Followers

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్

 మృతుల కుటుంబాలను పరామర్శించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు దంపతులు...

 బేలా,  పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లోని కరంజీ గ్రామంలో చరణ్ రెడ్డి, బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ఉపేందర్ ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను శుక్రవారం ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు  మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాంగిడి ఎం పి టి సి రాకేష్, టిఆర్ఎస్ కార్యకర్తలు వసంత్, ఎస్కే మహమ్మద్, అయూబ్, పవన్ రావు, టిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు గ్రామానికే వచ్చి కొనుగోలు చేస్తాం

 రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు గ్రామానికే వచ్చి కొనుగోలు చేస్తాం...

జైనథ్ మండల కేంద్రంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న

జైనథ్,  పెన్ పవర్ 

రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు కుడా ప్రభుత్వమే గ్రామనికే వచ్చి కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్  మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో తెలంగాణ మార్క్ ఫెడ్, పాక్స్ పిఎసిఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై  ప్రారంభించారు. తూకం యంత్రానికి పూజలు జరిపిన అనంతరం కొనుగోళ్లను ప్రారంభించారు. పలువురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా  జోగురామన్న మాట్లాడుతూ రైతులను ఆదుకావాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. 5100 రూపాయల మద్దతు ధరతో తేమ శాతం 14కు మించకుండా ఉన్న పంటను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు.   రైతులు ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు సుప్రీమ్ కోర్ట్ స్టే ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో పంటలను రైతుల వద్ద నుండి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజ రెడ్డి, జైనథ్ ఎంపీపీ మర్శెట్టి గోవర్ధన్,  జడ్పీటిసి అరుంధతి వెంకట్ రెడ్డి, ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, వైస్.ఎంపీపీ విజయ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ బాలురి గోవర్ధన్ రెడ్డి, గూడ పి.ఏ.సి.ఎస్ చైర్మన్, మెడిగుడా పి.ఏ సి.ఎస్ చైర్మన్ లు, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ లింగారెడ్డి, మార్క్ ఫెడ్ డీఎం పుల్లయ్య, అగ్రికల్చర్ ఆఫీసర్ వివేక్, ఎమ్మార్వో మహేంద్రనాథ్, ఎం.పి.డి.ఓ  తదితరులు పాల్గొన్నారు.

బాల వికాస్ ఫౌండేషన్ మత్య్సకార మహిళలకు టైలరింగ్ లో శిక్షణ

 బాల వికాస్ ఫౌండేషన్ మత్య్సకార మహిళలకు టైలరింగ్ లో శిక్షణ


మహారాణి పేట, పెన్ పవర్

బాల వికాస్ ఫౌండేషన్. మత్య్సకార మహిళలకు టైలరింగ్ లో శిక్షణ  ఫిషింగ్ హార్బర్ సమీపమ్ లో గల బాల వికాస్ ఫౌండేషన్ బ్రిడ్జి స్కూల్ ప్రాంగణం లో మహిళలకు మార్చి 22 నుండి మూడు నెలల పాటు టైల్ రింగ్ అంశం లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్విహించ ను న్నారు  మహిళలు ఆర్దికంగ నిలదొక్కు కోవడానికి ఈ శిక్ష న  ఉపయోగ పడుతుంది .ఈ ఉచిత తరగతులు ప్రతిరోజూ ఉదయం 10.30 నుండి 12 30 వరకూ ఉంటుంది. కనీసం 7 వ తరగతి అర్హత ఉన్నవాల్లు నెరుగా పాల్గొన వచ్చ్నును (9032477463) కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని నరవ ప్రకాశం రావ్ కార్యదర్శి తెలియజేశారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యాఖ్యలు శోచనీయం

 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యాఖ్యలు శోచనీయం...

