Followers

ఘనంగా కవి సమ్మేళనం ఆకట్టుకున్న కవుల కవిత్వాలు..

ఘనంగా కవి సమ్మేళనం ఆకట్టుకున్న కవుల కవిత్వాలు.. 

తెలంగాణ ప్రభుత్వ హయాంలో కవులు, కళాకారులకు గుర్తింపు.. 

కవిత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.. అర్థమయ్యేలా చేస్తుంది.. 

 మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి..



మేడ్చల్ , పెన్ పవర్ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ వారికి తగిన గుర్తింపునిస్తూ గౌరవాన్ని కల్పిస్తున్నారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం స్వతంత్ర భారత్ అమృత్ మహోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ కవి సమ్మేళనానికి "స్వాతంత్ర స్ఫూర్తి" ని "ధీమ్" గా నిర్ణయించినట్లు తెలిపారు.75 వ స్వాతంత్ర భారత దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా 75 వారాల పాటు నిర్వహించనున్నట్లు తదనుగుణంగా స్వాతంత్ర  పోరాట ఘట్టాలు గురించి నేటి  తరం యువత, పిల్లలకు అవగాహన కల్పించుటకై  స్వతంత్ర భారత అమృతోత్సవ కమిటీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, ఇందులో భాగంగా శనివారం కవి సమ్మేళనం" నిర్వహించారు.. కవిత్వం అంటే ఉన్నత చదువులు చదివిన వారి నుంచి అక్షరం తెలియని వారికి అర్థమై అందులోని భావుకతను తెలియజేస్తోందని ఎన్నో మాటల ద్వారా చెప్పలేనిది ఒక్క కవిత్వం ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేసే ఘనత కేవలం కవులకే దక్కుతుందని అన్నారు. పండితుడి నుంచి పామరుడి వరకు కవిత్వం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటు ఆచరిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులను ప్రోత్సహించేందుకు కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిందని  దీనివల్ల ప్రతి ఒక్కరికి తమ ప్రతిభను చాటుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 47 మంది కవులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలతో పాటు పారితోషికాలను అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు, , జడ్పీ సీఈవో దేవసహాయం, డీఆర్వో లింగ్యానాయక్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ బల్రామ్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఎ .ఓ .వెంకటేశ్వరులు , సంబంధిత అధికారులు ,జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాలు ప్రకటించిన హామీలు నెరవేర్చాలి

 ప్రభుత్వాలు ప్రకటించిన హామీలు నెరవేర్చాలి

రామగుండం, పెన్ పవర్ 

తెలంగాణ రాష్ట్రంలో దళితులు, పేదల అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని రామగుండం పారిశ్రామిక ప్రాంత మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ ఇరికిళ్ల రాజనర్సు, ప్రధానకార్యదర్శి మాదాసు రామ్మూర్తి, 27 వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రామగుండం తాహాసిల్దార్ రమేష్ కు జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఏప్రిల్ మాసం దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహాత్ములు మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలను కలుపుకొని ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాహుల్ బొజ్జా ఇచ్చిన ప్రకటనను ఈ సందర్భంగా ఖండించారు. మహనీయుల జయంతి ఉత్సవాలకు ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు కల్పించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్వాతంత్ర స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేస్తోందని దీనివల్ల దళితులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానాలను మార్చుకుని ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించడంతో పాటు, ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని యువతకు ఉద్యోగ అవకాశాలు నానాటికి సన్నగిల్లుతున్న తరుణంలో  పారిశ్రామిక రంగంలో ఎదుగుదలకు కుల మతాలకు అతీతంగా అందరికీ వంద శాతం సబ్సిడీతో రుణాలు అందజేయాలని దళితులకు 3 ఎకరాల భూమి అందించడంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగం పెంచి అర్హులైన వారికి అందజేయాలని అన్నారు. స్థానిక  పారిశ్రామిక సంస్థల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవ కమిటీ కోఆర్డినేటర్ వడ్డేపల్లి శంకర్, కో కన్వీనర్ కాంపెళ్లి సతీష్, సలహాదారు కొంకటి లక్ష్మణ్, వైస్ చైర్మన్లు‌ గద్దల శశిభూషణ్, పంజా అశోక్, శనిగరపు హరీష్, రాసపెళ్లి రవికుమార్, రాసూరి నర్సింగరావు, రొడ్డ సంపత్, మిడిదొడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

వధూవరులను ఆశీర్వదించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్

 వధూవరులను ఆశీర్వదించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్

 రంగినేని మనీషా పవన్ రావు దంపతులు...

