Followers

న్యాయవాదుల జంట హత్యలపై సిబిఐ విచారణ చేపట్టాలి

 న్యాయవాదుల జంట హత్యలపై సిబిఐ విచారణ చేపట్టాలి



కూకట్ పల్లి/పెన్ పవర్

న్యాయవాదుల జంటహత్యల విచారణలో జరుగుతున్న జాప్యాని నిరసిస్తూ పెడరేషన్ ఆఫ్ బార్ తెలంగాణ పిలుపు మేరకు విధులు బహిష్కరించి కూకట్ పల్లి కోర్టు ముందు న్యాయవాదులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల దారుణ హత్యపై న్యాయవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయని,  కేసులో అసలైన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ న్యాయవాదులు సంతకాల సేకరణ, రిలే నిరాహారదీక్షలు, రహదారి ముట్టడిలు చేస్తున్న సరే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద దంపతుల కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన  సమయంలో ఉద్యమాలు చేసినప్పుడు న్యాయవాదుల ఆవేశం చూశారని, ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించక పోతే ఉద్యమ సమయంలో చూసిన న్యాయవాదుల ఆగ్రహాన్ని మళ్ళీ చూస్తారని హెచ్చరించారు. హత్యపై సీఎం కేసీఆర్ స్పందించి తక్షణమే న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈహత్యల కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు జి.శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వర్ రెడ్డి, శేఖర్ బాబు, నాగేశ్వరరావు, కేశవరావు, నరేందర్ రెడ్డి, నర్సింగరావు, రాజేష్, రాంబాబు, పద్మారావు, శ్రీనివాస్ సింగ్, మహిళ న్యాయవాదులు శ్రీదేవి, హేమలత, శ్రీలత, షాలిని ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

కండల వీరుడు శివాజీకి ప్రసంశల జల్లు

 కండల వీరుడు శివాజీకి  ప్రసంశల జల్లు 

పెన్ పవర్,వరదయ్యపాలెం

హైదరాబాదులోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను నరేష్ సూర్య క్లాసిక్ సంస్థ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బాడీ బిల్డర్ లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంకు చెందిన అక్షిం పాలెం గ్రామం నుండి పెట్టి శివాజీ పాల్గొని ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.80 కిలోల విభాగంలో ఈ బహుమతి చేజిక్కించుకున్నారు.దాతలు ముందుకు వచ్చి మరింత సహాయ సహకారాలు అందించిన ఎడల లక్నోలో జరగబోవు జాతీయ స్థాయి పోటీలలో,ఏప్రిల్ లో జరగబోవు మిస్టర్ ఇండియా పోటీలలో కూడా పాల్గొని బహుమతి సాధించగలను అని శివాజీ తెలిపారు.మారుమూల గ్రామం నుండి ఎదిగి, తమ ఊరికి పేరుప్రఖ్యాతులు తీసుకు వస్తున్న శివాజీని అందరూ అభినందించి ప్రశంసలతో ముంచెత్తారు.

బోథ్ బార్ అసోషియేషన్ ఎన్నిక

 బోథ్ బార్ అసోషియేషన్ ఎన్నిక



గుడిహత్నూర్ (ఆదిలాబాద్)/ పెన్ పవర్

బోథ్ బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి.  బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వామన్ రావ్ దేశ్ పాండే, ప్రధాన కార్యదర్శిగా పంద్రం శంకర్, మహిళా ప్రతినిధి గా గంగా సాగర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. గెలుపొందిన ప్యానల్‌ను సహచర న్యాయవాదులు పట్టణ ప్రముఖులు అభినందించారు.

పుస్తకాలు మోసే వయసులో..పుస్తెల భారం వద్దు

 పుస్తకాలు మోసే వయసులో..పుస్తెల భారం వద్దు

బాల్య వివాహాలపై ప్రత్యేక నిఘా

మహా శివరాత్రి సందర్భంగా బలవంతపు బాల్య వివాహాలు జరగకుండా చర్యలు

సచివాలయాల మహిళ పోలీసులతో సమావేశమైన  ఎసై పురుషోత్తం రెడ్డి

 చిత్తూర్,పెన్ పవర్

  సత్యవేడు నియోజకవర్గం- వరదయ్యపాళెం మండలంలోని పాండూరు జోతీశ్వరాలయంలో శివరాత్రి మరుసటి రోజు స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం జరుగుతున్న సందర్భంగా(శుక్రవారం) అదే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు కొంతమంది పెళ్లిళ్లు చేసుకోవడం ఆనవాయితీ.ఈ క్రమంలో బాల్యవివాహాలు జరగకుండా పోలీసులు ఐసీడీసీ,అధికారులతో కలిసి అడ్డుకోవడానికి తగు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపిన ఎసై పురుషోత్తం రెడ్డి తెలిపారు.ఈసందర్భంగా ఎసై మాట్లాడుతూ జోతీశ్వరాలయం లో జరుగు శివరాత్రికి మరియు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి స్థానిక భక్తులతో పాటు సరిహద్దుల్లో ఉన్న నెల్లూరు జిల్లా, తమిళనాడు ప్రాంతాల నుండి వస్తుంటారని వారు ఖచ్చితంగా మాస్క్ లు ధరించి  కోవిడ్ నిబంధనలు పాటించాలని, పెళ్లిళ్లు చేసుకొనే వారు తమ వయసు ధ్రువపత్రాలు తెచ్చుకోవాలని ముందుగా ఆలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని. మావినపని కాదని బలవంతపు బాల్య వివాహం చేయాలని ప్రయత్నం చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆలయం వద్ద పోలీసు శాఖ తరపున బందోబస్తు ఏర్పాటు పూర్తిస్థాయిలో చేస్తామని తెలిపారు.ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్ళి చేసి బాధ్యత తీరిందని చేతులుదులుపుకోవలనుకొనే తల్లిదండ్రులు తమ కూతురు భవిషత్తులో ఏవిధంగా ఉంటుందో ఆలోచించాలని చిన్న వయసులోనే సంసార బాధ్యతలు-ఆపై ప్రసవాలు. దీనివలనమానసికంగాఒత్తిడి,శారీరకంగాఆరోగ్యసమస్యలుతలెత్తుతాయని వివాహానికి అధికారికంగా ప్రభుత్వం నిర్దేశించిన వయస్సులో తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తే ఎలాంటి ఇబందులు తలెత్తవాని.అయిన ప్రస్తుతం ప్రభుత్వం కూడా మహిళ సాధికారికత కోసం ప్రత్యేకం గా దృష్టి పెట్టి వారికి పథకాలు అమలు చేస్తుందని తమ పిల్లలకు విద్య వాంతులు చేసి సమాజంలో తమ కాళ్లపై తాము నిలబడే విధంగా తీర్చిదిద్దే పద్ధతి తల్లిదండ్రులు ఆలోచించమని  ఎసై పురుషోత్తం రెడ్డి తెలిపారు.