దళిత, విద్యార్ధి సంఘాలు

 ఉట్నూర్,  పెన్ పవర్ 

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్  పై కొందరు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని, దళిత, బడుగు బలహీన వర్గాల పిల్లలు జీవితాలలో వెలుగులు నింపుతున్న గురుకులాల పై విషం కక్కడం తగదని, బహుజనులు, మేధావులు ప్రవీణ్ సార్ కి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని దళిత విద్యార్థి సంఘాలు  వెల్లడించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్  మండలంలో దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గురుకుల మోడల్ ను కేసు స్టడీ గా తీసుకోవడంచే గురుకులాలు విశ్వవ్యాప్త ఖ్యాతి గడించిందని, అడవి బిడ్డలను ఎవరెస్టు అంత ఎత్తుకు అభివృద్ధి దిశగా నడిపిస్తున్న గురుకులాల  కార్యదర్శి పై విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసారు.  ఈ కార్యక్రమంలో దళిత జేఏసీ కన్వినర్ కాంబ్లే ప్రజ్ఞశీల్,  టిఎస్ ఎస్ ఓ  జిల్లా అధ్యక్షులు జాడి వెంకటేష్,  ఎన్ ఎస్ యు ఐ  ప్రధాన కార్యదర్శి రాథోడ్ కళ్యాణ్, పరమేష్ అరికెల, నవీన్, సాగర్, దివాకర్ బొమ్మేనా తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్ ప్రభుత్వం

 రైతు సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది

 *ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న

 * జైనథ్ మార్కెట్ యార్డ్ లో శనగా కొనుగోళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

 * పార్టీలో భారీ సంఖ్యలో చేరారు బిజెపి కాంగ్రెస్ నేతలు


 ఆదిలాబాద్,  పెన్ పవర్

ఆదిలాబాద్ గ్రామీణ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బృహత్తర సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీ ల నాయకులూ టీ.ఆర్.ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం జైనథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి శనగ కొనుగోళ్లను  ప్రారంభించారు. అనంతరం  ఆదిలాబాద్ గ్రామీణ మండలం న్యూ రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీ లకు చెందిన నేతలు టీ.ఆర్.ఎస్ పార్టీ లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబి కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, ఇతర పార్టీ ల నేతలు కొట్నాక్ జంగు, దుర్శెట్టి కృష్ణ, నరేందర్ రెడ్డి, రాజు, అశోక్ తదితరులు పార్టీ లో చేరగా ఎమ్మెల్యే రామన్న  వారికి గులాబి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిందని, ప్రస్తుతం అవి సుప్రీమ్ కోర్ట్ చొరవతో స్టే లో ఉన్నాయని పేర్కొన్నారు. పంట కొనుగోలులో ఇరవై శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం నిబంధనలు పెట్టిందని గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో అన్నదాతలు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారని, అందుకు అనుగుణంగానే శనగ కొనుగోళ్లను ప్రారంభించినట్లు వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం ఇప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అక్కడి ప్రభుత్వాలు విఫలం అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజా రెడ్డి, ఆత్మ చైర్మన్ జిట్ట రమేష్ గారు, ఎం.పీ.పీ సెవ్వ లక్ష్మి జగదీష్, టి.ఆర్.ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రురల్ కొడప సోనేరావ్, టీ.ఆర్.ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి ఆరే నరేష్, మాజీ జెడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, పి.ఏ.సి.ఎస్ చైర్మన్  గారు, సర్పంచులు ఎం.పి.టి.సీలు నాయకులు ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేయాలి..

 రక్తదానం చేయాలి..

