Followers

18 వ వార్డులో బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారపు రెడ్డి అరుణ కుమారి భారీగా ప్రచారం...

 18 వ వార్డులో బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారపు రెడ్డి అరుణ కుమారి భారీగా ప్రచారం...



 బి.జె.పి. ఉమ్మడి కార్పోరేట్ అభ్యర్దిని ద్వారాపురెడ్డి  ఎన్. ఎల్. అరుణ కుమారి కి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు....

విశాఖ తూర్పు,పెన్ పవర్

ఇంటింటా ఎన్నికల ప్రచారంలో బాగంగా  18 వ వార్డ్ లో  .. బి.జె.పి. ఉమ్మడి కార్పోరేట్ అభ్యర్దిని ద్వారాపురెడ్డి  ఎన్. ఎల్. అరుణ కుమారి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.ఆటోలతో భారీ గా ర్యాలీ నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటేసి అభివృద్ధి కి అండగా నిలవాలని ప్రజలను అభ్యర్ధించారు. వార్డ్ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నా మన్నారు.నన్ను గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమం, వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  


ప్రచారంలో అత్యధికంగా మహిళలు పాల్గొని అడుగడుగునా నీరాజనాలు అంధిoచారు.జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. , జనసేన కార్యకర్తలు మరియు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కె.సుబ్రహ్మణ్యం,18 వ వార్డు  అధ్యక్షులు శ్యామ్ కుమార్,జనరల్ సెక్రెటరీ  రమాదేవి, లీలావతి, నూకరాజు, రామారావు, లాలితకుమారి  శ్యామల,జ్యోతి యశోద, మరియు బి.జె.పి. జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘన చరిత్ర కలిగిన కళాశాల టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల...సీఐ విజయ్ కుమార్

 ఘన చరిత్ర కలిగిన కళాశాల టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల...సీఐ విజయ్ కుమార్    


    

 పెన్ పవర్, కందుకూరు

 స్థానిక  తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ బి. రవి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కందుకూరు సి ఐ విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ విజయకుమార్ మాట్లాడుతూ టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంతో ఘన చరిత్ర కలిగిందని,  ఇక్కడ చదువుకున్న విద్యార్థులుఎంతో మంది ఉన్నత స్థాయి లో ఉన్నారని అటువంటి కళాశాలకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి చొరవతో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు సమకూర్చారని అన్నారు. 

ఈ సౌకర్యాలన్నీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని వారిని  కోరారు.విద్యార్థి దశలో డిగ్రీ అనేది ఎంతో కీలకమైనదని,  సమాజంలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకొని ఆ స్థాయికి చేరాలని అన్నారు.పట్టణ ఎస్ఐ కేకే తిరుపతి రావు మాట్లాడుతూ ఎల్ హెచ్ ఎం ఎస్ ఏపీ పోలీస్ యాప్, దిశ యాప్ ఉపయోగాలను గురించి, సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి,  అంతర్జాలం లో జరుగుతున్న మోసాలను గురించి విద్యార్థులకు వివరించారు. కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు డాక్టర్ ఆంజనేయులు మొదటి సంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు కళాశాలలో నడుచుకొనవలసిన  విధానాన్ని గూర్చి వివరించారు. కళాశాలలో జరిగే సాంస్కృతిక మరియు వ్యాయామాల్లోపాల్గొని కళాశాలకు మంచి పేరు తీసుకొని రావాలని కోరారు.డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం డిగ్రీ, పిజి విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో విజయశ్రీ, మైత్రి, అధ్యాపక, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

దివ్యాంగులకు పండ్లు పంపిణీ....

 దివ్యాంగులకు పండ్లు పంపిణీ....    

పెన్ పవర్, కందుకూరు

పట్టణంలోని కోవూరు రోడ్డు నందు గల స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాల లో శనివారం చక్కా నరేంద్ర,  సువర్చల దంపతుల కుమార్తె లక్ష్మీ హేన్షిక పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగుల కు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా  వెంకట కేశవరావు,  దుడ్డు మనోజ్ కుమార్,పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మినీ ట్రక్కుల వెంట విఆర్ఓ లు అందుబాటులో ఉండాలి...

 మినీ ట్రక్కుల వెంట విఆర్ఓ లు అందుబాటులో ఉండాలి.....