ప్రాణ దాతల సహాయం కోసం ఎదురు చూపు

 ప్రాణ దాతల సహాయం కోసం ఎదురు చూపు



సిరిసిల్ల (పెన్ పవర్)

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన జంగిలి దేవయ్య బిడ్డకి సిరిసిల్లలో సోమవారం  డెలివరి కాగ కవలలు జన్మించారు. వారిలో ఒక అమ్మాయి , ఒక అబ్బాయి ఉన్నారు. దేవయ్య అల్లుడు ఎర్ర బాబు కోనరావుపేట రామన్నపేట గ్రామస్తుడు. అయితే ఆ పిల్లలు  పూర్తి నెలలు నిండకుండానే 7నెలలకు జన్మించారు. వారిని 8వారాలు ఇంక్యూబేటర్ మరియు వెంటిలేటర్ లో ఉంచాలని వైద్యులు సూచించడంతో ఆ పిల్లలకి మెరుగైన చికిత్స కోసం  హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్లాల్సింది అయితే   30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపడంతో  ఎర్ర బాబు  కడు నిరుపేదరికం లో ఉండడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది కావున  ఎవరినైన దాతలు సహాయం చేయగలరని, ఎవరైనా డబ్బులు పంపాలనుకునే వారు ఈ క్రింది నెంబర్ మరియు అకౌంట్ కి పంపగలరు. 9666646854 వారు తెలిపారు. మంత్రి కేటిఆర్ తమను ఆదుకోవాలని వారు కన్నీటితో వేడుకున్నారు.

కొవ్వూరు మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

 కొవ్వూరు మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

పెన్ పవర్, కొవ్వూరు

బుధవారం జరిగే పురపాలక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల పరిశీలకులు శ్రీకేష్ లత్కర్ ఐఏఎస్ పేర్కొన్నారు.కొవ్వూరు లోని సంస్కృత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎలక్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆయన మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా జరగడానికి పటిష్టమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు.పట్టణంలోని పది వార్డులకు 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.సమస్యాత్మక కేంద్రాలుగా పదింటిని గుర్తించామన్నారు ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును విలువైనదిగా భావించి తప్పనిసరిగా వినియోగించుకోవాలి అన్నారు.గత గ్రామ పంచాయతీలో జిల్లాలో 82% ఓటింగ్ ను నమోదు చేయడం విశేషమన్నారు. అదే పోలింగ్ శాతాన్ని మించేలా పురపాలక ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.పోలింగ్ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి, పురపాలక కమిషనర్ కె. టి. సుధాకర్, వివిధ శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు.

శాసనమండలి ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి..

 శాసనమండలి ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి..

శామీర్ పెట్ లోని బ్యాలెట్ బాక్సుల గోడౌన్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి

మేడ్చల్ ,పెన్ పవర్



మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మంగళవారం జిల్లాలోని శామీర్ పెట్ లో గల ఎమ్మెల్సీ ఎన్నికల గోడౌన్ ను అక్కడ ఉన్న భద్రత వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు  జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసిందని ఇప్పటికే సరిపడా సిబ్బందిని నియమించిన జిల్లా ఎన్నికల అధికారులు మిగతా ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.. ఈ నేపథ్యంలో సరిపడా బ్యాలెట్‌ బాక్సులను కూడా సిద్ధం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి 250   కరీమ్ నగర్  జిల్లా నుండి  218 బ్యాలెట్‌ బాక్సులను కూడా జిల్లాకు తీసుకువచ్చారు .ఈ సందర్భంగా జంబో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ముందుగానే వాటిని జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. అలాగే బ్యాలెట్ బాక్సులను ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళేందుకు అవసరమైన 41 రూట్లలో రవాణా ఏర్పాట్లను చేయడంతో పాటు సిబ్బందికి బస్సులను ఏర్పాటు చేసి వారు ఎన్నికల కేంద్రాలకు వెళ్ళేందుకు తగిన బందోబస్తు కల్పించాలని కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు.. ఎన్నికల కేంద్రాల్లో సిబ్బందికి అవసరమైన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచాలని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే అన్ని సమకూర్చాలని కలెక్టర్ అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్, డీఆర్వో లింగ్యానాయక్, తహశీల్దార్, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

[18:17, 3/9/2021] +91 94404 28241: Next

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...