Followers

హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయని మున్సిపల్ అధికారులు

 హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయని  మున్సిపల్ అధికారులు; రాచాల గౌడ్

వనపర్తి, పెన్ పవర్


హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న కొత్తకోట మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం ముందు అక్రమ కట్టడాలతో ఇబ్బందులకు గురవుతున్న బాధితులతో కలిసి రాచాల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాచాల గౌడ్ మాట్లాడుతూ పట్టణానికి చెందిన మ్యాదరి రాములు ఇంటికి అనుకుని కొందరు అక్రమ కట్టడం చేపట్టారని దీనిపై అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడతో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా అక్రమ కట్టడం ఆపాలని స్టే ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను  అమలు చేసి,అక్రమ నిర్మాణాన్ని ఆపాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కోర్టు ఆదేశాలు అమలు చేసి బాధితులకు అండగా ఉండాల్సిన అధికారులు  కబ్జాదారులకే సహకరిస్తూ వస్తున్నారని ఆరోపించారు.కొత్తకోట పట్టణంలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నా  అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారని, అధికారుల నిర్లక్ష్యం, వారి అండదండలతోనే పనులు సాగుతున్నాయని ఆయన విమర్శించారు పట్టణంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను మీడియా సమక్షంలోనే  పరిశీలించాలని రాచాల పట్టుబట్టడంతో కమిషనర్ శ్రీపాద అక్రమ కట్టడాన్ని పరిశీలించి,వెంటనే వాటిని తొలగించి  భాద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్,బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శశికుమార్ గౌడ్,కన్వీనర్ అరవిందాచారి,మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, దివాకర్, శివ, రామన్ గౌడ్, బాధితులు మ్యాదరి రాములు,అంజమ్మ, రాజు, అఖిల్  పాల్గొన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలోద్దు...

 కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలోద్దు...


ఆదర్శంగా నిలచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వంటిపల్లి పాపారావు తండ్రి కృష్ణమూర్తి..

పెన్ పవర్,ఆలమూరు 

మండల కేంద్రంమైన ఆలమూరు గ్రామానికి చెందిన శ్రీ మురళికృష్ణ ఫారమ్స్ అధినేత ప్రముఖ పారిశ్రామిక వేత్త వంటిపల్లి పాపారావు తండ్రి అయిన  కృష్ణమూర్తి శనివారం పెదపళ్ల పి హెచ్ సి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు ప్రజలందరికీ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది అని ముందుగా వంటిపల్లి కృష్ణమూర్తి వ్యాక్సిన్ వేయించుకుని పలువురి కి ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా వైద్యులు భవానీ శంకర్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలోద్దని ఇది సురక్షితమైందని అయన అన్నారు వ్యాక్సిన్ తీసుకునే ముందు రోజు మంచి  నిద్ర ఉండాలని అనంతరం తిరిగి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది,అశా వర్కర్లు  తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమిపూజ

 సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమిపూజ

ఎల్లారెడ్డిపేట,పెన్ పవర్

 హరిదాస్ నగర్ గ్రామంలో  కొనకట్ట నుండి  స్మశాన వాటికకు ఐదు లక్షల గల  ఈ. జి. ఎస్ నిధుల నుండి లింక్ సి. సి రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు, సర్పంచ్ తెడ్డు అమృత రాజమల్లు, ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, వార్డ్ సభ్యులు ఉప్పుల చంద్రయ్య, అనింగారి మమత, ప్యాక్స్ వైస్ చైర్మెన్ జంగిటి సత్తయ్య మరియు సిరికొండ నాగరాజు, రోడ్డ దాసు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవకురాలిగా సేవలందిస్తా...

 ప్రజాసేవకురాలిగా సేవలందిస్తా...


మహాసేవకుడి మాట నిలుపుతా..

34వ వార్టు వైసీపీ అభ్యర్థి బాలి పైడిరాజు..

నాయకుడంటే పాలకుడు కాదు..

నాయకుడంటే శాసించేవాడు కాదు.. 

