Followers

అధికారులు బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి..

 అధికారులు బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్..

మేడ్చల్,పెన్ పవర్


మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ పేర్కొన్నారు..

 సోమవారం కీసర మండలం ఉప్పల్లోని మేకల భారతి గార్డెన్స్‌లో అదనపు పోలింగ్ అధికారులు (ఓపీవో)లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికలు సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మేరకు అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.  జిల్లాలో 1,31,000 మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారని... అందుకు గాను 198  పోలింగ్‌ కేంద్రాలు. ఎన్నికలకు సంబంధించి  రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని అదనపు కలెక్టర్ విద్యాసాగర్ తెలిపారు .అలాగే ఎన్నికల రోజున పోలింగ్ సెంటర్లు, ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లు జరగకుండా ముందుగానే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత శిక్షణ అధికారులను సలహాలు, సూచనలు అడిగి తెలుసుకొని జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని మరికొన్ని చోట్ల వీడియోగ్రఫీ తీయిస్తున్నట్లు అదనపు కలెక్టర్ విద్యాసాగర్ వివరించారు. పోలింగ్ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ముందుగా బ్యాలెట్ బాక్సులు పని చేస్తున్నాయా, అన్ని రకాల వస్తువులు ఉన్నాయా లేదా అనే విషయాలను చూసుకోవడంతో బ్యాలెట్ పేపర్లను సరి చూసుకోవాలన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ అందచేసిన పుస్తకాన్ని చదవాలని అన్నారు. అధికారులు ఎన్నికల నిర్వహణ సమయంలో తమ బాధ్యతను విస్మరించరాదని అదనపు కలెక్టర్ విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో దేవసహాయం, ఆర్ డి ఓ ,మల్లయ్య , తహశీల్దార్ గౌతమ్ , అదనపు పోలింగ్ అధికారులు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం..

 మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

పీఆర్టియు మేడ్చల్ జిల్లాశాఖ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జిబిఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సహా వివిధ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచే విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఈ నెల 14న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మహిళకు అవకాశం కల్పించడం ఇందుకు నిదర్శనం అన్నారు. వేసే ప్రతి ఓటు తలరాతలను మారుస్తుందని పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, పట్టభద్రులైన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఆమెకు అఖండ విజయాన్ని అందించాలన్నారు. అనంతరం గత సంవత్సరం నుండి పదవి విరమణ పొందిన మహిళా ఉపాధ్యాయురాళ్ళకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు బూర్గుబావి హన్మంత రావు, సభాద్యక్షురాలు బి.ఆశారాణి, పీఆర్ టియు జిల్లా అధ్యక్షులు రామేశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కుత్బుల్లాపూర్ ఎంఈఓ ఆంజనేయులు, జిహెచ్ఎం స్వరూప రాణి, పిఆర్ టియు రాష్ట్ర బాధ్యులు జి.విజయలక్ష్మీ, పుష్పలత, సరస్వతి, మాధవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

విచ్చలవిడి మద్యపానంతో..పక్కతోవ పడుతున్న బాల్యం..

 విచ్చలవిడి మద్యపానంతో..పక్కతోవ పడుతున్న బాల్యం..

చోద్యం చూస్తున్న విద్యావ్యవస్థ..

కేసముద్రం, పెన్ పవర్


మహబూబాద్ జిల్లా వరంగల్ జిల్లా మధ్య గ్రామాలైన కోరుకొండ పల్లి అలంఖానిపేట గ్రామ సమీపంలో 10,12 సంవత్సరాల పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుతూ ఉన్నతమైన ఆశయాలకోసం పాటు పడవలసిన బాల్యదశ,,దానికి, ప్రభుత్వము తల్లిదండ్రులు సమాజం, చిన్ననాటి నుండి మంచి మాటలు మంచి జ్ఞానాన్ని అందించవలసింది.. కానీ నేటి పల్లె ప్రాంతాల్లో గ్రామీణ స్థాయిలో బాల్య దశ ఏ విధంగా తయారవుతుందో దానికి ఈ ఫోటో నిదర్శనం.. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ మహబూబాబాద్ జిల్లా గ్రామాలలో బెల్టుషాపుల నిర్వాకం వల్ల 24 గంటలు మెడికల్ షాప్ అనే నిదానం పోయి 24 గంటలు మద్యం బెల్ట్ షాపులు అనే చందంగా మారిందంటే అతిశయోక్తి కాదు.. అర్ధరాత్రి పట్టపగలు అనే సమయం లేకుండా యువతీ యువకులు నేడు చాలామంది బెల్ట్ షాప్ లో మద్యం తీసుకొని గ్రామాల మధ్య చెట్ల పొదల్లో పంట పొలవద్ధ మొరీల పైన కూర్చుని మద్యం తాగి అక్కడే వదిలేసిన తినుబండారాలు..మద్యం బాటిళ్లను పడేసి వెళ్తున్నారు..ఉదయం ఆయా గ్రామాల పిల్లలు పాఠశాలలు లేకపోవడంతో రోడ్ల వెంట పొలాల వెంట తిరిగి ఖాళీ మద్యం బాటిళ్లను సేకరించి స్థానిక వచ్చే పాత ఇనుప సామాన్లు కొనే వారికి అమ్మేసి డబ్బులు తీసుకుని చిల్లర ఖర్చులకు ఈ పిల్లలు కాలం వెళ్లదీస్తూ సమయం గడుపుతున్నారు.. ఇది ఇలాగే కొనసాగితే కొద్దిరోజుల్లో బాల్య దశ ప్రమాదంలో పడిపోయే ప్రమాదం లేకపోలేదు వారికి మంచి జ్ఞానం అందకపోతే "నేటి బాలలే రేపటి పౌరులు" ఆనే నినాదం తూడిచి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కనబడుతుంది, కావున ఇప్పటికైనా స్థానిక పోలీస్ మరియు గ్రామాల ప్రజాప్రతినిధులు విద్యా వ్యవస్థలు ప్రత్యేక చర్యలు తీసుకొని ఈ అక్రమంగా మద్యాన్ని ఎక్కడపడితే అక్కడ తాగడాన్ని కఠినంగా శిక్షించాలని పిల్లలను మంచి విద్యను అందించి రేపటి భవిష్యత్తు ఒక అబ్దుల్ కలాం అందించాలని పెన్ పవర్ మా వంతు మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నది

