Followers

ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల భీమా.

ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల భీమా..ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

 జగిత్యాల ,పెన్  పవర్

టీఆర్ నగర్ కు చెందిన టీఆర్ ఎస్ కార్యకర్త బొమ్మిశెట్టి సాయిలు కుటుంబానికి 2 లక్షల పరిహారం అందజేత జగిత్యాల పట్టణం టీఆర్ నగర్ కు చెందిన టీఆర్ ఎస్ కార్యకర్త బొమ్మిశెట్టి సాయిలు ఇటీవల మరణించగా తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా మంజూరైన 2 లక్షల ప్రమాదభీమా చెక్కులను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆయన భార్య బుచ్చమ్మకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అందజేశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ నగర్ ప్రాంతానికి నీటికి ఇబ్బంది లేకుండా 10 కోట్ల రూపాయలతో వసతులు కల్పించామని..నీటికి ఇబ్బంది లేకుండ చర్యలు తీసుకున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి ప్రమాద భీమా ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తోందని అన్నారు.. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టుసతీష్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,47వ వార్డ్ కౌన్సిలర్ చాంద్ పాషా,రాష్ట్ర వడ్డెర సంఘ అధ్యక్షుడు వల్లెపు మోగిలి,యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి,పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు ఆనంద్ రావు,దుమాల రాజ్ కుమార్,నాయకులు భోగ ప్రవీణ్, కొండ శ్రీనివాస్,నాగేశ్వర్ రావు,కృష్ణ మూర్తి,సారయ్య, యూత్ నాయకుడు కోటగిరి సుమన్,రాజు,దాసరి ప్రవీణ్,శంకులపల్లి రాజు,తదితరులు ఉన్నారు.

వృద్ధునికి చేయూతగా లాలు యువసేన

 వృద్ధునికి చేయూతగా లాలు యువసేన


జగిత్యాల,పెన్  పవర్

కొల పోచమ్మలు అనే వృద్ధుడు గత 25 సంవత్సరల క్రితం కరీంనగర్ నుండి జగిత్యాల కు వలస వచ్చి  ట్రావెల్స్ లో 20 సంవత్సారాలు పాటు  పని చేశాడు వృదుడికి ఆనారోగ్యం బాగలేకపోవడంతో పని నుండి తీసివేయగా జగిత్యాల పట్టణంలోని పురనిపేటలో గద్దెలపై జీవిస్తూ ఉండగా గత రెండు నెలల క్రితం కాలు విరగడంతో వాకర్ స్టాండ్ మరియు ఎండ ముంచుకస్తున్న నేపథ్యంలో గ్రీన్ జలినీ ఇచ్చి  పురనిపెటలో ఉన్న  లాలు గౌడ్ యువసేన సభ్యులు పొన్నం లాలు ప్రసాద్ గౌడ్, A.రాజేష్,V.రవికుమార్ S.రవి శాస్త్రి K.శివ P.నవీన్ P.గణేష్ P.చందు నవదీప్ K. ఆకాష్ యువకులు అండగా నిలిచారు

మేడ్చల్ లో శాఖాహార, మాంసాహార మార్కెట్ల ఏర్పాటు

 మేడ్చల్ లో శాఖాహార, మాంసాహార మార్కెట్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్ శ్వేత మహంతి..

