Followers

ప్రజల మన్ననలు పొందుతున్న 37వ వార్డు టి.డి.పి కార్పొరేటర్ అభ్యర్థి బంగారి రవి శంకర్

ప్రజల మన్ననలు పొందుతున్న 37వ వార్డు టి.డి.పి కార్పొరేటర్ అభ్యర్థి బంగారి రవి శంకర్





మహారాణి పేట, పెన్ పవర్

 జి.వి.ఎమ్.సి, దక్షిణ నియోజకవర్గం 37వ వార్డ్ టి.డి.పి, కార్పొరేటర్ అభ్యర్థి బంగారి రవి శంకర్ వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలపై  శుక్రవారం పర్యటన చేపట్టారు.వార్డు టి.డి.పి అభ్యర్ధి అయిన బంగారి రవి శంకర్ వార్డు పర్యటనలో నిమిత్తం పెయిన్ దొర పేట, రెల్లి వీధి,జబ్బరి తోట, స్కీమ్ బిల్డింగ్స్, గొల్ల వీధి,తదితర ప్రాంతాల్లో పర్యటించి, వార్డు ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బంగారి రవి  శంకర్ చేస్తున్నకార్యక్రమాలకు వార్డు ఆయన ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈకార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ కె.చిన్న,తెలుగు యువత ఉపద్యక్షులు తాతాజీ,వార్డు వైస్ ప్రెసిడెంట్ హేమలత,గంగమ్మ, సీనియర్ నాయకులు కనక రాజు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

విఆర్ఓ లు అందుబాటులో ఉండాలి..

 విఆర్ఓ లు అందుబాటులో ఉండాలి..




పెన్ పవర్,వలేటివారిపాలెం

   ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేసే కార్యక్రమంలో నోడల్ విఆర్ ఓ లు అందుబాటులో ఉండాలని తహశీల్దార్ ముజఫర్ రెహమాన్ అన్నారు.  శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  కార్డు దారులు గత నెలలో రేషన్ తీసుకోక పోతే గత నెల రేషన్,   ప్రస్తుత నెల  రెండు కలిపి ఒకేసారి రేషన్ తీసుకోవచ్చని అన్నారు. డోర్ డెలివరీ చేసే సమయంలో నోడల్ విఆర్వోలు రేషన్ మినీ ట్రక్కుల వెంట ఉండాలని చెప్పారు.  కచ్చితంగా  డోర్ టు డోర్ బండి ఆపి రేషన్ పంపిణీ చేయాలని చెప్పారు. మినీ ట్రక్కు వెల్ల లేని పరిస్థితుల్లో తప్ప లేకుంటే,  ఎక్కడా కూడా బండి ఒక చోట ఆపి రేషన్ పంపిణీ చేయరాదన్నారు.  గుంపులు గుంపులుగా చేరి అసలు రేషన్ పంపిణీ చేయకూడదని చెప్పారు.  ప్రతి కార్డు దారుడికి రేషన్ తో పాటు సంచులు ఇవ్వాలన్నారు.  మండలంలో మొత్తం 13,080. కార్డులు ఉన్నట్లు ఆయన తెలిపారు . రోజుకు కనీసం 90 కార్డులు చేయాలని చెప్పారు.   వాలంటీర్లు వారివారి పరిధిలో ఉన్న 50 ఇళ్లకు ముందుగా రేషన్ ఎప్పుడు తీసుకోవాలి అనేది తెలియజేయాలని చెప్పారు. ఎక్కడైనా డోర్ డెలివరీ చేయకుండా ఒకే చోట బండి ఆపి రేషన్ పంపిణీ చేస్తే నోడల్ విఆర్ఓ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలి...

 విశాఖ ఉక్కు కర్మాగారాన్ని  ప్రైవేటీకరించాలి...



