Followers

జాతి నిర్మాణంలో మహిళామణులదే కీలక భూమిక

 జాతి నిర్మాణంలో మహిళామణులదే కీలక భూమిక

పెన్ పవర్,ఆలమూరు

  భారతీయ మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను పెంపొందించటంలో ఎల్లప్పుడూ కీలక భూమికను పోషిస్తూ వచ్చారని ఆలమూరు మండల ప్రజాపరిషత్తు పరిపాలనా అధికారి టీవీ సురేందర్రెడ్డి ప్రశంసించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలో గల మహిళా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ మహిళా సిబ్బందిని ఆయన ఘనంగా సన్మానించారు.

 ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మహిళలు ఎప్పుడూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కరోనాపై పోరులో సైతం ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులతో పాటు మహిళలు సైతం ముందు వరుసలో ఉన్నారని ప్రస్తుతించారు. భారత సామాజిక స్దితిగతుల మేరకు సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న వారు ఎంతో సహనంతో తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారని, ఇది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప బహుమతి అని ఆయన కొనియాడారు.సమాజంలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రాజ్ కుమార్, పంచాయితీ కార్యదర్శులు ఆర్ వీ సత్యనారాయణ, విజయ రాజు, సంజీవ్ రెడ్డి, వీర్రాజు పలువురు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోనల్ కమీషనర్..

 మహిళా దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోనల్ కమీషనర్..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్


అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్ కార్యలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. గాజులరామారం మరియు కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లకు సంబందించిన పట్టణ సమైఖ్య ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ వి.మమత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జోనల్ కమీషనర్  మాట్లడుతూ మహిళలు అన్నిరంగాల్లో ముందు వుండాలని అన్నారు. మహిళలు పట్టుదలతో ముందుకు సాగితె ఏదైనా సాదించవచ్చని.. అంతరిక్షంలోకి 1963 లోనే సోవియెట్ కాస్మోనట్ అనే మహిళ వెళ్ళిందని.. ఇప్పటికే భారతదేశంలో మహిళలకు సమానంగా హక్కులు కల్పించాలని రిజర్వేషన్ 50 శాతం కేటాయించి అన్ని రంగాలలో రాణిస్తున్నారని మమత తెలియజేశారు..ఈ కార్యక్రమం లో కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ మంగతాయారు. జంట సర్కిళ్ల ప్రాజెక్టు ఆఫీసర్ లు శ్రీ.శ్రీనివాస్.హరిప్రియ, సిఓ లు, పట్టణ సమైక్య అధ్యక్షులు .పద్మ , విజయలక్ష్మి మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

అడబిడ్డలకు అండగా కేసీఆర్

డబిడ్డలకు అండగా కేసీఆర్

గుడిహత్నూర్,పెన్ పవర్
కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ అడబిడ్డలకు అండగా ఉంటుందని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని బోథ్ ఎమ్యెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో  36 మంది కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రు.36.4176 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గతంలో పేద ప్రజలు ఆడపిల్లల పెండ్లిళ్లు చేయాలంటే భయపడేవారని, నేడు ఆ పరిస్థితి లేదని పిల్లల పెండ్లిళ్లలకు కేసీఆర్‌ పెద్దన్న వలే ఆదుకుంటున్నారన్నారు.ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేకనే  ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పవన చంద్ర, ఎంపీపీ,సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అత్యవసర సందర్భాల్లో బ్లడ్ డొనేట్ చేస్తున్నా బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ

 అత్యవసర సందర్భాల్లో బ్లడ్ డొనేట్ చేస్తున్నా బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం

ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు

 ఆదిలాబాద్, పెన్ పవర్ 


ఆదిలాబాద్: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలతో బ్లడ్ డొనేట్ కార్యక్రమం చేపట్టడం వారు చేసే సేవలు అభినందనీయమని ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్  వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలకు ఇమ్యూనిటీపవర్ తక్కువ ఉన్న మహిళలు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రజలకు బ్లడ్ ఎంత అవసరమో గుర్తించి ఈ రోజు ఈ సొసైటీని ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 2012 సొసైటీని ప్రారంభించి ఇప్పటి వరకు 7 వేల మందికి బ్లడ్ డొనేట్ చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. వారి సొసైటీ అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మహిళలు కూడా సేవ చేయడంలో ముందు ఉన్నారని,  మహిళలు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అజీజ్, రిమ్స్ డైరెక్టర్ బాల కిషన్ రాథోడ్, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్, పెన్ పవర్



రామకృష్ణాపూర్ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రవీంద్రఖని ఆధ్వర్యంలో కల్వరి అనాథ వృద్ధుల ఆశ్రమంలో  వృద్ధులకు చీరలు పళ్ళు పంచి వారి మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ చైర్ పర్సన్. లయన్  కటుకం నాగరాజు క్లబ్ అధ్యక్షులు లయన్ నల్లాల శ్రీనివాస్ సెక్రటరీ లయన్ కాంపల్లి పూర్ణచందర్ ట్రెజరర్. లయన్ నక్క శ్రీనివాస్ క్లబ్ సభ్యులు గుర్రం ఉదయ్ ఆత్రం సంజయ్ గార్లు పాల్గొనడం జరిగినది. లయన్స్ క్లబ్ ఆఫ్ రవీంద్ర ఖని

నేటి సమాజంలో మహిళలు ఎంతో ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ఉండాలి

 నేటి సమాజంలో మహిళలు ఎంతో ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ఉండాలి

మందమర్రి, పెన్ పవర్

నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉండాలని మందమర్రి మార్కెట్ లోని భగత్ సింగ్ ఏరియా యువత సభ్యులు రాయబారపు కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భగత్ సింగ్ ఏరియా యువత ఆధ్వర్యంలో మందమర్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఆరోగ్య సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యువత సభ్యులు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ, మహిళలు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఉద్యోగాలు చేస్తూ ఎంతో ఓర్పుతో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్య రంగంలో పనిచేసే మహిళా ఆరోగ్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని, కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళా నాయకురాలు పద్మ, ఫర్జానా, యువత సభ్యులు శ్రీకాంత్, అశోకరెడ్డి, జమాల్, రమేష్, సుజిత్, శ్రీకర్, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు

 అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు

మందమర్రి, పెన్ పవర్


ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మహిళా నాయకురాల్లు ఉప్పులేటి గోపిక, తోకల నిరోషలు మాట్లాడాతూ, పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నా ఇంకా సమాజంలో మహిళలు వివక్షకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలను గౌరవించడం వల్లనే సమాజం అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. ప్రజలకు, మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు కళ్లెపెళ్లి శోభారాణి, యుద్దమారి లావణ్య, సిరిపెళ్లి రవళి, పుప్పాల సునీత, పోతకనూరి దివ్య, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...