Followers

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
కుత్బుల్లాపూర్,పెన్ పవర్


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ మండే మార్కెట్ వద్ద మేడ్చల్ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎరమడ హరినారాయణ పుట్టినరోజు సందర్భంగా వారి ఆధ్వర్యంలో మల్లారెడ్డి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం మరియు మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలకు బదులు పేదలకు వైద్య సేవలు అందించేందుకు హరినారాయణ ముందుకు రావడం, ఇందుకు సహకారం అందించిన మల్లారెడ్డి ఆసుపత్రి సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అడప శేషు, శ్రీకాంత్, శ్రీనివాస్, నారాయణ, నాగిరెడ్డి, మహిళా నాయకురాలు పద్మజ రెడ్డి, ఇస్మాయిల్, భద్రప్ప, చంటి తదితరులు పాల్గొన్నారు.

కునుకు పాటు లో ఉన్న మధుర్యం

కునుకు పాటు లో ఉన్న మధుర్యం

కేసముద్రం,పెన్ పవర్



 ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు అనే సామెత ను ఒక రైతు నిజం చేశాడు, కేసముద్రం మండల వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఒక రైతు తను తెచ్చుకున్న ద్విచక్రవాహనంపై  రోడ్డు పక్కన వేప చెట్టు కింద నీడ కు అలసి అదే వాహనమును పట్టుపరుపులా చేసుకొని కొద్దిసేపు కునికిపాటు లో నిద్రలోకి జారుకోవడం చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది* పెన్ పవర్ ఇది చూసి తన కెమెరాలో బంధించడం నిద్ర ఎంత సుఖాన్ని ఇస్తుందో అలసిసొలసిన వారికి క్షణ కునుకు  పాటు ఎంత సుఖాన్ని ఇస్తుందో  ఈ  ఫోటో చూస్తే అర్థమవుతుంది

చింతూరు లో బంద్ ప్రశాంతం....

 చింతూరు లో బంద్ ప్రశాంతం.... 



చింతూరు,పెన్ పవర్

 విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నందుకు నిరసన గా బంద్ ప్రశాంతం గా జరిగింది. అఖిల పక్షం  పిలపుమేరకు చింతూరు లో శుక్రవారం లో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు .హోటల్,రోడ్ పై ఏటువంటి వాహనాలను తిరగ నీయలేదు.దీంతో  చింతూరు నుండి ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా రాష్ట్ర లకు రాక పోకలు బంద్ అయ్యాయి. చట్టీ, చింతూరు, మోతుగూడెం లలో అఖిల పక్షం ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ పాటించారు. ఈ కార్య క్రమం లో సీ పీ ఐ డివిజన్ సహాయ కార్యదర్శి ఎస్కే రంజాన్, మడ దా రామ చందర్ రావు, మండల కాంగ్రెస్ సెక్రటరీ అహ్మద్ అలీ, అక్బర్, తెలుగు దేశం నాయకులు ఒబిల్ల నెని రామారావు,వెంకటేశ్వరరావు,రియాజ్, చంద్రయ్య, సీ పీ యం మండల కార్యదర్శి సీసం సురేష్,యర్రంశెట్టి శ్రీనివాస్ రావు, జనసేన నాయకులు మడివి.రాజు,పయ్యాల నాగేశ్వర్ రావు తదతరులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణ లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి

 గృహ నిర్మాణ లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి



 పెన్ పవర్, కరప

మండల పరిధిలోని గృహనిర్మాణ లబ్ధిదారుల రెండవ విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలోనే పూర్తి చేయాలని ఎంపీడీవో  కర్రె స్వప్న అన్నారు.స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం గ్రామ కార్యదర్శులు, విఆర్వోలు, సచివాలయం అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.గ్రామాల వారీగా సమీక్షించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.హౌసింగ్ డీఈఈ కె.వి.ఆర్ గుప్తా మాట్లాడుతూ మండల పరిధిలో 3,773 మంది లబ్ధిదారులు ఉండగా ఇంతవరకు 1,673 మంది పేర్లను రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు.  మిగిలినవన్నీ రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.సర్వే కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు.లబ్ధిదారుల జియోట్యాగింగ్ 1,303 మందికి చేశారని మిగిలిన లబ్ధిదారులు జియోట్యాగింగ్ సకాలంలో పూర్తి చేయాలన్నారు.  

