Followers

శ్రీ రామ సాయి సేవా బృందం ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ

 శ్రీ రామ సాయి సేవా బృందం ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ                       


   .

  పెన్ పవర్, కందుకూరు 

శనివారం శ్రీరామ సాయి సేవా బృందం కందుకూరు వారి  అన్నదాత సుఖీభవ లో భాగంగా  విజయవాడ వాస్తవ్యులైన పబ్బిశెట్టి  వెంకటేశ్వర ప్రసాద్ , రవ్వా శ్రీనివాసులు  దంపతుల  సహకారంతో  కందుకూరు పట్టణంలోని వీధులలో రోడ్డు ప్రక్కన ఉండే నిరుపేదలకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్ లు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావు , రవ్వా శ్రీనివాసులు, ఇన్నమూరి శ్రీనివాసులు  పాల్గొన్నారు.

మహిళా దినోత్సవంను జయప్రదం చేయండి...

 మహిళా దినోత్సవంను జయప్రదం చేయండి...

 పెన్ పవర్, కందుకూరు

 రేపు పట్టణంలోని డి ఆర్ ఆర్ విజ్ఞాన్ భవన్ యు టి ఎఫ్ కార్యాలయం నందు ఉదయం 9.30 గంటలకు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మహిళా ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా మహిళా కార్యదర్శి లెనీన, ఆడిట్ కమిటీ మెంబర్ సరోజిని, మహిళా కన్వీనర్ వీరమ్మ లు శనివారం ఒక సంయుక్త ప్రకటనలు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతీయ మండలాలైన కందుకూరు, పొన్నలూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, గుడ్లూరు మండలాల నుండి జిల్లా కార్యదర్శులు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.

రాఘాపూర్ నుండి నంచెర్ల డబుల్ రోడ్డు ను మర్మతు చెయ్యాలి పరిగి ఎమ్మెల్యే

 రాఘాపూర్ నుండి నంచెర్ల డబుల్ రోడ్డు ను మర్మతు చెయ్యాలి పరిగి ఎమ్మెల్యే

వికారాబాద్ , పెన్ పవర్

పరిగి మండలంలోని రాఘాపూర్ నుండి నంచెర్ల    వెళ్లే డబుల్ రోడ్డు పనులను కొన్ని సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని వాటిని వెంటనే రిపేరు చేయాలని పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేశ్వర్ రెడ్డి సూచించారు ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈలం కలిసి  రాఘవపూర్ నుండి నంచెర్లవెళ్లే రోడ్డు ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తో పాటు డిప్యూటీ ఆర్ అండ్ బి పరిశీలించారు. రోడ్డు మధ్యలో పాడవుతుంది పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ లాల్సింగ్,డిప్యూటీ సురేందర్ కు వివరించారు

వ్యసన నివారణ అవగాహన కార్యక్రమ ప్రచార రథం ఆవిష్కరణ

వ్యసన నివారణ అవగాహన కార్యక్రమ ప్రచార రథం ఆవిష్కరణ

పెన్ పవర్, కందుకూరు

స్థానిక రెవెన్యూ కాలనీలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యసన నివారణ మరియు పునరావాస కేంద్రం నకు చెందిన ప్రచార రధం ను కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ  శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ భార్గవ తేజ మాట్లాడుతూ మద్యం మత్తుకు బానిస కాకుండా దురలవాట్లకు దూరంగా ఉంటూ తమ కుటుంబాలతో హాయిగా గడపాలని అన్నారు. చెడు వ్యసనాల వల్ల ఆర్థిక భారంతో పాటు సమాజంలో విలువ ఉండదని అన్నారు. కావున ప్రతి ఒక్కరు  సత్ప్రవర్తనతో మెలగాలని ప్రతి ఒక్కరిని గౌరవించాలని కోరారు. సమాజం ఆరోగ్యంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రాలు ఆరోగ్యంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ఆరోగ్య భారతదేశం గా ఉండాలని కోరారు.


ఈ ప్రచార రధం ద్వారా కందుకూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలలో వ్యసన నివారణ కొరకు అవగాహన కల్పించి వైద్య సహాయం అంద చేస్తామని.ప్రాజెక్టు డైరెక్టర్  గేరా చిరంజీవమ్మ తెలిపారు. ఇప్పటికే సమాజంలో అనేక మందిని మా పునరావాస కేంద్రంలో  వ్యసన అలవాట్లపై అవగాహన కల్పించి అనేకమందిని మార్చామని తెలిపారు. నియోజకవర్గంలో వ్యసన నివారణ అవగాహన కార్యక్రమాలు ఇప్పటికే అనేక చోట్ల నిర్వహించామని తెలిపారు. పునరావాస కేంద్రంలో ఉచిత వైద్యం తో పాటు ఉచిత భోజన వసతి కూడా ఉందని సబ్ కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో నరసింహ,పీర్ ఎడ్యుకేటర్ ప్రభుదాస్,  ప్రశాంతి, రాహుల్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఊపందుకున్న టిఆర్ఎస్ నేతల ప్రచారం