పెన్ పవర్,విజయనగరం

నాయకుడంటే సేవకుడని,ప్రజా సేవకుడని భావించి, బోధించి, భాసించిన వ్యక్తి స్వర్గీయ బాలి త్రినాధ రావు. నగరంలో ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరది. బాలి త్రినాథ్ గా వాసికెక్కిన అయిన ఈమధ్యనే హితులందరికీ సెలవంటూ.. స్వర్గప్రాప్తి పొందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ మహా సేవకుడి చెరగని సంతకంలా.. చెదరని జ్ఞాపకంగా.. ఆయన సేవాపరంపరకు కొనసాగింపుగా నగరంలోని 34 వ వార్డులో బాలి త్రినాద్ భార్య బాలిపైడిరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వార్డు ప్రజలకు, కుటుంబానికి బాలి త్రినాద్ పెద్ద దిక్కుగా ఉంటూ వార్డు ప్రజలందరితో అభిమాన పాత్రుడిగా మసలుతూ, అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధాకరమైనా ఆయన ప్రతిరూపాలైన బాలి యోగేంద్ర, బాలి నరేంద్ర, బాలి ప్రతాప్ లు తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ప్రజా సేవ చేసేందుకు కంకణబద్ధులయ్యారు. అదే నేడు నగరం లో హాట్ టాపిక్ గా మారింది.  రణక్షేత్రంలో యుద్ధ సైనికుల వాలే, ప్రజాక్షేత్రంలో జగన్ సైనికుల్లా 34వ వార్డులో ఈ ముగ్గురు అన్నదమ్ములు  వీరోచిత సేవలందిస్తూ ఓట్లను అర్థిస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తమ తల్లిని ఆడపడుచులా ఆదరించి, అక్కున చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నారు. వారి అభ్యర్థనలతో వార్డు ప్రజల హృదయాలు బరువెక్కుతున్నాయి. మాటలు మూగబోతున్నాయి. ఓట్ల రూపంలో  బాలి పైడిరాజు ను కార్పొరేటర్ గా గెలిపించి బాలి త్రినాద్ రుణాన్ని తీర్చుకోవాలని భావిస్తున్నారు. 34 వ వార్డు అభ్యర్థి బాలి పైడిరాజుది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.గజపతినగరం మాజీ శాసనసభ్యులు తాడ్డి సన్యాసప్పలనాయుడు ఆమెకు పెద్ద నాన్న కాగా, తదనంతర కాలంలో గజపతినగరం శాసనసభ్యులుగా సేవలందించిన స్వర్గీయ తాడ్డి వెంకట్రావు వరుసకు అన్నయ్య కూడా. వివాహం అనంతరం  రాజకీయమే వ్యసనంగా,  ప్రజాసేవే శ్వాసగా అందరి మన్ననలు అందుకున్న బాలి త్రినాథ్ కు భార్యగా బాలి పైడిరాజు తనదైన శైలిని ప్రదర్శించారు. ఆపదలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే నైజం ఉన్న భర్త దొరకడం అదృష్టంగా భావించి, ఏనాడూ ఇతరులకు సేవ చేసే విషయంలో అడ్డుచెప్పకుండా మరింత సహాయం అందించాలని కోరడం వెనుక ఆమె పెద్ద మనసు మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పెద్దావిడకు నేడు కష్టం వచ్చింది. పెద్ద దిక్కు కోల్పోయి కంటి నీరే కాలం అయ్యింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆ పెద్దమనసుకి కష్టం వచ్చినప్పుడు ఆదరించడానికి అందరూ ముందుకు రావాలి. ఇదే తరుణం అంటూ ఎన్నికలు వచ్చాయి. అందుకే ఈ ఎన్నికలో తమ తల్లి  శోకాన్ని దిగమింగుకొని జోలిపట్టి ఓట్లు అర్థిస్తోందని ఓ ఇంటర్వ్యూలో బాలి యోగేంద్ర చెమర్చిన కళ్ళతో చెప్పసాగాడు. ఇదిలా ఉంటే ప్రజాభిమానమే అండగా, ప్రజలే దండుగా ఉన్న ప్రియతమ నాయకులు, స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి బలపరిచిన అభ్యర్థిగా తనను గెలిపించాలని 34 వార్డు అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పైడిరాజు ఆ వార్డు ప్రజలకు కోరుతున్నారు. ఇంటింటికి వెళ్లి తన భర్త స్వర్గీయ త్రినాథ్ సేవానిరతి కి బదులుగా ఓటు వేయండని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలియోగేంద్ర, ప్రతాప్, నరేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే వైసిపి అభ్యర్థులను గెలిపించాలన్నారు. నిరంతర శ్రామికుడు, విజయనగర ప్రజల ముద్దుబిడ్డ, అందరిచేత అన్నయ్య అని పిలిపించుకునే అరుదైన వ్యక్తిత్వం ఉన్న స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి బలపరిచిన అభ్యర్థి తమ తల్లి గారైన పైడిరాజు ను అఖండ విజయంతో గెలిపించాలని కోరుతున్నారు. 