పెన్ పవర్,వలేటివారిపాలెం

ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేసేటప్పుడు మినీ ట్రక్కుల వెంట నోడల్ విఆర్ ఓ లు అందుబాటులో ఉండాలని తహశీల్దార్ ముజఫర్ రెహమాన్ తెలిపారు.   ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  కార్డు దారులు గత నెలలో రేషన్ తీసుకోక పోతే గత నెల రేషన్,   ప్రస్తుత నెల  రెండు కలిపి ఒకేసారి రేషన్ తీసుకోవచ్చని అన్నారు. డోర్ డెలివరీ చేసే సమయంలో నోడల్ విఆర్వోలు రేషన్ మినీ ట్రక్కుల వెంట ఉండాలని చెప్పారు.  కచ్చితంగా  డోర్ టు డోర్ బండి ఆపి రేషన్ పంపిణీ చేయాలని చెప్పారు. మినీ ట్రక్కు వెల్ల లేని పరిస్థితుల్లో తప్ప లేకుంటే,  ఎక్కడా కూడా బండి ఒక చోట ఆపి రేషన్ పంపిణీ చేయరాదన్నారు.  గుంపులు గుంపులుగా చేరి అసలు రేషన్ పంపిణీ చేయకూడదని చెప్పారు.  ప్రతి కార్డు దారుడికి రేషన్ తో పాటు సంచులు ఇవ్వాలన్నారు.  మండలంలో మొత్తం 13,080. కార్డులు ఉన్నట్లు ఆయన తెలిపారు . రోజుకు కనీసం 90 కార్డులు చేయాలని చెప్పారు.   వాలంటీర్లు వారివారి పరిధిలో ఉన్న 50 ఇళ్లకు ముందుగా రేషన్ ఎప్పుడు తీసుకోవాలి అనే విషయం ముందుగా తెలియజేయాలని చెప్పారు. ఎక్కడైనా డోర్ డెలివరీ చేయకుండా ఒకే చోట బండి ఆపి రేషన్ పంపిణీ చేస్తే నోడల్ విఆర్ఓ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రేషన్ సరుకుల విక్రయానికి అనుమతించాలని డీలర్ ఆందోళన

 రేషన్ సరుకుల విక్రయానికి అనుమతించాలని డీలర్ ఆందోళన

 చిన్నగూడూరు,పెన్ పవర్

మండల కేంద్రంలోని విస్సంపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ షాప్ నెంబర్ 9 కి చెందిన రేషన్ డీలర్స్ అక్కినేని కవిత శనివారం మండల తాసిల్దార్ కార్యాలయం ముందు  ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్రం చేసిన సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు కవిత విస్సంపల్లి గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం గతంలో రేషన్ షాప్ డీలర్ గా ఉన్న కవితను అభియోగం తో తొలగించడం జరిగిందని, దీంతో జయ్యారం డీలర్ నరహరికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. పది నెలల అనంతరం 2021 జూన్ నుంచి కవితకు జాయింట్ కలెక్టర్ నుంచి అనుమతి వచ్చిన తహసిల్దార్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో శనివారం స్థానికుల సహకారంతో తాసిల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలిపారు. గతంలో ఆర్ఐ కొంత మంది స్థానికుల సహకారంతో దొంగ తీర్మానం చేసి నరహరి రేషన్ షాప్ ను అప్పగించేలా సదర్ డీలర్ స్థానికంగా ఉండటం లేదనే నెపంతో తాసిల్దార్ కు మెమోరాండం ఇవ్వడంతో ఆర్ ఐ విషయం జరుగుతుందని ఎమ్మార్వో ముందు చింపి వేయడం జరిగింది. బాధితురాలు నాకు ఎలాగైనా న్యాయం చేయాలని ఈ సందర్భంగా తాసిల్దార్ వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాగంటి నరసయ్య, ధర్మారపు  ఉపేందర్, కొండ వెంకన్న, భాశి పంగు ఎల్లయ్య, కొప్పల శ్రీను, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీ రామ సాయి సేవా బృందం ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ

 శ్రీ రామ సాయి సేవా బృందం ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ                       


   .

  పెన్ పవర్, కందుకూరు 

శనివారం శ్రీరామ సాయి సేవా బృందం కందుకూరు వారి  అన్నదాత సుఖీభవ లో భాగంగా  విజయవాడ వాస్తవ్యులైన పబ్బిశెట్టి  వెంకటేశ్వర ప్రసాద్ , రవ్వా శ్రీనివాసులు  దంపతుల  సహకారంతో  కందుకూరు పట్టణంలోని వీధులలో రోడ్డు ప్రక్కన ఉండే నిరుపేదలకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్ లు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావు , రవ్వా శ్రీనివాసులు, ఇన్నమూరి శ్రీనివాసులు  పాల్గొన్నారు.

మహిళా దినోత్సవంను జయప్రదం చేయండి...

 మహిళా దినోత్సవంను జయప్రదం చేయండి...

 పెన్ పవర్, కందుకూరు

 రేపు పట్టణంలోని డి ఆర్ ఆర్ విజ్ఞాన్ భవన్ యు టి ఎఫ్ కార్యాలయం నందు ఉదయం 9.30 గంటలకు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మహిళా ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా మహిళా కార్యదర్శి లెనీన, ఆడిట్ కమిటీ మెంబర్ సరోజిని, మహిళా కన్వీనర్ వీరమ్మ లు శనివారం ఒక సంయుక్త ప్రకటనలు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతీయ మండలాలైన కందుకూరు, పొన్నలూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, గుడ్లూరు మండలాల నుండి జిల్లా కార్యదర్శులు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...