లేఅవుట్ల లెవలింగ్ పనులపై సమీక్ష: 

మండల పరిధిలోని లేఅవుట్లలో లెవలింగ్ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో కర్రె స్వప్న అన్నారు.స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి పథకం సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో సమావేశమై లేఅవుట్ల లెవలింగ్ పనులను సమీక్షించి సూచనలు చేశారు.11 లేఅవుట్లలో లెవలింగ్ పనులు చేయాల్సి ఉందన్నారు. ఏయే గ్రామాల్లో లేఅవుట్ల చదును చేసే పనులు ఎంత వరకు జరిగింది, చేయాల్సిన పనుల పై చర్చించి ఆమె సూచనలు చేశారు.మండల ఇంజనీరింగ్ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈఈ ఎం.సోమిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ ప్రసాద్, మండల ఈ ఓపిఆర్డి సిహెచ్ బాలాజీ వెంకటరమణ మాచరర్రావు తదితరులు పాల్గొన్నారు.

ఉన్న‌త ప్ర‌మాణాల‌తో ర‌హ‌దారుల నిర్మాణాలు

 ఉన్న‌త ప్ర‌మాణాల‌తో ర‌హ‌దారుల నిర్మాణాలు



పెన్ పవర్,కాకినాడ

   ఉన్న‌త ప్ర‌మాణాల‌తో ప‌ర్యావ‌ర‌ణానికి హాని జ‌ర‌క్కుండా ర‌హ‌దారుల నిర్మాణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి, అమ‌లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) అధికారుల‌కు సూచించారు. కాకినాడ యాంక‌రేజ్ పోర్టును ఎన్‌హెచ్ 16తో అనుసంధానించే ప్రాజెక్టులో భాగ‌మైన సామ‌ర్ల‌కోట‌-అచ్చంపేట జంక్ష‌న్ నాలుగు లైన్ల ర‌హ‌దారి నిర్మాణ ప్ర‌ణాళిక‌పై శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ సామ‌ర్ల‌కోట నుంచి అచ్చంపేట వ‌ర‌కు దాదాపు 11.3 కిలోమీట‌ర్ల మేర జ‌రిగే ర‌హ‌దారి నిర్మాణంతో ఇప్ప‌టికే ఏర్పాటై ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్‌హెచ్ఏఐ రూపొందించిన అలైన్‌మెంట్ బాగుంద‌ని పేర్కొన్నారు. కొత్త రహ‌దారి నిర్మాణం వ‌ల్ల జీవీకే ప‌వ‌ర్‌ప్లాంట్‌, భార‌త ఆహార సంస్థ‌, ర్యాక్ సిరామిక్స్, చ‌క్కెర క‌ర్మాగారాలపై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌న్నారు. ‌‌కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తో చేప‌ట్టే ర‌హ‌దారుల నిర్మాణాలకు సంబంధించి వివిధ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని, ఇలాంటి మౌలిక వ‌స‌తుల అభివృద్ధి ప్రాజెక్టుల వ‌ల్ల ప్రాంతాలు ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తాయ‌ని పేర్కొన్నారు. ఇప్పుడున్న పాత ర‌హ‌దారి వ‌ల్ల చాలా ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్ర‌మాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయ‌న్నారు. కొత్త ర‌హ‌దారి నిర్మాణం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ల‌కు మంచి ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ఓడ‌రేవుల‌ను జాతీయ ర‌హ‌దారుల‌తో అనుసంధానించే భార‌త ప్ర‌భుత్వ ప్రాయోజిత కార్య‌క్ర‌మంలో భాగ‌మైన ఎన్‌హెచ్ 16-కాకినాడ పోర్టు (రాజాన‌గ‌రం-సామ‌ర్ల‌కోట‌-అచ్చంపేట‌-కాకినాడ పోర్ట్ రోడ్‌) ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు అని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ ప్రాజెక్టులోని రాజాన‌గ‌రం ఎన్‌హెచ్ 16 జంక్ష‌న్ నుంచి సామ‌ర్ల‌కోట వ‌ర‌కు ర‌హ‌దారిని ఏపీఆర్‌డీసీ చేప‌డుతుండ‌గా, అచ్చంపేట‌-కాకినాడ పోర్టు వ‌ర‌కు ర‌హ‌దారి నిర్మాణానికి ఎన్‌హెచ్ఏఐ బిడ్ల‌ను ఆహ్వానించింద‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్రాజెక్టులో భాగ‌మైన సామ‌ర్ల‌కోట నుంచి అచ్చంపేట వ‌ర‌కు ర‌హ‌దారి నిర్మాణానికి ప్ర‌‌ణాళిక‌లు రూపొందుతున్నాయ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఈ ప్ర‌ణాళిక వివ‌రాల‌ను ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ (రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) డి.సురేంద్ర‌నాథ్ ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. పాత ర‌హ‌దారి స్థితిగ‌తులు, కొత్త ర‌హ‌దారి అలైన్‌మెంట్‌, అవ‌స‌ర‌మైన భూమి, సేక‌రించాల్సిన భూమి, ఆర్‌వోబీలు త‌దిత‌ర వివ‌రాల‌ను అందించారు. స‌మావేశంలో జిల్లా పంచాయ‌తీ అధికారి ఎస్‌వీ నాగేశ్వ‌ర్ నాయ‌క్‌, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, పెద్దాపురం ఆర్‌డీవో ఎస్‌.మ‌ల్లిబాబుతో పాటు ఎన్‌హెచ్ఏఐ, గుడా, పోలీస్‌, ఎఫ్‌సీఐ, వివిధ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన సిరిపురపు

 నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన సిరిపురపు




పరవాడ,పెన్ పవర్

 మండల మేజర్ పంచాయతీ పరవాడ గ్రామ సర్పంచిగా గా  సిరిపురపు అప్పలనాయుడు,ఉప సర్పంచ్ బండారు రామారావు ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు మాట్లాడుతూ పరవాడ గ్రామ పంచాయతీ కోసం తాను అహర్నిశలు శ్రమించి మంచి పనులు చేఇస్తూ గ్రామ పురోభివృద్ధి కృషి చేస్తాను అని ప్రమాణం చేస్తున్నాను అని అన్నారు.తన విజయానికి  ఎంతగానో కృషి చేసిన పయిల శ్రీనుకు,రామునాయుడు కి కార్యకర్తలకు,స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, పరవాడ ఎం.పి.డి.ఓ హేమ సుందర రావు,ఈ. ఓ.పి.ఆర్.డి పద్మజ, పంచాయతీ అధికారి అచ్చుత రావు,మాజీ ఆర్.ఈ.సి.ఎస్ చైర్మన్ చల్ల కనకరావు,పి.ఎమ్.సి చైర్మన్ పయిల హరీష్, వార్డు మెంబెర్లు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్స్, వై.సి.పి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన

 రాష్ట్రంలో రాక్షస పాలన



విజయనగరం,పెన్ పవర్

 రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షసపాలన కొనసాగిస్తోందని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి అదితి గజపతిరాజు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం డివిజన్లో, సాయంత్రం 5, 8, 10 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అసమర్ధత వలన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పెరిగిన నిత్యవసర ధరలను నియంత్రించలేని స్థితిలో వైకాపా పాలకులు ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే టీడీపీ గెలుపునకు సోపానాలన్నారు. పోలీసు, అధికార వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పధకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఎవరి సొమ్ముతో పధకాలు ఇస్తున్నారో చెప్పాలన్నారు. వాలంటీర్లతో ప్రలోభపెట్టే కుట్రలను సాగనివ్వమన్నారు. వైసీపీకి దమ్ముంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ప్రత్యేక హెూదా వచ్చేలా చూడాలని సవాల్ విసిరారు. వైకాపా పాలనలో ఇసుక, సిమ్మెంట్, గ్యాస్, డీజిల్, పెట్రోల్, వంటనూనె ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలపై భారం పడుతోందన్నారు. పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే విజయనగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని ఒత్తిడులు చేసినా టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తూ విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బలివాడ లలిత, 5వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఎస్.సాయి నాగ బుచ్చిరాజు, 8వ డివిజన్ టీడీపీ అభ్యర్ధి నంబూరి నాగమణి, 10వ డివిజన్ అభ్యర్థి సుంకరి సునీత, టీడీపీ నాయకులు ఐవిపి రాజు, ప్రసాదుల కనక మహాలక్ష్మి, కరణం శివరామకృష్ణ, బలివాడ అప్పారావు, వారణాసి మల్లిబాబు, ప్రసాదుల ప్రసాద్, విజ్ఞపు ప్రసాద్, బొద్దల నర్సింగరావు, రౌతు నర్సింహమూర్తి, గంటా పోలినాయుడు, కిలాన మహేష్, రాజేష్, తెలుగు యువత నాయకులు, నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...