Followers

ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు.

 ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు

సిరిసిల్ల ,పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా  కోనరవుపేట మండలం లోని లయన్ తండా, కమ్మరిపేట తండా, గోవిందరావుపేట తండా, లచ్చపేట తండా లలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ వలయాధికారి ఎంపీఆర్ చంద్రశేఖర్  ఆధ్వర్యంలో  సిబ్బంది దాడులు చేసి 120 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేసారు. లీటర్ల నాటుసారా సీజ్ చేసారు .ఈ నాటు సారా తయారీ కి బాధ్యులు అయినటువంటి  వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ఎవరైనా గుడుంబా తయారుచేసినా, అమ్మినా వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఈ దాడుల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఎస్సై కిషన్, ట్రైనీ ఎస్సైలు శ్రీకాంత్, శేఖర్ లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరావు,  హకానీ, అబ్దుల్లా, మజీద్ మరియు కానిస్టేబుల్స్ శంకర్, హమీద్,సుమన్, రాజేందర్, శ్రీనివాస్, రాకేష్, పర్శరామ్, సుమలత, రజిత పాల్గొన్నారు.

వైఎస్ షర్మిలను కలిసిన జిల్లా వైఎస్సార్ సిపి నాయకులు

 వైఎస్ షర్మిలను కలిసిన  జిల్లా వైఎస్సార్ సిపి నాయకులు

మందమర్రి, పెన్ పవర్

హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల ను మంగళవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి నెల చివర్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. షర్మిలను కలిసిన వారిలో వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,టీటీడీ ఎల్ఎసి సభ్యులు బెజ్జంకి అనిల్ కుమార్, నాయకులు షేక్ అజీమోద్దీన్, సుద్దాల ప్రభుదేవ్, వంశీ, బొంతు అఖిల్,జావేద్ తదితరులు కలరు.

మాడుగుల సీ.డీ.పీ.ఓ.అనంత లక్ష్మికి ఉత్తమ అవార్డు

 మాడుగుల  సీ.డీ.పీ.ఓ.అనంత లక్ష్మికి ఉత్తమ అవార్డు

మాడుగుల,పెన్ పవర్

మాడుగుల ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు అధికారిణి అనంత లక్ష్మి ఉత్తమ అధికారి అవార్డు వరించింది.సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారి గా ప్రశంసాపత్రం మెమోంటోను అందుకున్నారు. సీడీపీఓగా విధినిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె సేవలకు ఎస్. డి.సి.జిల్లా స్త్రీ-శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.సీతా మహాలక్ష్మి చేతుల మీదుగా పీఓ. ఉత్తమ అవార్డు స్వీకరించారు. అలాగే  ఐసిడిఎస్  ఉద్యోగులు బి. లక్ష్మి  వి రమాదేవి సరోజినిలు కూడా అవార్డు లు అందుకున్నారు.

ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కు వినతి పత్రం

 ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో  ఎంపీడీవో కు వినతి పత్రం

గొల్లపల్లి, పెన్ పవర్

 జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ (0706) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పనుల గురించి తనిఖీ చేయుట నిమిత్తం అనుమతించాల్సిందిగా ఎంపీడీవో కు వినతి పత్రం అందించిన సమాచార హక్కు చట్టం (0706) గౌరవ అధ్యక్షులు జంగిలి సత్యం, అధ్యక్షుడు భూమయ్య సభ్యులు ఆవుల వెంకటేష్ యాదవ్ మామిడాల లింగన్న ముస్కు అభిషేకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

మున్సిపాలిటీ సిబ్బంది దందా...

మున్సిపాలిటీ సిబ్బంది దందా...

 దుండిగల్,పెన్ పవర్

 దుండిగల్ మున్సిపల్ కమీషనర్ కార్యాలయం ముందు బహుదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీ వాసుల దర్నా.. ఇష్టానుసారంగా ఇంటిపన్నులు వసూలు చేస్తున్నారని బాధితుల ఆరొపణ.మున్సిపల్ సిబ్బందికి డబ్బులు ఇస్తె 50%. డబ్బులు ఇవ్వకపోతె 100% పన్నులు వసూలు చేస్తూ పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది బహిరంగంగానే బెదిరిస్తున్నారని.కాలనీవాసులు కమీషనర్ కు పిర్యాదు చేశారు.

మొటేషన్ లో పేరు మార్చిన అధికారులు.ఆమ్యామ్యాలు ఇవ్వలేదని తిరిగి 7 నెలలకు పాత యజమాని పేరుతోనే ఇంటిపన్నులు.. అధికారుల అగాయిత్యాలపై స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మెన్ పద్మారావు కు పిర్యాదు. సమస్య పరిష్కరిస్తానన్న కౌన్సిలర్ పద్మారావు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ

 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ

విశాఖపట్నం,పెన్ పవర్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేసి తీరుతామని,ఇందులో ఎలాంటి సందేహం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను ఖండిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం అల్లిపురం నాలుగు రోడ్ల జంక్షన్ లో రాస్తా రోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడానికి సన్నాహాలు చేస్తూనే తాజాగా వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేసి తీరుతామని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించడం చూస్తే బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ నిర్ణయాన్ని ఆడ్డుకోవాల్సిన రాష్ట్ర అధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు గోరంగా వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ మరో పక్క జనసేన పార్టీ నాయకత్వం కూడా బీజేపీ నిర్ణయాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారని విమర్శించారు. రేపు జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో పై పార్టీల వారికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృషి చేయలేని వారు ఓట్లు అడిగే నైతిక హక్కును కోల్పోయారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు జి కాసులరెడ్డి, స్థానిక నాయకులు చామన విశ్వేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పెట్రోలు బంకుపై చర్యలకు సిద్దమైన జీహెచ్ఎంసి

 పెట్రోలు బంకుపై చర్యలకు సిద్దమైన జీహెచ్ఎంసి

కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ సూరారం కట్టమైసమ్మ చెరువు కట్ట బఫర్ జోన్ ఆక్రమిస్తూ నిర్మంచిన పెట్రోలు బంకుపై చర్యలకు సిద్దమైన జీహెచ్ఎంసి.. రెవెన్యూ.ఇరిగేషన్ మూడు శాఖల అధికారులు.బంకులో గాజులరామారం ఉపకమీషనర్ రవిందర్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక విబవాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ గణేష్. సెక్షన్ అధికారి నరేష్. రెవెన్యూ అధికారులు సర్వేయర్ సునిత.

విఆర్ఓ బాలరాజు మరియు డిమాలిషన్ స్క్వాడ్ తో బంకు వద్దకు చేరుకొని.డాక్యుమెంట్లు పరిశీలన. అనంతరం సీజ్ చేసిన అధికారులు. పెట్రోలు బంకులో క్రయవిక్రయాలు జరపకూడదని బంకు సిబ్బందికి హెచ్చరికలు చేసిన అధికారులు నోటీసులు జారీ.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...