Followers

ఈ నెల తొమ్మిది న నెల్లికుదురు మండల సర్వసభ్య సమావేశం

 ఈ నెల తొమ్మిది న నెల్లికుదురు మండల సర్వసభ్య సమావేశం

నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల సర్వసభ్య సమావేశం ఈ నెల తొమ్మిది న ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు అధ్యక్షతన జరుగుతుందని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మధ్యాహ్నం ఒంటి గంటకు నెల్లికుదురు రైతు వేదికలో నిర్వహించే మండల సభకు  సంబంధిత ప్రజాప్రతినిధులు,ఆయా శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.

మాస్కు ధరించని వారిపై కేసు నమోదు

 మాస్కు ధరించని వారిపై కేసు నమోదు

రామకృష్ణాపూర్,  పెన్ పవర్

రామకృష్ణాపూర్ పట్టణంలోమాస్కు ధరించకుండా తిరుగుతున్న 8 మంది వ్యక్తులపై రాజీవ్ చౌక్ లో శనివారం ఎస్సై శివ కుమార్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, కోవిడ్ వైరస్ ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై తెలిపారు.

అన్ని రంగాల్లో ఆదిలాబాద్ యువత ముందుకు వెళ్లాలి

 అన్ని రంగాల్లో ఆదిలాబాద్ యువత ముందుకు వెళ్లాలి...

 స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారెంగుల ప్రణయ్


 ఆదిలాబాద్ ,  పెన్ పవర్ 

 అన్ని రంగాల్లో ఆదిలాబాద్ యువత ముందుకు వెళ్లాలని స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారెంగుల ప్రణయ్ అన్నారు. ఆదిలాబాద్ యువత చెయ్ పూర్తి బాధ్యత గా నిర్మించబడ్డ మర్మం అనే వెబ్ సిరీస్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా కారెంగుల ప్రణయ్  మాట్లాడుతూ  కళ ఎదైనా మన కృషి కి  గుర్తింపు దక్కాలి, ఏ పనికైనా కావల్సింది నైపుణ్యం,అది సాధించిన ప్రతీ ఒక్కరూ గెలిచినట్టే లెక్క అని అన్నారు.తమలోని కళ కి పదును పెట్టే ప్రతీ ఒక్కరికీ నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు."మర్మం" టీమ్ అంతటికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, మర్మం టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్..

 నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్..

సునీల్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం కల్పించాలి

 పిసిసి సభ్యులు గూగులోతు దసురు నాయక్...

కేసముద్రం,  పెన్  పవర్

 కేసముద్రం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మూడు రోజుల క్రితం బోడ. సునీల్ అనే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడంలేదని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతూ నిన్న మరణించడం జరిగింది. ఈ సమావేశంలో సునీల్ కు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పీసీసీ సభ్యులు గూగుల్ లోతు దసురు నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ప్రజలను యువకులను మోసం చేసి అధికారంలోకి వచ్చాక నీళ్లు పేరు చెప్పి విధులను లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి  అవినీతికి తెరతీశారు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మాట తప్పి నేను చెప్పిన అని నిరుద్యోగ యువత భవిష్యత్తును అంధకారంలో నెట్టాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ ఉద్యోగస్తులపదవీ విరమణ వయస్సును 58 సంవత్సరముల నుండి 61 సంవత్సరాల కు పెంచి నిరుద్యోగ యువతను నిరాశకు లోను చేశాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు బోడ సునీల్ మరణం ప్రభుత్వ హత్యగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యువత పోరాటం చేసిన విధంగానే ఈ నాటకాల కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్పే వరకూ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసే వరకు మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ ఇచ్చినట్లుగానే యువతకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉంటుంది. నిరుద్యోగ యువతకు ముఖ్యంగా విన్నపము ఏమనగా కెసిఆర్ నియంతృత్వ విధానాలను ఎండగట్టి ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చే వరకు పోరాటం చేద్దాం దయచేసి యువకులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కుటుంబాల లో కడుపు కోత పెట్టొద్దని దండం పెట్టి చెబుతున్నా నియంతృత్వ ప్రభుత్వంపై అందరం కలిసికట్టుగా పోరాడుదాం, బోడ సునీల్ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలని, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తోటవెంకన్న మండల అధ్యక్షులు బీరం గోపాల్ రెడ్డి ఎంపీటీసీలు గంట అశోక్ రెడ్డి . బాలునాయక్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు చిరగని సారయ్య అయూబ్ ఖాన్, సబ్ స్టేషన్ సర్పంచ్ వెంకన్న మైనార్టీ సెల్ రఫీ ఖాన్ గండి శ్రీనివాస్ గోపాల వెంకట రెడ్డి పాల్గొన్నారు.