విజయనగరం,పెన్ పవర్

 దాతలు ముందుకు వచ్చి రక్త దానం చేయాలని లోక్ సత్తా  అధ్యక్షులు బిశెట్టి బాబ్జి కోరారు. శుక్రవారం గ్రామీణ వైద్యులు సంఘo,  మాతృ భూమి సేవ సంఘము         ఎన్ విఎన్ బ్లడ్ బ్యాంక్ లో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రాభించిన బాబ్జి వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు వ్యవస్థపక అధ్యక్షులు జోషి, జిల్లా అధ్యక్షులు చిరంజీవి, మాతృ భూమి కార్యదర్శి గోపాల రావు , డాక్టర్ కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

జగనన్న ఆలోచనే..దొరన్న ఆచరణ

 జగనన్న  ఆలోచనే..దొరన్న ఆచరణ

జగ్గంపేట,పెన్ పవర్

 తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఇంచార్జ్ దవులూరి దొరబాబు విశ్వాసానికి..విధేయతకు పర్యాయ పదంగా మారిపోయాడు  జగనన్న చెప్పిందే వేదం చూపిందే ఆయనకు మార్గం ఇదీ దొరబాబు నైజం.. 2019 సార్వత్రిక ఎన్నికలలో చివరి క్షణంలో పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ మరొకరికి మార్చినప్పుడూ అదే చిరునవ్వు.. అదే విధేయత.. అదేవిశ్వాసం... తర్వాత జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పదివిలో ఆఖరు నిమిషంలో వేరే వారిని కూర్చోబెట్టినా అదే చిరుమందహాసం.. అదే గుండె నిబ్బరం...జగనన్న పట్ల అదే విశ్వాసం పార్టీ బలోపేతం పట్ల అదే నిబద్దతతో కూడిన కృషి.. సర్వేలు సైతం పెద్దాపురం నియోజకవర్గంలో గల రెండు మున్సిపల్ చైర్మన్ పీఠాలను  టి.డి.పి కైవసం చేసుకుంటుందని చెప్పినా.. సొంత పార్టీ లోని వ్యక్తులు ఎన్ని కుయుక్తులు పన్నినా ఇంచార్జి పదవికోసం గోతికాడ నక్కల్లా ఎదురు చూసే నాయకులు ఎన్ని రాజకీయాలు చేసినా  ఎక్కడా అదరక.. బెదరక.. చెదరక..ముందుండి తన క్యాడర్ ను మున్సిపల్ ఎన్నికలలో విజయతీరాలకు చేర్చిన నాయకుడు... సామర్లకోట పట్టణం..  పెద్దాపురం నియోజకవర్గంలోనే కాదు తూర్పుగోదావరి జిల్లా అంతా దొరబాబు గారి తల్లి గారు శ్రీమతి పార్వతి గారు చైర్మన్ పీఠం అధిరోహిస్తున్నారని దృఢవిశ్వాసంతో అదే నిజమని అభినందనలు అందిస్తూ .. సంబరాలు చేసుకొంటున్న వేళ మళ్లీ అదే... నిరుత్సాహ పరిచే వార్త ... చైర్మన్ పదవి మీ తల్లిగారికి కాకుండా వేరే వారికి ఇవ్వమని సాక్షాత్తు ప్రియతమ ముఖ్య మంత్రి వర్యులు వై.ఎస్.ఆర్. పార్టీ అధినేత జగన్ మోహన్  రెడ్డి చెప్పగానే చిరునవ్వుతో ఓ.కె. అని చెప్పి తన విధేయతను జగన్ పట్ల విశ్వసనీయతను ప్రకటించిన దొరబాబు కు యావత్ ప్రజానీకం వై.ఎస్.ఆర్. క్యాడర్ మొత్తం సెల్యూట్ చేస్తుంది.. నాయకుడంటే తనకోసం కాకుండా తన పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాలకోసం ఎన్ని త్యాగాలనన్నా చేయవలసి ఉంటుందని తన నడవడిక ద్వారా మనసా..