Followers

ప్రచారంలో దూసుకు పోతున్న నాగేశ్వరరావు

 ప్రచారంలో దూసుకు పోతున్న నాగేశ్వరరావు 

మోతుగూడెం, పెన్ పవర్

మోతుగూడెం పంచాయతీ అభివృద్ధికై కృషి చేస్తానని అన్ని వేలాల అందరికీ అందుబాటులో ఉంటానని తెలుగు దేశం పార్టీ బలపరిచిన ఎంపిటిసి అభ్యర్థి వేగి నాగేశ్వరరావు(చిన్న) తెలిపారు, ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సోమవారం తెలుగుదేశం పార్టీ గ్రామ కార్యకర్తల ఆధ్వర్యంలో మోతుగూడెం గ్రామంలో బైక్ ర్యాలీని సోమవారం నిర్వహించారు ఈ ర్యాలీ మోతుగూడెం గ్రామ విధులలో సైకిల్ మరియు బైక్ లతో కొనసాగింది, ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మోతుగూడెం పంచాయతీ అభివృద్ధి పథంలో నడవాలి అంటే, అన్ని వేలాల అందరికీ అందుబాటులో ఉండే వక్తి కావాలంటే తెలుగు దేశం పార్టీ బలపరిచిన ఎంపిటిసి అభ్యర్థి వేగి నాగేశ్వరరావు(చిన్న)ను గెలిపించలని అని కోరుతున్నారు, ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు

 బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు.. 

దేశ అభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి..ఎమ్మెల్యే కేపి వివేకానంద్.. 

వివక్షతను జయించిన మహనీయుడు జగ్జీవన్ రామ్.. 

1930లో సత్యాగ్రహంలో పాల్గొని..బ్రిటిష్ వారిని ఎదురించిన స్వాతంత్ర్య సమరయోధుడు.. 

27 ఏండ్ల వయసులోనే శాసనమండలి సభ్యునిగా ఎన్నిక.. 

రక్షణశాఖ..ఆరోగ్య.. రైల్వేశాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం.. 





జీడిమెట్ల, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని శివాలయ నగర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధునిగా, దూరదృష్టి గల నాయకునిగా బాబు జగ్జీవన్ రామ్ దేశ సేవలో తరించారని కొనియాడారు.. రాజకీయ మేధావిగా దేశ అభివృద్ధికి ఆయన అందించిన సహకారం మరువలేనిదని గుర్తు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ నిజమైన ప్రజాస్వామ్యవాది అని, సమాజంలోని పేద, అణగారిన, బలహీన వర్గాల అభివృద్ధికి వారు ఎంతో కృషి చేశారన్నారు. 35 సంవత్సరాలకే కేబినెట్ మంత్రిగా దేశానికి సేవలందించి, సంస్కరణల అమలులో తనదైన ముద్రను బాబు జగ్జీవన్ రామ్ చూపారన్నారు. దేశంలో హరిత విప్లవం అమలు చేయటంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో  మన్నె రాజు, సోమేష్ యాదవ్, వెంకట స్వామి, దళిత సంఘాల ఐక్య వేదిక సభ్యులు ఏసు రత్నం, లక్ష్మణ్, జేమ్స్, బుచ్చన్న, అశోక్, భాస్కర్, సాయి బాబా, సత్యనారయణ, సత్తయ్య, ఎల్లయ్య, ప్రశాంత్, బాలయ్య, శంకర్, డేవిడ్, భిక్షపతి, జానయ్య తదితరులు పాల్గొన్నారు..

బాబు జగ్జీవన్ 113వ జయంతికి ఘన నివాళులు.. మందా వెంకటేశ్వర్లు

 బాబు జగ్జీవన్ 114వ జయంతికి ఘన నివాళులు.. మందా వెంకటేశ్వర్లు..