పూర్వవిద్యార్థుల సమ్మేళనం

 పూర్వవిద్యార్థుల సమ్మేళనం

లక్షెట్టిపెట్,పెన్ పవర్

పట్టణంలోని కళాంజలి ఫంక్షన్ హాలులో కరిమల జూనియర్ కలశాలలో 2003 నుండి 2005వ సంవత్సరం వరకు ఇంటర్ ఎంపిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాడు చదువుకున్న రోజుల్లో జరిగినతీపిజ్ఞాపకాలనుగుర్తుచేసుకొనిఆనందంలో మునిగిపోయారు.ప్రస్తుతం ఎక్కడెక్కడో కుటుంబ సభ్యులతో ఉద్యోగ రీత్యా స్థిరపడిన స్నేహితులు అందరూ ఒక్కటై విద్య బుద్ధులు నేర్పిన అధ్యాపకులను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి,పూర్వ విద్యార్థులు రందేని స్వామి,రమేష్,మల్లేష్,రాజేందర్, రాధిక, సంధ్యారాణి,లావణ్య తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ దొడ్ల కార్యాలయంలో మహిళా దినోత్సవం

 కార్పొరేటర్ దొడ్ల కార్యాలయంలో మహిళా దినోత్సవం

కూకట్ పల్లి,పెన్ పవర్


మహిళా దినోత్సవం సందర్భంగా 124డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో స్త్రీవిముక్తి అభ్యుదయ సంఘం సభ్యులకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షురాలు సంగిరాగుల విజయమ్మ కార్పొరేటర్ చేతుల మీదుగా మహిళా సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పుష్ప, జిల్లా నాయకురాలు వాణి, రేణుక మరియు ఎల్లమ్మ బండ మహిళా నాయకులు పాల్గొన్నారు.

ఎబివిపి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లుగా జేఎన్టీయూ విద్యార్థులు

 ఎబివిపి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లుగా జేఎన్టీయూ విద్యార్థులు

కూకట్ పల్లి,పెన్ పవర్


అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ 39వ రాష్ట్ర మహాసభలు కామారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రెడ్డి కూకట్ పల్లి జె.ఎన్.టి.యూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ విద్యార్థులు మంచాల. శేషుశ్రీ, బల్త. రుత్విక్ వర్మలను రాష్ట కార్యవర్గ సభ్యులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా శేషుశ్రీ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినిల సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తానని, విద్యార్థినులలో తమ సమస్యలపై తామే పోరాడే విధంగా ఆత్మస్థైర్యాన్ని నింపుతానని, విద్యార్థినులతో కలిసి మహిళ సాధికారత వైపు అడుగులు వేసేలా కృషి చేస్తానని చెప్పారు. రుత్విక్ వర్మ మాట్లాడుతూ విద్యర్ధుల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేసి సమస్యలను పరిష్కరిస్తామని, విద్యార్థుల్లో జాతీయవాదా భావజాలాన్ని వ్యాప్తి చేస్తామని, విద్యార్థులను దేశాభివృద్ధిలో భాగం చేస్తూ విద్యార్థుల సహకారంతో సెమినర్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. వీరి ఎన్నిక పట్ల జె.ఎన్.టి.యూ విద్యార్థులు సాయి కుమార్, వర్షిత్, జ్యోతి, తమ్మినేని పఠాన్ బాబు, శరణ్, రామకృష్ణ, ఇతర విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

మహిళలకు ఘన సన్మానం

 మహిళలకు ఘన సన్మానం

కూకట్ పల్లి,పెన్ పవర్


మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగిపోవాలి అని  జైభారతమాత సేవ సమితి  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లద్దే నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి కే.పీ.హెచ్.బి కాలనీ భాగ్యనగర్ కాలనీలోని జైభారతమాత సేవ సమితి కార్యాలయంలో మహిళా దినోత్సవని పురస్కరించుకుని  మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సమాజంలో ఇంకా వివక్షకు గురవుతున్నారని, రోజు ఎక్కడో ఒక చోట స్త్రీలపట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు మహిళలకు సముచిత స్థానం కల్పించే దిశగా ముందుకు సాగాలి అని వారు సూచించారు. ఒకప్పుడు ఇంట్లో ఉండే మహిళలు ఇప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాలు నడిపే స్థాయికి ఎదిగారని, ఇకపైన కూడా మగవాళ్లకు దీటుగా మరింత ముందుకు సాగాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మినీ రాథోడ్ జై భారత మత సేవ సమితి మహిళ ప్రెసిడెంట్, పోలిన సుబ్బారావు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ఎర్రవలి ప్రభాకర్ రావు జనరల్ సెక్రటరీ, విఠల్, మహేష్ గౌడ్, నరసమ్మ, స్వరూప గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...