పెన్ పవర్,ఉలవపాడు

 విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సీ.ఐ.టీ.యు,సి.పి.ఎం. ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బంద్ కార్యక్రమాని శుక్రవారం నిర్వహించారు. సిఐటియు నాయకులు  బ్యాంకులు,ప్రభుత్వ ఆఫీసులు,విద్యా సంస్థలను మూసివేయించారు.మండల కేంద్రంలో పాత బస్టాండ్ సెంటర్ నుంచి హైస్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం ప్రజా,కార్మిక,ఉద్యోగ వ్యతిరేక చర్యలు తక్షణమే మానుకోవాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జీవీబీ.కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెలికం,యల్.ఐ.సీ, బ్యాంకులు,పోర్టులు,రక్షణ రంగాలను ప్రైవేటీకరణ చేయాలని చేస్తున్న ప్రయత్నాలు దుర్మార్గమన్నారు. అన్ని అమ్మెస్తామని ప్రధాని ప్రకటించడం సిగ్గుచేటన్నారు.  అనేకమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే చర్యలు ఈ బంద్ తోనైనా మానుకోవాలని హితవు పలికారు.లేదంటే కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ బంద్ కు బ్యాంక్,రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మద్దతు ప్రకటించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.డి.గౌస్ బాషా,సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి.జె.సురేష్ బాబు,సి.ఐ.టి.యు.నేతలు వాకా.లతారెడ్డి, సిహెచ్. ఇందిరా వతి, ఎస్.డి.రసూల్ బాషా,సి.పి.ఎం.నాయకులు ఏలూరు నాగార్జున,ఆటో వర్కర్స్ యూనియన్ మండల నాయకులు పీ.మస్తాన్ రావు, షేక్.కరిముల్లా,ఎస్.డి.జహీర్, బండి సుబ్బారావు, కార్ వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్.ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం వహించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు దాతలు ముందుకు రావడం అభినందనీయం..

 సీసీ కెమెరాలు ఏర్పాటు దాతలు ముందుకు రావడం అభినందనీయం...



పెన్ పవర్,వలేటివారిపాలెం

  వలేటివారిపాలెం పంచాయతీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు.ఈ నిఘా నేత్రాల ద్వారా  నేరాలను అరికట్టేందుకు సులభంగా ఉంటుందని చెప్పారు. సాంకేతికంగా పలు కేసులను చేదించే దశలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ  జాతీయ అవార్డు చేజిక్కించుకుందని అన్నారు. నేరస్తుల కదలికలను సులభతరంగా తెలుసుకునేందుకు, కేసును త్వరితగతిన ఛేదించేందుకు మన చేతుల్లో మన భద్రత అనే కార్యక్రమాన్ని నియోజకవర్గంలో చేపట్టినట్లు ఆయన చెప్పారు.ఇప్పటివరకు కందుకూరు పట్టణం లో 45 సిసి కెమెరాలు ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం జరిగిందన్నారు. అనంతరం స్థానిక ఎస్ ఐ చావా హజారత్తయ్య  మాట్లాడుతూ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు సిసి కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం జరుగుతుందని తెలిపారు. కోటా వెంకటేశ్వర్లు 30,000,  చుండూరి మదన్మోహన్ 25,000 , రూపినేని వెంకటేశ్వర్లు 25,000 రూపాయలు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు అందజేయడం జరుగుతుంది తెలిపారు.

బెల్లంపల్లిలో ఆటోల బంద్ విజయవంతం

 బెల్లంపల్లిలో ఆటోల బంద్ విజయవంతం 



బెల్లంపల్లి,పెన్ పవర్

పెట్రోల్ , డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసిస్తూ శుక్రవారం ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండల కేంద్రంలో 24 గంటల పాటు ఆటోలో బందు నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ ఆటో యూనియన్ కట్ట రామ్ కుమార్ తో కలిసి బందులో పాల్గొన్న  ఆటో డ్రైవర్స్ ఓనర్స్ మాట్లాడుతూ, పెరిగిన పెట్రోల్ , డీజిల్ తో  సామాన్యునికి అధిక భారం పడుతుందని , మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా  ఒక రోజు పాటు ఆటోలు బంద్ నిర్వహించడం జరిగింది , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన టువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. పెరిగిన ధరలు తమపై శాపంగా మారాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్ట రామ్ కుమార్ తో కలిసి బందులో పాల్గొన్న  ఆటో డ్రైవర్స్ ఓనర్స్ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

