Followers

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్

 అత్యవసర సమయంలో రక్తదానం చేసిన స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్...

ఆదిలాబాద్ ,  పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామానికి చెందినలో నిరుపేద  కెర్భ అనే ఆదివాసి రైతు  గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత కొన్ని రోజుల నుంచి రిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చికిత్సలు చేయించుకుంటున్న అతనికి శరీరంలో ఉన్న రక్తం మూడు గ్రాములకు పడిపోవడం తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వ్యక్తికి ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా,ఈ విషయం  స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారింగుల ప్రణయ్ దృష్టికి రావడంతో సత్వరమే మానవత్వం తో ముందుకు వచ్చి సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక రిమ్స్ లో అత్యవసర సమయంలో ఓ పాజిటివ్ రక్తం దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో రక్తహీనత ఉన్న వ్యక్తులకు రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని, రక్త హీనతతో బాధపడుతున్న వారికి యువకులు ముందుకు వచ్చి రక్త దానం చేస్తే వారి కుటుంబాలను కాపాడినట్లు అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ రక్తదానంతో కలిపి ఇప్పటివరకు  20వ సారీ రక్తదానం చేయడం అందులో ఆదివాసీ రైతుకు రక్తదానం చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆదివాసులకు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇంకా ఎవరికైనా ఆదివాసులకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తమ దృష్టికి తీసుకువస్తే తన వంతు సహాయం చేస్తానని హామీ పేర్కొన్నారు. అనంతరం  రక్తదానం చేసిన వెంటనే రోగి  కి డాక్టర్లు రక్తం ఎక్కించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రిమ్స్ డాక్టర్లు పేర్కొన్నారు. రోగి ఆరోగ్యం మెరుగుపడటంతో వారి కుటుంబీకులు స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారింగుల ప్రణయ్ ను నువ్వు మా ఆదివాసి బిడ్డ అని, ఆ దేవుడు మా కష్టాలు తీర్చడానికి పుట్టినట్టు ఉందని, మా కష్టాన్ని తెలుసుకొని మా కుటుంబాన్ని కాపాడిన దేవుడు అని అతనిని సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ సింగ్, పోతివాల్ లోకండే, అనిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జనజీవన్ రామ్

 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జనజీవన్ రామ్

విజయనగరం,పెన్ పవర్

దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా కార్యాలయ ఆవరణలో 114వ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. చిట్టిబాబు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. అప్పటికే దేశ ప్రధాని కావడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న కారణంగా కుల వివక్షత కారణంగా దేశ ప్రధాని కాలేకపోవడం చాలా విచారకరమని తెలిపారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని భారత దేశంలో అమలు చేయడంలో కృషి సల్పారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి గా,రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రి గా పని చేసి ఎనలేని కృషి చేశారన్నారు.

 విధులకు బీమా పథకాన్ని పెంచడంలో, భూ పంపిణీ పథకాన్ని అమలు చేయడంలో కేంద్ర మంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి అభినoదనీయం అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న మాజీ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ అలమంద జోజప్ప మాట్లాడుతు రిజర్వేషన్ పరిరక్షణ ద్వారా, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షణ ద్వారా ఆయన అశయాలును సాధించిన వారౌతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు,దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా కార్యదర్శి రాయి ఈశ్వరరావు, కె వరలక్ష్మి మరియు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు విడనాడాలి

 కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు విడనాడాలి

విజయనగరం,పెన్ పవర్

 కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు విడనాడి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ చేయించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మరోసారి స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని 5 ప్రాంతాలలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించారు. ఇస్మాయిల్ కాలనీ, మజ్జి పేట,ఓం మందిరం,  కొత్తపేట గొల్లవీధి,ఉల్లివీధి లోని ఆర్యవైశ్య భవన్  ప్రాంతాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న తీరును కమిషనర్ వర్మ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అక్కడున్న సిబ్బందికి ఆదేశించారు.వేక్షినేషన్ వేసిన అనంతరం అరగంట సేపు వేచి ఉండే ప్రదేశంలో తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

          సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. వ్యాక్సినేషన్ అయిన తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవడం వంటి ప్రక్రియలు చేపట్టాలన్నారు.కరోనా రెండోదశ వ్యాప్తి లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉంటున్నారని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మొదటి డోసు వ్యాక్సినేషన్ అయిన తర్వాత 28 రోజులకు మరలా వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. వేక్షినేషన్ అయిన తర్వాత కూడా ఏమరపాటు గా ఉండకూడదని చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనా దరిచేరకుండా జాగ్రత్త వహించాలన్నారు.

కరోనా రహిత నగరంగా తీర్చిదిద్దాలి

కరోనా రహిత నగరంగా తీర్చిదిద్దాలి

విజయనగరం,పెన్ పవర్

కరోనా రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఆబాద్ వీధిలోని 14 వ నెంబర్ సచివాలయంలో  వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజలలో మరింత చైతన్యం తీసుకువచ్చేందుకు, ప్రజలలో అపోహలు తొలగించేందుకు ఆమె కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. 

ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కరోనా రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. స్వీయ రక్షణ చర్యలు పాఠిస్తూనే, భౌతిక దూరం అలవర్చుకోవడం, మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతుల పరిశుభ్ర పరుచుకోవడం అలవాటుగా చేసుకోవాలన్నారు.కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్యులు పాల్గొన్నారు.

జగ్జీవన్ రామ్ కు ఎమ్మార్పీఎస్ ఘన నివాళులు

 జగ్జీవన్ రామ్ కు ఎమ్మార్పీఎస్ ఘన నివాళులు.. 

దుండిగల్, పెన్ పవర్ 

అణగారిన వర్గాల హక్కుల కోసం, అలుపెరగని సమరం సాగించిన సామాజిక విప్లవయోదుడు బాబు జగ్జీవన్ రామ్ కు ఎమ్మార్పీఎస్ మరియు దళిత సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో సూరారం కాలనీ చివరి బస్ స్టాప్ లో మహనీయుని జయంతి వేడుకలో భాగంగా భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 114 వ జయంతి వేడుకలు జరుపుకున్నారు.. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఇకనైనా వారి సేవలు గుర్తించి భారతరత్నతో వారిని గౌరవించాలని డిమాండ్ చేశారు..స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే సామాజిక సమానత్వం కోసం కృషిచేశారని కొనియాడారు.. తను చదువుకున్న పాఠశాలలోనే అంటరాని తనాన్ని చవిచూశారని దళిత నాయకులు పేర్కొన్నారు..జగ్జీవన్ రామ్ దీక్ష,పట్టుదల, క్రమశిక్షణతో ఉండేవారని వారు తెలిపారు..  ఎమ్మార్పీఎస్ నాయకులు  సిలివేరు శ్రీనివాస్ మాదిగ, రాచమల్ల యాదగిరి మాదిగ, సీనియర్ దళిత నాయకులు అవి జై జేమ్స్,దొంతుల బిక్షపతి మరియు కళాకారులు కరాటే శంకర్, ఈశ్వరం రమేష్, సంగి మహేష్ మాదిగ, మట్టా నర్సింలు, ఏడుకొండలు, నారాయణ, జిహెచ్ఎంసి రాజేష్ తదితరులు పాల్గొన్నారు..

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలు

 ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలు...

నార్నూర్, పెన్ పవర్

 అణగారిన వర్గాలకు అభ్యుదయ నికి కృషి చేసిన భరత్ రత్న, భారతదేశ మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలను సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో  ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి స్థానిక సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, గ్రామ పంచాయతీ సిబ్బంది  పూలమాల వేసి నివాళలు అర్పించరు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ పరమేశ్వర్, ఆడే సురేష్, నర్సింగ్ మోరే, అయమద్, వసంత్ ఆడే, చవాన్ హరిచంద్, ఫెరోజ్ ఖాన్, దిగంబర్, దేవికబాయి, నాయకులు పాల్గొన్నారు.


నగరాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాం.... నగర మేయర్

నగరాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాం.... నగర మేయర్ 
విజయనగరం,పెన్ పవర్

విజయనగరం కార్పొరేషన్ ని పాలకవర్గం అంతా ఉమ్మడి గా ఎమ్మెల్యే కోలగట్ల సూచనల మేరకు అభివృద్ధి వైపు నడిపిస్తామని విజయనగరం కార్పొరేషన్ మేయర్ శ్రీమతి వెంపడాపు విజయలక్ష్మి అన్నారు, విజయనగరం జిల్లా పౌరవేధిక ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన  కార్పొరేషన్   నూతన కార్యవర్గ సత్కారసభలో ఆమె పాల్గొన్నారు ముందుగా బాబూ జగజీవన్ రామ్ 113 వ జయంతి సందర్భంగా జగజీవన్ రామ్ చిత్ర పటానికి మాల వేసి జ్యోతి వెలిగించిన అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీ లు,మున్సిపాలిటీ లు కార్పొరేషన్ల అభివృద్ధి కి ఇప్పటికే అనేక సూచనలు చేశారని ప్రభుత్వం కూడా అభివృద్ధి కోసం ఆడిగినన్ని నిధులు మంజూరు చేయాలని చూస్తుందని,ప్రజలకు తమ పాలక వర్గ నిత్యం  అందుబాటులో ఉంటున్నదనే మంచి పేరు తెచ్చుకుంటుందని మేయర్ విజయలక్ష్మి అన్నారు, డిప్యూటీ మేయర్ శ్రీమతి ముచ్చు నాగలక్ష్మి మాట్లాడుతు ప్రతివార్డులో ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకుని ఎమ్మెల్యే కోలగట్ల తో చర్చించి సత్వర చర్యలు చేపడతామని ముఖ్యంగా మహిళా సమస్యలపై దృష్టి పెడతామని అన్నారు.

 జిల్లా పౌరవేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి మాట్లాడుతు పట్టణంలో ప్రతి ప్రధాన వీధికి చరిత్రకారుల పేరులు ఉండాలని, నగరంలో కి ప్రవేశించే మూడు ప్రాంతాల్లో నగరం గొప్పతనం తెలిపే సింహ ద్వారాలు ఏర్పాటు చేయాలని, మేయర్ కార్పొరేటర్లు నగరాన్ని అందంగా తీర్చి దిద్దాలని,తొలి కార్పొరేషన్ పాలకులుగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు, నగర స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ శెట్టి వీర వెంకట రాజేష్ మాట్లాడుతూ కార్పొరేటర్లు భవిష్యత్తు లో ఎలా పనిచేసి ఎమ్మెల్యే కి ప్రభుత్వం కి మంచిపేరు తేవాలో అందరికీ వివరించారు,పార్టీ సీనియర్ నాయకుడు అపనా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రులు, పాఠశాలలు అభివృద్ధి పై ప్రతిఒక్కరు పనిచేస్తే ప్రజలకు మంచి సేవలు అందుతాయని అన్నారు,ఛతిష్ ఘడ్ ఎన్కౌంటర్ లో మరణించిన విజయనగరం వాసి రౌతు జగదీష్ తోపాటుగా మరణించిన జవాన్లు ఆత్మకు శాంతి కలగాలని సభ మౌనం పాటించింది,అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ లను పౌరవేధిక ప్రతినిధులు ఘనంగా సత్కరించారు,వేదిక ప్రతినిధులు ఎన్.వి.ఎన్.బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు నాగేశ్వరరావు, ఇప్పలవలస గోపీ,గెద్ద చిరంజీవి,మమ్ముల తిరుపతి రావు, బసవ మూర్తి,సీనియర్ జర్నలిస్టు శివాజీ, నాగభూషణం, రాజారావు,నాయుడు,కోరుకొండ బుజ్,పొలుపర్తి అప్పారావు,రఘు రాం, జామి ఎర్ని బాబు,తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...