పెన్ పవర్,మేడ్చల్


మేడ్చల్ పురపాలక సంఘ పరిధిలో ఇంటిగ్రేటెడ్ శాఖహార మరియు మాంసాహార మార్కెట్లు ను ఏర్పాటు చేయుటకు స్థల పరిశీలన కోసం మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి మరియు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ సాంసాన్ మేడ్చల్ పట్టణమునకు విచ్చేశారు... మేడ్చల్ పట్టణములో ఆర్ అండ్ బి బిల్డింగ్ స్తలము మరియు పాత గవర్న్మెంట్ హాస్పిటల్, రైతు బజారు కలుపుకొని ఇంటిగ్రేటెడ్ శాఖహార మరియు మాంసాహార మార్కెట్లు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ శ్వేతా మహతి స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి మాట్లాడుతూ ప్రతి శాఖహార, మరియు మాంసాహార, దుఖాణ యజమానులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలంలోనే వ్యాపారం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ ఛైర్పెర్సన్ మర్రి దీపికా నర్సింహా రెడ్డి, వైస్ ఛైర్మన్ చీర్ల రమేశ్, 14వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేశ్, టిఆర్ఎస్ నాయకులు మర్రి నర్సింహా రెడ్డి, ఆర్. మధుకర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సాయి రాంరెడ్డి, టిపియస్ రాజీవ్ రెడ్డి, గవర్నమెంట్ సర్వేయర్ వెంకటేష్ , సానిటరీ ఇన్స్పెక్టర్ కె. రాంచందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

కెటిఆర్ భర్త్ డే గిప్ట్ గా 108 వాహనం

 కెటిఆర్ భర్త్ డే గిప్ట్ గా 108 వాహనం

పెన్ పవర్,ఎల్లారెడ్డిపేట

మన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి  కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా మన మండలానికి  108 అంబులెన్స్ మంజూరుచేశారనీ . మంజూరు చేసినందుకు మన మంత్రి  కెటిఆర్ కు ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు కృతజ్ఞతలు తెలిపారు.ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో  శనివారం 108 అంబులెన్స్ ను ఏంపిపి పిల్లి రేణుక రిబ్బన్ కత్తి రించగా .ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వేంకట్ రెడ్డి  టెంకాయలు కొట్టి  . జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు జెండా ఊపి 108 అంబులెన్స్ ను ప్రారంభించారు.  108 అంబులెన్స్ సిబ్బంది కి పోన్ చేస్తే వెంటనే స్పందించి సంఘటన  స్థలానికి వెనువెంటనే చేరుకొని  ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ఆసుపత్రిలకు తరలించి ఎందరియో  ప్రాణాలను కాపాడారని . మనకు అంబులెన్స్ వాహానం. సిబ్బంది ని మంజూరు చేసిన మన కళ్ళముందున్న దేవుళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్  మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని  ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు  అన్నారు.  ప్రమాదవశాత్తు గాయపడినవారిని. ప్రాణాపాయ పరిస్థితి లో  కొన ఊపిరి లో ఉన్న వారిని ఎందరినో వివిధ ఆసుపత్రులకు దైర్యంగా  తరలించి ఓ భాధ్యత గా   రక్షించిన 108 సిబ్బంది నీ చీటీ లక్ష్మన్ రావు అబినందించారు . 108 అంబులెన్స్ వాహనం లేనప్పుడు వివిధ యాక్సిడెంట్ లలో రోడ్లపై  ప్రమాదవశత్తు .గాయపడిన వారు కొన ఊపిరి లో   చాల మంది మరణించారనీ. వారి  కుటుంబాలు రోడ్డున పడ్డాయని. ఎందరో ఆనాదాలయ్యారన్నారు. 108 అంబులెన్స్ వాహనం .సిబ్బంది మంజూరైన తరువాత ఎన్నో మరణాలు తగ్గాయన్నారు.  108 అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎం పీ పీ  పిల్లి రేణుకయాదవ్.  ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ . ఎంపీటీసీలు ఎలగందుల అనసూయ.పందిర్ల నాగరాణి . వైద్యాధికారిని మానస.  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి. పిల్లి కిషన్ .టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి. శ్యామంతుల అనిల్ కుమార్.  వార్డ్ మెంబర్లు   పందిర్ల శ్రీనివాస్ గౌడ్ .జవ్వాజీ లింగం .సి హెచ్వో శ్రీనివాస్ రెడ్డి.  ప్రభుత్వ వైద్య సిబ్బంది 108 అంబులెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్థి వాణిదేవిని గెలిపించాలని కోరిన ఎంపీపీ..

 ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్థి వాణిదేవిని గెలిపించాలని కోరిన ఎంపీపీ..

పెన్ పవర్,మేడ్చల్

మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీపీ పద్మజగన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి ని మొదటి ప్రాధాన్యత ఓటు తో గెలిపించాలని కోరారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆయన కూతురు వాణి దేవిని గెలిపిస్తే ఓటర్లకు న్యాయం చేస్తారని అన్నారు. గత పిఆర్సి లో మంచి ఫిట్మెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి కూడా మంచి ఫిట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కరోనా కారణంగా ఎంతమేరకు ఇవ్వాలనేది యోచిస్తున్నది అని అన్నారు. ఉద్యోగులందరూ సంతృప్తి చెందేలా ఫిట్మెంట్ ఇస్తుందని చెప్పారు. టిఆర్ఎస్ ను గెలిపించాలని, ఈ విషయాన్ని మంత్రి మల్లారెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇటబోయిన బాబు యాదవ్, ఎంపీటీసీ నిరుడి రఘు, వార్డు సభ్యులు, నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయని మున్సిపల్ అధికారులు

 హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయని  మున్సిపల్ అధికారులు; రాచాల గౌడ్

వనపర్తి, పెన్ పవర్


హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న కొత్తకోట మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం ముందు అక్రమ కట్టడాలతో ఇబ్బందులకు గురవుతున్న బాధితులతో కలిసి రాచాల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాచాల గౌడ్ మాట్లాడుతూ పట్టణానికి చెందిన మ్యాదరి రాములు ఇంటికి అనుకుని కొందరు అక్రమ కట్టడం చేపట్టారని దీనిపై అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడతో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా అక్రమ కట్టడం ఆపాలని స్టే ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను  అమలు చేసి,అక్రమ నిర్మాణాన్ని ఆపాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కోర్టు ఆదేశాలు అమలు చేసి బాధితులకు అండగా ఉండాల్సిన అధికారులు  కబ్జాదారులకే సహకరిస్తూ వస్తున్నారని ఆరోపించారు.కొత్తకోట పట్టణంలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నా  అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారని, అధికారుల నిర్లక్ష్యం, వారి అండదండలతోనే పనులు సాగుతున్నాయని ఆయన విమర్శించారు పట్టణంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను మీడియా సమక్షంలోనే  పరిశీలించాలని రాచాల పట్టుబట్టడంతో కమిషనర్ శ్రీపాద అక్రమ కట్టడాన్ని పరిశీలించి,వెంటనే వాటిని తొలగించి  భాద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్,బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శశికుమార్ గౌడ్,కన్వీనర్ అరవిందాచారి,మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, దివాకర్, శివ, రామన్ గౌడ్, బాధితులు మ్యాదరి రాములు,అంజమ్మ, రాజు, అఖిల్  పాల్గొన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలోద్దు...

 కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలోద్దు...


ఆదర్శంగా నిలచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వంటిపల్లి పాపారావు తండ్రి కృష్ణమూర్తి..

పెన్ పవర్,ఆలమూరు 

మండల కేంద్రంమైన ఆలమూరు గ్రామానికి చెందిన శ్రీ మురళికృష్ణ ఫారమ్స్ అధినేత ప్రముఖ పారిశ్రామిక వేత్త వంటిపల్లి పాపారావు తండ్రి అయిన  కృష్ణమూర్తి శనివారం పెదపళ్ల పి హెచ్ సి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు ప్రజలందరికీ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది అని ముందుగా వంటిపల్లి కృష్ణమూర్తి వ్యాక్సిన్ వేయించుకుని పలువురి కి ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా వైద్యులు భవానీ శంకర్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలోద్దని ఇది సురక్షితమైందని అయన అన్నారు వ్యాక్సిన్ తీసుకునే ముందు రోజు మంచి  నిద్ర ఉండాలని అనంతరం తిరిగి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది,అశా వర్కర్లు  తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...