రేపు జరిగే న్నాహక సమావేశాన్ని విజయవంతం చేయండి

 రేపు జరిగే న్నాహక సమావేశాన్ని విజయవంతం చేయండి



టిఆర్ఎస్ యువ నేత యాకాంతం గౌడ్

 నెల్లికుదురు,పెన్ పవర్

 మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించే పట్టభద్రుల సన్నాహక సమావేశా న్ని విజయవంతం చేయాలని,స్థానిక పట్టభద్రుల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లారాజేశ్వర్ రెడ్డి కి  మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని టిఆర్ఎస్ యూత్ డివిజన్ అధ్యక్షుడు చిర్రయాకాంతం గౌడ్ కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లో టిఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించి శనివారం మండల కేంద్రంలో నిర్వహించే సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పట్టభద్రులను కలిశారు.ఈ సందర్భంగా చిర్ర యాకాంతం గౌడ్ శ్రీ రామగిరి సహకార సంఘం అధ్యక్షుడు గుండవెంకన్న తో కలిసి మాట్లాడుతూ.. ప్రశ్నించడం కాదు సమస్యలను పరిష్కరించే నాయకుడిగా రాజేశ్వర్ రెడ్డి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడుగుదేవీరన్న,చిన్న ముప్పారంఎంపిటిసి కదిరిజగన్ , ఆలేరు ఉపసర్పంచ్ షేక్ షరీఫ్ సర్పంచ్ ఫోరం మాజీ మండల అధ్యక్షుడు దర్శనంబిక్షపతి, నాయకులునామాలమహేష్, రాయలిసంతోష్ తదితరులు పాల్గొన్నారు.

కోమార్బిడిటితో బాధపడేవారు కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసుకునేందుకు డాక్టర్ అనుమతి తప్పనిసరి...

 కోమార్బిడిటితో బాధపడేవారు కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసుకునేందుకు డాక్టర్ అనుమతి తప్పనిసరి...



డాక్టర్ రెడ్డి కుమారి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

పెన్ పవర్,మల్కాజిగిరి 

 కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసుకోవడానికి వచ్చే కోమార్బిడిటి వ్యాధిగ్రస్తులు గుర్తింపు పొందిన వైద్యునిచే ధ్రువ పరచిన పత్రం తీసుకురావాలని నేరేడ్మెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి  డాక్టర్ రెడ్డి కుమారి సూచించారు. కిడ్నీ, డయాబెటిస్, ఊపిరితిత్తులు, హెచ్ఐవి, హృద్రోగ సమస్యలు, క్యాన్సర్, రక్త హీనత, వ్యాధి నిరోధక శక్తి, కాలేయ, చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడే కోమార్బీ డీటి వ్యాధిగ్రస్తులు గుర్తింపు పొందిన వైద్యుని అనుమతితో కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు తప్పనిసరిగా పొందాలన్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారు టీకాలు పొందవచ్చన్నారు. కోవిడ్ టీకాలు వేయించు తెలిసినవారు ముందుగా ఆరోగ్య సేతు యాప్ లో పేరు, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆరోగ్య కేంద్రంలో ప్రతి రోజు ముందుగా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకున్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్య సేతు యాప్ లో పేరు నమోదు చేసుకోకుండా నేరుగా ఉదయం 9 గంటల సమయంలో నేరేడ్మెట్ ఆరోగ్య కేంద్రం కు ఆధార్ నెంబర్లు తో వెళ్లిన వారి పేర్లను అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బంది నమోదు చేసుకొని టీకాలు ఇవ్వడం జరుగుతుంది. టీకాలు వేసుకున్న వారిని ఆస్పత్రిలోని రెస్ట్ రూమ్ లో అరగంటపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుకొని ఇంటికి పంపించడం జరుగుతుందన్నారు. కోవిడ్ టీకాలు వేసుకునేందుకు ఆరోగ్య కేంద్రం కు వచ్చే ప్రతి ఒక్కరు మాస్కు తప్పని సరిగా ధరించి రావాలని డాక్టర్ రెడ్డి కుమారి సూచించారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్మెట్ మాతృ కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ టీకాలు ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి  సాయంత్రం 4 గంటల వరకు వేస్తున్నట్లు డాక్టర్ రెడ్డి కుమారి పేర్కొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...