వాచా.. కర్మణా .. ఆచరించి చూపిన దొరబాబు నిజంగా విధేయతకు విశ్వాసనీయతకు నిలువెత్తు నిదర్శనం కాదనగలమా... యావత్  జిల్లా ప్రజానీకం మొత్తం దొరబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవ..కార్యకర్తలతో చర్చించి తీసుకొనే సముచిత నిర్ణయాలు, అధికారులను గౌరవిస్తూ  నియోజక అభివృద్ధికి ఆయన అధికారులతో సమన్వయం అవుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చడంలో చూపే చొరవ.. అవినీతికి.. లంచగొండి తనానికి తావీయక చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల యావత్ జిల్లా ప్రజానీకం నాయకుడంటే దొరబాబే అనే విధంగా మన్ననలు పొందుతున్నా.. ఆయనకు అధినాయకుడు మరో పిడుగులాంటి వార్త చెప్పినా ఒక్క మాట కూడా మారు మాట్లాడకుండా శిరోధార్యం గా భావించే నైజం దొరన్నకే  సొంతం   శ్రీమతి దవులూరి పార్వతి గారు సామర్లకోట మున్సిపల్ చైర్మన్ పదవిని అలంకరిస్తున్నారు అని అందరూ సంతోషిస్తున్న తరుణంలో కాదు జగనన్న ఆదేశం ఇది అని తెలిసిన మరుక్షణం జనం ఆవేశం ఆపటం దొరబాబుకు సైతం సాధ్యం కాలేదు.యావత్ జిల్లా ప్రజానీకం ఇంకెంతకాలం ఈ అన్యాయాన్ని భరిస్తావని కొందరు.. నీకు బాధగా లేదా మాకు గుండెలు మండిపోతున్నాయి అని కొందరు.. సొంత డబ్బు ఖర్చుపెట్టడం కాదు ప్రజల డబ్బు దోసుకొనేవాడే కావలి ఈ నాటి రాజకీయాలకు అని మరికొందరూ.. నీ వ్యాపారాలు.. కుటుంబాన్ని వదిలి వస్తే గుర్తింపు ఇవ్వని ఈ పార్టీలో ఎందుకు అని రకరకాల జనాల మాటల తూటాలతో పొడుస్తున్నా.. ఔరా ఎంత అన్యాయం అని ప్రత్యర్దులు సైతం ఆందోళన చెందుతుంటే.. చిరునవ్వుతో జగనన్న నాకు అన్యాయం చేయడు తన తమ్మునివలె నన్ను గుండెలకు హత్తుకుని చెప్పాడు నాకు. సరైన సమయంలో సరైన స్థానంలో కూర్చోపెడతాడు నన్ను.  నాకు నమ్మకం ఉంది. అని జగన్మోహనునిపై  అదే దృఢవిశ్వాసం తో నమ్మకంతో చిరునవ్వుతో చెప్పే ఆయన మాటలు వింటే మెంటల్ ఎక్కిపోతుంది.. గుండె తరుక్కుపోతుంది.. సొంత కుటుంబ సభ్యుని కోల్పోయినా బాధ నంతా గుండె పొరల్లో అదిమిపట్టి తన నియోజకవర్గంలో ప్రజలు కరోనా బారిన పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టిన వైనం.. కరోనా బారిన పడి బాధపడుతున్న కుటుంబ సబ్యులకు నిత్యవసర వస్తువులు అందించి ఆదుకున్న వైనం. నియోజకవర్గంలో సొంత ఖర్చుతో నీటి సరఫరా చేస్తున్న సంగతి.. ఆపదని వచ్చిన వాడికి అడిగిందే తడవుగా ఆపన్న హస్తం అందించిన సందర్భాలు.. సొంత పైకం వెచ్చించి చేసిన ఎన్నో ఎన్నెన్నో పనులు.. ఇవి ఏవీ అధినాయకుణ్ణి చేరలేదా, ఆయన సేవలు గుర్తించలేదా. అని వై.ఎస్.ఆర్. కార్యకర్తలు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.అయినప్పటికీ దవులూరి దొరబాబు ను ఈ విషయాలపై వివరణ కోరగా అయన చెప్పే ఒకే ఒక మాట జగనన్న చెబితే ఓ.. కే..

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...