Followers

మహిళాదినోత్సవం వేడుకలలో దుండిగల్ చైర్మెన్..కమీషనర్

 మహిళాదినోత్సవం వేడుకలలో దుండిగల్ చైర్మెన్..కమీషనర్

దుండిగల్,పెన్ పవర్


ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుందని దుండిగల్ చైర్మెన్ సుంకరి కృష్ణవేణి క్రిష్ణ పేర్కొన్నారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ ఎంన్ఆర్ జ్యోతి.. మున్సిపల్ మేనేజర్ సునంద మరియు మహిళా ఆర్.పీ.లు పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.. దుండిగల్ మున్సిపల్ మహిళా ఉద్యోగులు, సిబ్బంది చైర్మెన్..కమీషనర్..మేనేజర్ లను శాలువాలతో సత్కరించి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.. చైర్మెన్ సుంకరి కృష్ణ వేణిక్రిష్ణ మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనేది కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిందని దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా నిర్వహిస్తోందని చైర్మెన్ వివరించారు.. అసలు దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయని తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారని.. మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించిందని విశదీకరించారు..ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళదని, కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారని, 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారని, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారని, 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయని చైర్మెన్ కృష్ణ వేణిక్రిష్ణ ప్రశంసించారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది 1975. 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించిందని.. ప్రతి ఏటా ఏదో ఒక ఇతి వృత్తంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోందని, 'గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం' అని మొదటి థీమ్‌ను నిర్ణయించిందని, ఈ ఏడాది ''సమానత్వంతో ఆలోచించండి, తెలివిగా నిర్మించండి, మార్పు కోసం సృజనాత్మకంగా పనిచేయండి'' అన్నది ఈ ఏడాది నినాదం అని, పనిచేసే వయసున్న మహిళల్లో సగం మంది మాత్రమే ప్రపంచ కార్మిక శక్తికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయన్నారు..మార్చి 8వ తేదీనే ఎందుకు జరుపుకోవాలి .1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ''ఆహారం - శాంతి'' డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈక్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన ( ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్ ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.

కొంపల్లి మున్సిపాలిటీలో మహిళా దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే...

 కొంపల్లి మున్సిపాలిటీలో మహిళా దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే...

జీడిమెట్ల,పెన్ పవర్


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలోని సాయికృప అపార్టమెంట్స్ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్, స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా మహిళలు జీవితంలో ముందుకు సాగాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలు ఉన్నతంగా ఎదిగేందుకు ఇప్పటికే వి-హబ్ లాంటివి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు.ఈకార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మాదంశెట్టి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజు..

 మహిళా దినోత్సవం వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజు..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్


సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తియుక్తులు మహిళలకే ఉన్నాయని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్ పూర్ రాజు కొనియాడారు... సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సాయి కళ్యాణ మండపంలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.. ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తుందని అన్నారు.. ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళల పక్షపాతి అని చట్టసభలలో పురుషులతోపాటు స్త్రీలకు సమాన రిజర్వేషన్లు కల్పిస్తూ తగిన ప్రోత్సాహం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.. గత ప్రభుత్వాలు మహిళల సంక్షేమాన్ని విస్మరించాయని టిఆర్ఎస్ ప్రభుత్వం అందరి మహిళలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని తెలియజేశారు.. సుమారు 4 వందల మంది మహిళలకు శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్ ఎస్ .మల్లేష్ గౌడ్ .మహిళా నాయకురాళ్లు బింగి .ఇందిరా గౌడ్. ఈ. సువర్ణ. లతా. రేణుక. మల్లికాంబ. జయ శ్రీ .భాగ్య. శాంతి. పద్మ. శాంతా .చంద్రకళ. లావణ్య. వనిత .జ్యోతి. రాణి. ఆది లక్ష్మి సంధ్య. సుజాత. క్లార. అలివేలు. ఉమా. స్థానిక నాయకులు. మహమూద్, మల్లారెడ్డి, విటల్, లక్ష్మణ్. రాయి విగ్నేష్. బసవేశ్వర్. వినయ్ .గంగా సంతోష్. ప్రభాకర్. హాజీ .సంపత్ రెడ్డి .సాజిత్ .ఉదయ్. ఖయ్యుం. ఖలీల్. నరేష్. రాజు. తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఎమ్మార్పీఎస్..

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఎమ్మార్పీఎస్..

దుండిగల్,పెన్ పవర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ సూరారం 60 గజాల్లో మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకురాలు గట్టు యాదమ్మ ఎస్తేరు రాణి మాట్లాడుతూ సంఘసంస్కర్తలు అయినటువంటి సావిత్రిబాయి పూలే, మదర్ తెరిసా, సాకలి అయిలమ్మ, ఇతరత్రా వీరనారీ మహిళ మణులను గుర్తు చేసుకున్నారు.. పాల్గొన్నవారిలో జే.సుహాసిని, పీ.నాగమణి సిహెచ్.లక్ష్మి, విజయలక్ష్మి, కే.లలిత, కే.అంజలి, మరియు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ రాచమల్ల యాదగిరి మాదిగ ఈశ్వరం రమేష్ తదితరులు పాల్గొన్నారు..