బంగారు తెలంగాణ లో రేపటి పౌరులు దుస్థితి నేడు

 బంగారు తెలంగాణ లో రేపటి పౌరులు దుస్థితి నేడు ...

బడుల బందుతో పల్లెల్లో బర్రెలు గొర్రెలు కాస్తున్న బాలులు,,,

కేసముద్రం,  పెన్ పవర్

కరొణ వ్యాప్తి చెందుతుదన్న కారణంగా తెలంగాణలో గత కొద్ది రోజులుగా బడును బందుతో పిల్లల చదువులు మళ్లీ అటకెక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో బాల బాలికలు పొలాల వెంట రోడ్ల వెంట తిరుగుతూ బర్రేలు, గొర్లు ,కాస్తున్నారు. మద్యం ప్రియులు పొలాల వెంట మద్యం సేవించి కాలిబాటిల్లు పడవేస్తే వాటిని ఎరుకోని అమ్మి చిరు బండారాలు కొనుక్కొని తింటున్నరు.  ఇలాగే ఉంటే ఉన్న కొద్ది చదువు మర్చిపోయే అవకాశం లేకపోలేదు, ప్రైవేటు విద్యా సంస్థలు( ట్రస్మా) పిల్లల చదువు మా బాధ్యతగా మేము చదువు చెబుతామని అందుకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు తెరిపించాలని వారు ఉద్యమం చేసున్నది విధితమే కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని పిల్లల చదువు గురించి   పుణం పరిశీలించి ఆలోచించాలని పిల్లల చదువు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు, ఆన్లైన్ చదువుల్లో పిల్లల చదువు తక్కువ ,సెల్ ఫోన్లతో గేమ్స్ ఆడడం  ఎక్కువగా, అవుతున్నాయని తద్వారా మంచి జ్ఞానము అందకుండా ,చెడుకు ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, మేధావి వర్గం తెలియజేస్తున్నారు, బర్రెలు కాస్తున్న ఒక బాలుడు కేసముద్రం మండలం లోని ఒక గ్రామంలో పెన్ పవర్ కెమెరాకు చిక్కారు. ఇది చూసి అయినా  బంగారు తెలంగాణ లో రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు మంచి విద్యను అందించాలని అందుకు కృషి చేయాలని తల్లిదండ్రులు మేధావులు ప్రైవేటు విద్యాసంస్థలు వాపోతున్నారు.

కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలు ఒక వరం

 కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలు ఒక వరం...

 ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ 

బేల,  పెన్ పవర్ 

 కెసిఆర్ ప్రభుత్వం అమలుపరుస్తున్న షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి  పథకాలు ఆడపడుచులకు ఒక వరమని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మనోహర్ అన్నారు.మండల  కేంద్రంలోని స్థానిక ఎంపిడిఓ  కార్యాలయంలో శనివారం ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి   కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న గొప్ప కానుక కళ్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఠాక్రె వనిత గంబీర్, ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్యం ప్రమోద్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు వాడ్కర్ తేజ రావు, విపిన్, సుధాకర్ విట్టల్  వరడే, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నారాయణ, గీత, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు  పాల్గొన్నారు.

అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

 అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా...

 ఆదిలాబాద్,  పెన్ పవర్ 

తెలంగాణ రాష్ట్రం లో నిరుద్యోగ సమస్యల పై సునిల్  నాయక్ ఆత్మహత్యకు  కు నిరసనగా శనివారం   బిజెపి, బీజేవైఎం,అన్ని మోర్చా ల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మట్లాడుతూ కెసిఆర్ పాలన వలన, కెసిఆర్ మొండి వైఖరి వల్ల తెలంగాణలో నిరుద్యోగులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభమైందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుందని, చనిపోయిన సునీల్ నాయక్  కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం, అతని ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి పెంచి, పి.ఆర్.సి. ఇవ్వడంతో  ఇవ్వడంతో మొత్తం తెలంగాణ బాగు పడినట్లు భావించవద్దని, మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులకు ప్రభుత్వం నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే అంత వరకు ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులను కోరారు..ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శివ గౌడ్, బిజెపి పట్టణ అధ్యక్షుడు లాలా మున్న,బిజెపి నాయకులు జోగు రవీ,లోక ప్రవీణ్, సమ రవి,ఆకుల ప్రవీణ్, సచిన్,సాయి, దయాకర,ధోని జ్యోతి,దత్తు,తదితురులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...