారి పై రాస్తారోకో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు లోత కన్నబాబు, మండల ఆర, ఎం, పి సంఘం అధ్యక్షుడు గోపి, మండల పిటిజి సంఘం అధ్యక్షుడు వంతల చంటి, మండల వాలంటీర్లు సంఘం అధ్యక్షుడు దుచ్చరి కోటి, మండల ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...