సత్తుపల్లి, పెన్ పవర్ 

ఒకదశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం, అలుపెరగని సమరం సాగించిన రాజ కీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు కొనియాడారు.. బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగ్జీవన్‌ బిహార్‌లోని షాబాద్‌ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్‌ 5న శోభిరామ్, బసంతి దేవిలకు జన్మించారు. ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరాని‌ తనాన్ని అనుభవించారని  పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారని అయితే జగ్జీవన్‌ రామ్‌ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదని తెలిపారు. ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కముక్కలు చేశారు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశారు. జగ్జీవన్‌ రామ్‌ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్‌ రామ్‌ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిందని ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతి వైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయని అన్నారు. జగ్జీవన్‌ రామ్‌ జీవిత కాలంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు. అంతటి కష్టకాలంలో కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లిందన్నారు. 52 ఏళ్లపాటు పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం. విద్యార్థి దశలోనే గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షితుడు అయి 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్‌ పోలీసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డా నాటి స్వాతంత్య్ర సమరయోధుడు జగ్జీవన్ రామ్ అని తెలియజేశారు. వివక్షను ఎదుర్కొంటూ ఉపప్రధాని స్థాయికి రావడం జగ్జీవన్‌రామ్‌ అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన 1986 జూలై 6న పరమపదించారని. దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్ననిజమైన దేశ నాయకుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ డివిజన్ కార్యదర్శి తడికమళ్ళ యోబు, కొత్తపల్లి కుమార్, జీవన్, గిరి, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తాళ్లపూడి, పెన్ పవర్

సోమవారం డాక్టర్  బాబు జగజ్జీవన్ రామ్ 114 జయంతి సందర్భంగా పెద్దేవం గ్రామంలోని ప్రెసిడెంట్ తిగిరిపల్లి వెంకటరావు,  ఎంపీటీసీ అభ్యర్థి జొన్నకూటి పోసిరాజు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ  విచ్చేసి బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, జగజ్జీవన్ రామ్ యూత్ సభ్యులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

కపిలేశ్వరపురం లో జయంతి వేడుకలు...

కపిలేశ్వరపురం లో జయంతి వేడుకలు...

పెన్ పవర్, ఆలమూరు

  పేద వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయులు బాబూ జగజ్జివన్ రామ్ యువత కు స్ఫూర్తి ప్రదాత గా వైఎస్సార్ సిపి యువ నేత తోట పృథ్వి రాజ్ పేర్కొన్నారు. కపిలేశ్వరపురం లో సోమవారం జరిగిన జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ జగజ్జివన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ కన్వీనర్, కపిలేశ్వరపురం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వైసిపి ఇన్ ఛార్జ్ సయ్యద్ రబ్బానీ వైఎస్సార్సీపీ  నాయకులు చల్లా దుర్గా ప్రసాద్, షేక్ అన్సార్ అలీ, మల్లిపూడి శివ కుమార్, కట్టా మురళి, చింత  పెద్దకాపు, కందుల శీను, ఎం పి టి సి అభ్యర్థులు గొల్లపల్లి సోనియా, శీలం భాస్కరరావు,గుత్తులశివ,శ్రీదేవి, పిప్పర  సంపత్ రావు,  అంగాని నూక  రాజు, బంటుమిల్లి సాయి కుమార్,  కోరిపల్లి శీను, కుడుపూడి విజయ్ చౌదరి,బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పెద్దేవంలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

 పెద్దేవంలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తాళ్లపూడి, పెన్ పవర్

సోమవారం డాక్టర్  బాబు జగజ్జీవన్ రామ్ 114 జయంతి సందర్భంగా పెద్దేవం గ్రామంలోని ప్రెసిడెంట్ తిగిరిపల్లి వెంకటరావు,  ఎంపీటీసీ అభ్యర్థి జొన్నకూటి పోసిరాజు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ  విచ్చేసి బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, జగజ్జీవన్ రామ్ యూత్ సభ్యులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

 ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

మోతుగూడెం,పెన్ పవర్

చింతూరు మండలం మోతుగూడెంలో ఎపి జెన్కో ఎస్సీ ఎస్టీ వెల్పెర్ అసోసియేషన్ కార్యాలయం నందు సోమవారం ఉదయం బాబు జగ్జీవన్ రామ్ 113 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినా ఎపి జెన్కో సీలేరు కాప్లెంక్స్ చిప్ ఇంజనీరింగ్ గౌరిపతి ముందుగా జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల,పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అలాగే ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఇప్పటి తరం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడిఇ వెంకటరత్నం, వేమగిరి కిరణ్, శైలజ మరియు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...