పురపాలక శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా జగన్ సైనికుల్లా పని చేస్తామని భరోసా ఇచ్చారు. నిరంతరం ప్రజల మధ్య లోనే ఉంటూ ప్రజలకు సేవ చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తామని మాట ఇస్తున్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తామని ప్రతినబూనారు.  తమ తండ్రి స్వర్గీయ త్రినాధ రావు  కరోనా సమయంలో ను ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా, ప్రాణాలను తృణప్రాయంగా భావించి పేదలందరికీ నిత్యావసరాలను పంపిణీ చేసిన మహాసేవకుడని కొనియాడారు. ఆ మహా సేవకుడి ఆశయాలు, ఆకాంక్షలు నిరంతరం కొనసాగిస్తామని భావిస్తున్న తమకు మంచి మనసుతో దీవించి ఓట్ల రూపంలో గెలిపించి 34 వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా బాలి పైడిరాజు కు అఖండ విజయం చేకూర్చాలని కోరుతున్నారు.

కూన శ్రీశైలంగౌడ్ సమక్షంలో బీజేపీ కండువలు కప్పుకున్న కాంగ్రెస్ శ్రేణులు..

 కూన శ్రీశైలంగౌడ్ సమక్షంలో బీజేపీ కండువలు కప్పుకున్న కాంగ్రెస్ శ్రేణులు..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర బిజెపి నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ , జీడిమెట్ల డివిజన్ లకు సంబంధించిన కూన శ్రీశైలం గౌడ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి బిజెపి పార్టీలో కష్టపడి పని చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పనిచేసిన వారందరినీ అభినందనలు తెలుపుతున్నానని.. ఇకనుండి కలిసికట్టుగా కుత్బుల్లాపూర్ జీడిమెట్ల డివిజన్లకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో కలిసి పని చేసే విధంగా ముందుకు వెళ్లాలని టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూన పేర్కొన్నారు.. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వంలో బిజెపి పార్టీ రానున్న రోజుల్లో ఇంకా మరింత బలపడుతుందని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ నటరాజ్ గౌడ్, సాయి, పులి బలరాం, రాజేశ్వర్ రావు, గడ్డం రాజేందర్, కృష్ణ యాదవ్, బలప్ప, సత్యనారాయణ, దుర్గారావు, కట్ట కుమార్, ఎన్నా రెడ్డి, శారద, సుకుమార్, రవి, భూషణ్, కృష్ణవేణి, నాగేష్, నర్సింగ్, వెంకటేష్, లింగం, వెంకటేష్ యాదవ్, విజయ్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