అచ్యుతాపురం అంగన్వాడీ కేంద్రంలో అవకతవకలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు

 అచ్యుతాపురం అంగన్వాడీ కేంద్రంలో అవకతవకలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు

గోకవరం,పెన్ పవర్  

గోకవరం మండలం లోని అచ్యుతాపురం గ్రామంలో రెండో నంబరు అంగన్వాడి కేంద్రంలో బాలింతలు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అందించవలసిన పోషకాహారాన్ని, మరియు పోషక పదార్థాలను సక్రమంగా అందడం లేదని గ్రామస్థులు జిల్లా ఐసిడిఎస్ పిడి పుష్ప వాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు నల్లా ల వెంకన్న బాబు అచ్యుతాపురం గ్రామస్తులు  తో కలిసి జిల్లా ఐసిడిఎస్ పిడి కి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. అంగన్వాడి కేంద్రం నిర్వహణలో లోపాలపై కాకినాడలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లి ప్రాజెక్టు డైరెక్టర్లు కు ఫిర్యాదు అందజేయడం జరిగింది.

అనంతరం మాజీ ఎంపీటీసీ వెంకన్నబాబు స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ అచ్చుతాపురం గ్రామంలో అంగనవాడి కేంద్రంలో బాలింతలు, గర్భిణీ స్త్రీలు,  చిన్నపిల్లలు సుమారు వంద వరకు ఉంటారన్నారు.అయితే వీరికి ప్రభుత్వం అందిస్తున్న పోషకపదార్థాలను సక్రమంగా అందించడం లేదని 25 గుడ్లు ఇవ్వాల్సి ఉండగా 15 గుడ్లు మాత్రమే ఇస్తున్నారు అని 2 1/2 లీటర్ల పాలకు 1 1/2 పాలు మాత్రమే ఇస్తున్నారని, 1/2కిలో నూనె ఇవ్వాల్సి ఉండగా డబ్బా తో కొలిచి ఇస్తున్నారని అన్నారు.రికార్డ్స్ లో మాత్రం మెనూ ప్రకారం ఇస్తున్నట్లు ఉండగా వాస్తవానికి మాత్రం వాటి కంటే తక్కువ పరిమాణంలో ఇస్తున్నారన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు జిల్లా పిడికి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి....కొవ్వూరు డిఎస్పి శ్రీనాథ్

 మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి....కొవ్వూరు డిఎస్పి శ్రీనాథ్


పెన్ పవర్,తాడేపల్లిగూడెం

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పలువురు వక్తలు ఉద్బోధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణం లోని వివిధ ప్రాంతాల్లో మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.  తాడేపల్లిగూడెం పట్టణం మరియు రూరల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినఅంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో కొవ్వూరు డి.ఎస్.పి. బండారు శ్రీనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా మహిళల రక్షణ కోసం దిశా చట్టం తీసుకు వచ్చిందని అన్నారు. అంతేకాకుండా ఎస్ ఓ ఎస్  యాప్ ద్వారా ఆపదలో ఉన్న వారికి సహకరించే విధంగా యాప్ ని రూపొందించారని తెలిపారు.  విద్యాభివృద్ధికి కృషి కోసం అమ్మ ఒడి, మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత వంటి పథకాలను తీసుకు వచ్చిందని తెలిపారు.



 మహిళా పోలీసులకు,  మహిళా సంరక్షణ కార్యదర్శులకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సుజాత, తాడేపల్లిగూడెం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సృజన, దేరా కౌన్సిలింగ్ నెంబర్ మల్లిపూడి కనకదుర్గాదేవిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు, తదితరులు పాల్గొన్నారు.

మహిళలే మహా రాణులు

 మహిళలే మహా రాణులు

పెద్దాపురం, పెన్ పవర్

 మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికి చాటుకోవడమే కాకుండా పలు రంగాలను శాసించే స్థాయికి చేరుకున్నారని పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నవసేన గోరింట సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గోరింట గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బ్లురే హాస్పిటల్స్ (కాకినాడ) కు చెందిన వైద్య బృందం రక్త, వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు ఒకవైపు తమ కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతూనే మరొక వైపు ఉద్యోగ, వ్యాపారాలు చేస్తూ తమ శక్తిని నిరూపించుకుంటున్నారని అన్నారు. 



మనమందరం భారతమాత ముద్దుబిడ్డలమని, ప్రపంచంలో ఏ ఒక్క దేశాన్ని కూడా స్త్రీతో పోల్చి చెప్పరని, మనదేశంలో మాత్రమే భారతమాత అని పిలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బ్లురే హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కృష్ణారెడ్డి, సోము ప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ కుమార్, పెద్దాపురం సిఐ వి. జయకుమార్, ఎస్ఐ ఏ. బాలాజీ, నవసేన గోరింట గ్రూప్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...