 బేలా,  పెన్ పవర్  

 ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దౌన గ్రామం లో శనివారం ఆదివాసీ వివాహ వేడుకల్లో ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా  పవన్ రావు ఆదిలాబాద్ మాజీ డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి శుభాకాంక్షలు తెలిపి అనంతరం విందు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  మండల టిఆర్ఎస్ నాయకులు అంబా రావు, మహమ్మద్, గంగా రెడ్డి, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పురస్కార గ్రహీతను అభినందించిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

 కేంద్ర ప్రభుత్వ పురస్కార గ్రహీతను అభినందించిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

పెన్ పవర్,  జగిత్యాల

 జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల మండల పరిషత్ జాతీయ అవార్డ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ అవార్డును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా తీసుకున్న సందర్భంగా కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ,ఎంపీడీఓ  శ్రీనివాస్ ప్రత్యేక అభినందనలు తెలియజేసిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా లోని అన్ని మండలాలు ఆదర్శ మండలలు గా రూపుదిద్దు కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శ్రీనివాస్ , డిప్యూటీ సీఈఓ శ్రీలత రెడ్డి, జిల్లా రైతు బంధు నాయకులు చీటి వెంకట్రావు, ఎంపీఓ నీరజ, కోరుట్ల మండల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కోరుట్ల మండల నాయకులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి

 ప్రతి ఒక్కరు మాస్కులు  ధరించాలి...

 బేల ఎస్ఐ సాయన్న

బేలా,  పెన్ పవర్

 కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కూలు ధరించాలని ఎస్సై సాయన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల  మండలంలోని కొగ్ధుర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలో కరోనా మహమ్మారి పై ర్యాలీ నిర్వహించారు. గ్రామ యువతకు, గ్రామస్తులకు మాస్కుల వాడకం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతు కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ పాటించి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. మాస్కులు తప్పనిసరిగా వాడి, మాస్కులు ధరించడం పోతే చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి జరిమానా విధించబడుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

దొడ్డి కొమురయ్య 94వ జయంతి

 దొడ్డి కొమురయ్య  94వ జయంతి వేడుకలను నిర్వహించిన వైస్ ఎంపీపీ ఆవుల సత్యం

పెన్ పవర్,  గొల్లపల్లి      

 తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య  94వ జయంతి వైస్ ఎంపీపీ ఆవుల సత్యం ఆధ్వర్యంలో గొల్లపెల్లి మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించిన ఉపసర్పంచ్  రాజశేఖర్ కచు కొమురయ్య తిరుపతి శ్రీనివాస్ బుచ్చిరెడి మల్లారెడ్డి సతీస్ భూమయ్య  షేకర్ మల్లేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

బార్లు మద్యం దుకాణాలు, సినిమా హాళ్లతో రాని కరోనా మహనీయుల ఉత్సవాలతోనే వస్తుందా

 బార్లు మద్యం దుకాణాలు, సినిమా హాళ్లతో రాని కరోనా మహనీయుల ఉత్సవాలతోనే వస్తుందా

 పెన్ పవర్, ప్రతినిధి

 జిల్లా కేంద్రంలో ఎం అర్ పి ఎస్ టి ఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ)  జగిత్యాల జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్ మాట్లాడుతూ త్వరలో జరుగబోయే బాబు జగ్జీవన్  రామ్, పూలే, బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి ఆలోచన విధానాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేసే కుట్ర లో భాగమని ఆరోపించారు, రాష్ట్రం లో బార్లు మద్యం దుకాణాలు, సినిమా హాళ్లు తదితర వాటి తో రాని కరోనా కేవలం మహనీయుల ఉత్సవాల తో నే వస్తుందా అని ప్రశ్నించారు, మహనీయుల స్మరణ మా జన్మ హక్కు మాకు జీవితాలను ఇచ్చిన వాళ్ళు మా తల్లి తండ్రులు అయితే మా జీవితాలను నిలబెట్టిన అంబెడ్కర్, జగ్జీవన్ రామ్, సహూ మహరాజ్, కాన్షిర మ్, మాకు మహనీయులు అని అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను  ఉప సంహరించుకొని ఆ మహనీయుల ను స్మరించుకు నేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలి అని  అన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...