వి.ఆర్.పురం బీసీ కాలనీ ప్రజలకు త్వరలో సిమెంట్ రోడ్డు ఏర్పాటు

  వి.ఆర్.పురం బీసీ కాలనీ ప్రజలకు త్వరలో  సిమెంట్ రోడ్డు ఏర్పాటు 



 వి.ఆర్.పురం,పెన్ పవర్   

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రధానమంత్రి గా రాజీవ్ గాంధీ అప్పటి ముఖ్యమంత్రి గా ఎన్టీ రామారావు హయాంలో వి.ఆర్.పురం మండలానికి రోడ్డు ఇందిరా గాంధీ సెంటర్ నుండి ఎండిఓ కార్యాలయం వరకు అప్పట్లో ప్రభుత్వం వేసిన రోడ్డు అప్పటినుండి ప్రభుత్వాలు  మారినా నాయకులు మరి నా రోడ్డు కి మోక్షం కలగలేదు. మండలంలో ఆగస్టు నెలలో గోదావరి వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు  వడ్డీ గూడెం పంచాయతీ లో ఉన్న గ్రామాలు  ధర్మ తాళ్లగూడెం వి.ఆర్.పురం వడ్డిగూడెం కాలనీ  ప్రజలు ఈరహదారి గుండా సురక్షిత ప్రాంతమైన రేఖ పల్లికి చేరుకుంటారు. ఇప్పటి ప్రభుత్వం పంచాయతీ నిధులతో రోడ్డు వేయాలని నిర్ణయం తీసుకుంది.వడ్డీగూడెం  పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ నరసమ్మ సంబంధిత శాఖ ద్వారా రహదారికి ఎంత బడ్జెట్  అవసరమో ఎన్ని మీటర్ల   సిమెంటు రహదారి నిర్మాణము  మార్గం  కావాలో దగ్గరుండి కొలతలు వేయించారు.  ఎలాగైనా రోడ్డు రహదారికి సిమెంట్ రోడ్డు వేయనున్నట్లు మండల వైసిపి నాయకులు తెలిపారు. వి.ఆర్.పురం బీసీ కాలనీ గ్రామ ప్రజలు మండల వైసీపీ నాయకులకు   కృతజ్ఞతలు తెలిపారు. 

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

 ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా  ఉండాలి



 పెద్దాపురం,పెన్ పవర్  

మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై పోలింగ్ సిబ్బంది పిఓలు, ఏపీవోలు  పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని  అసిస్టెంట్ ఎలక్షన్ ఆదారిటి మరియు మునిసిపల్ కమిషనర్ జంపా సురేంద్ర పేర్కొన్నారు. శనివారం స్థానిక పెద్దాపురం శ్రీమతి బచ్ఛు నాగరత్నమ్మ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన సామావేశ మందిరంలో ఉదయం  పెద్దాపురం పురపాలక సంఘం సాధారణ ఎన్నికలు పోలింగ్ సిబ్బంది పిఓలు, ఏపీవోల రెండవ దశ శిక్షణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమీషనర్ ప్రారంభించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ పై ప్రతి పోలింగ్ సిబ్బంది పిఓలు, ఏపీవోలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగివుండాలని, ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ బాక్స్ల పనితీరు, బ్యాలెట్ పాత్రలపై పూర్తిస్థాయిలో సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు.అదేవిధంగా మొదటి దశ శిక్షణా కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలతో పాటు ,ఈ శిక్షణ లో కూడ సందేహాలను,నివృత్తి చేసుకోవాలని అన్నారు. పెద్దాపురం పురపాలక సంఘం నిర్వహించే మునిసిపల్ ఎన్నికలలో 71 మంది ప్రిసైడింగ్ అధికారులు, 76 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు మరియు పూర్తిస్థాయిలో ఇతర శాఖల అధికారులు ఉన్నారన్నారు. మొత్తం 29 వార్డులకు 40563 ఓటర్లు ఉన్నారన్నారు.అదేవిధంగా  పోలింగ్ ప్రక్రియలో పివోలు, ఏపీవోలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధులలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా, అప్రమత్తంతో విధులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ ఎస్. నాగేశ్వరరావు, ఆర్. ఐ.యం. నాగేశ్వరరావు, శానిటరి ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు, శిక్షణ టైనర్ససిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...