 ఊపందుకున్న టిఆర్ఎస్ నేతల ప్రచారం

 కేసముద్రం,పెన్ పవర్

ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎంపీపీ పొలం చంద్రమోహన్, మండల అధికార ప్రతినిధి మోడెం రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగించారు. తెలంగాణ ప్రభుత్వం పథకాలకు నిదర్శనంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటు తో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. బ్యాలెట్ పేపర్ లో మూడో నెంబర్ పై ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కేసముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్,  పట్టణ అధ్యక్షుడు వీరు నాయక్, సీనియర్ నాయకులు ముత్యాల శివుడు,చంద గోపీ‌, వార్డు మెంబర్  తరాల వెంకన్న, నాయకులు రేవంత్, రాజేష్, రేణిగుంట్ల సుధాకర్, సింగంశెట్టి ఏకాంతం, కర్పూరపు మురళి, వెంకటేష్, వీరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లక్ష్మారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

 టీఆర్ఎస్వి రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్...

పెన్ పవర్,మేడ్చల్ 

తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వి రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పాల్గొని విద్యార్థులకు ఎంమెల్సీ ఎన్నికలో ఏవిధంగా పనిచేయలో దిశానిర్దేశం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమైంనది అని అన్నారు. అదే విధంగా ఈ ఎంమెల్సీ ఎన్నికలో కూడా టీఆర్ఎస్వి యెాక్క సత్తాను చూపించాలని, ఈ రెండు ఎంమెల్సీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహుమతిగా ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి మేడ్చల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మెనార్క్, రాజుసింగ్, యుాత్ మండల్ ఉపాధ్యక్షుడు వెంకట్, మేడ్చల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్వి అద్యక్షుడు ప్రవీణ్ పాల్గొన్నారు.

అసత్య ప్రచారాలు చేస్తున్న నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

 అసత్య ప్రచారాలు చేస్తున్న నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.....టిఆర్ఎస్కెవి యూనియన్

పెన్ పవర్,మేడ్చల్

మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని సనాఫీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (శాంతబయోటెక్) కంపెనీలో  టిఆర్ఎస్కెవి అనుబంధ యూనియన్ సనాఫీ  హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ మాత్రమేనని దానికి అధ్యక్షులుగా మర్రి రాజశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారని టిఆర్ఎస్కెవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పి నారాయణ మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ప్రకటించారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని సనాపి హెల్త్ కేర్ ఇండియా  ప్రవేట్ లిమిటెడ్ కంపెనీలో టిఆర్ఎస్కెవి అనుబంధంగా ఉన్న యూనియన్  రిజిస్ట్రేషన్ నెంబర్ 48 యూనియన్ అధ్యక్షులుగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. టిఆర్ఎస్కెవి అనుబంధం పొందినది దీనికి గతంలో శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందాడు. అదే విధంగా ప్రస్తుతం  యూనియన్ కి అధ్యక్షులుగా మర్రి రాజశేఖర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ కొనసాగుతున్నారు. కానీ ఇటీవల కొంతమంది గులాబీ కలర్ జండా వాడుకొని మేము కూడా టిఆర్ఎస్కెవి అనుబంధమని తప్పుడు అసత్య ప్రచారాలు చేస్తూ కార్మికులను అయోమయం చేస్తున్నారు. మేము టిఆర్ఎస్కెవి గా దీన్ని మేము ఖండిస్తున్నామని నారాయణ తెలిపారు. కార్మికులు ఎవరు అయోమయానికి గురి కావద్దని మనది టిఆర్ఎస్కెవి యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 48 తప్ప  ఎలాంటి అనుబంధ సంస్థలు లేవని, దీనికి లేబర్ డిపార్ట్మెంట్  ఉందని కార్మికులు ఎవరు గందరగోళం పడవద్దని అలాగే కంపెనీ యాజమాన్యానికి మిగతా యూనియన్ యూనియన్ లో టిఆర్ఎస్కెవి అనుబంధ యూనియన్ గుర్తించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. లేబర్ డిపార్ట్మెంట్ కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్  ఈరోజు లేఖ రాయడం జరిగిందని అన్నారు. టిఆర్ఎస్కెవి మిగతా అనుబంధ సంస్థ లేవీ లేవని మన నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఒక్కరేనని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న నాయకుల పై వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్కెవి అధ్యక్షుడు ప్రభాకర్, మున్సిపాల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, విష్ణుచారి, మాధవ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...