Followers

వర్షపాత కేంద్రం పరిశీలన

వర్షపాత కేంద్రం పరిశీలన

తాళ్లపూడి, పెన్ పవర్

 మంగళవారం విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా అభివృద్ధి సంస్థ నుండి ఆటోమేటిక్ వాతావరణ కేంద్రంలో తాడిపూడి లిఫ్ట్ స్టేషన్ పై నదీ  వర్షపాత కేంద్రమును మరియు తాళ్లపూడి/ప్రక్కిలంక సబ్ స్టేషన్ నందు వర్షపాత కేంద్రమును పరిశీలించుటకు మరియు బాగు చేయుటకు  మెయింటినెన్సు ఇంజినీర్ బ్రహ్మసాయిరెడ్డి వచ్చారు. వారితో  ఉన్న ఏయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం వేసవిలో ఈ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రంలను పరిశీలించి, ఏవైనా మరమ్మత్తులు ఉంటే చేయుటకు ఒక ఇంజనీర్ వస్తుంటారని తెలియజేశారు. తాడిపూడి లిఫ్ట్ పై ఉన్న నదీ వర్షపాత మాపని వైరు తెగి పోయినదని, రెండు రోజులలో  వారు వేస్తారని తెలియజేశారు. సబ్ స్టేషన్లో స్టేషన్ బాగుగానే ఉందని, మరమ్మత్తులు ఏమీ అవసరం లేదని  తెలియజేశారు.

శ్రీ జగన్మోహిని కేశవ స్వామి మాస కళ్యాణ మహోత్సవం

 శ్రీ జగన్మోహిని కేశవ స్వామి మాస కళ్యాణ మహోత్సవం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ర్యాలి  గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి గోపాలస్వామి వారి దేవస్థానం నందు శ్రావణ నక్షత్ర మాస కళ్యాణం మంగళవారం అత్యంత వైభవంగా కల్యాణం జరిగినది తదుపరి మాస కళ్యాణం 5.5.2021 జరుగును ఈ కళ్యాణ మహోత్సవములు భక్తులు పాల్గొంటే వివాహం అవని వారికి సంతానం లేని వారికి విద్య ఉద్యోగం బదిలీ విదేశీ యానం ఆరోగ్య వ్యాపార మొదలగు కోరుకున్న కోరికలు తీర్చే స్వామి ఈ కళ్యాణ మహోత్సవం నేరుగా పాల్గొనలేని భక్తులకు 08855250477-250231 ద్వారా సంప్రదించిన వారికి కల్యాణ ప్రసాదాలు పోస్టు ద్వారా పంప పడతాయనిఆలయ ఈవో కృష్ణ చైతన్య తెలిపారు  ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులు ఆలయ సిబ్బంది గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

కోవిడ్-19 నిబంధనలు అనుసరించి శ్రీ నూకాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఏర్పాట్లు జరగాలి

 కోవిడ్-19 నిబంధనలు అనుసరించి శ్రీ నూకాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఏర్పాట్లు జరగాలి

పెద్దాపురం, పెన్ పవర్ 

 పెద్దాపురం మండలంలోని కాండ్రకోట గ్రామంలో 45 రోజుల పాటు  జరగనున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం కోవిడ్-19 నిబంధనలు అనుసరించి ఏర్పాట్లు చేయాలని సమీక్ష సమావేశం  నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ ఎస్. మల్లి బాబు మాట్లాడుతూ కరోనా మహమ్మారి పెరుగుతున్న కారణంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి వేలాది సంఖ్యలో విచ్చేయునున్న ప్రజాలందరుకు తగిన ఏర్పాట్లు చేయాలని పలు శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి పారిశుధ్యం, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని,తాత్కాలిక టాయిలెట్స్, డ్రమ్ములు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని పంచాయితీ కార్యదర్శికు తెలియజేసారు.వైద్య ఆరోగ్య శాఖ కు సంబంధించి ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని,108 సర్వీస్ అందుబాటులో ఉంచాలని డి యమ్ అండ్ హెచ్ ఓ ను కోరారు. నీటిపారుదల శాఖ కు సంబంధించి జాతర మహోత్సవం ను తిలకించుటకు వచ్చేభక్తులుఏలేరుకాలువలోస్నానాదులుకావించేందుకు,నీటిఉధృత తగ్గించాలని, అదేవిధంగా స్నానాలరేవు నిర్మాణం చేపట్టవసిందిగా కోరారు. వేసవికాలంలో ఎటువంటి విద్యుత్తు అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ట్రికల్ ఏ.ఈకు సూచించారు.

అగ్నిమాపక శాఖకు సంబంధించి ముందస్తు చర్యలలో భాగంగా ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా దేవాదాయశాఖ ఏ.డిను కోవిడ్-19 నిబంధనలు అనుగుణంగా భక్తులందరూ సామాజిక దూరం, శానిటేషన్, మాస్కులు ధరించి త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంతరాలు లేకుండా చేయాలని, జాతర మహోత్సవం ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరారు.అడిషనల్ డి.యమ్ అండ్ హెచ్.ఓ డా. సరిత మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ అమ్మ వారి జాతర మహోత్సవంలో కోవిడ్ నియంత్రణ కు ప్రజలందరూ మాస్కులు, సామాజిక దూరం, శానిటేషన్ చేయాలని, వేసవికాలంలో ఎండల తివ్రత ఎక్కువ ఉన్నందున పిల్లలు కు మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఆలయ ప్రాంగణంలో  భక్తులకు అర్ధమయ్యే విధంగా కోవిడ్-19 గురించి ఆరోగ్య సూత్రాలు, పాంఫ్లెట్స్ లో కరోనా గురించి చిత్ర పాటలతో అవగాహన కలిగేవిధంగా తెలియజేయాలని కోరారు.ఈ సమావేశంలో సర్పంచ్ ఎం. శ్రీనివాస్, వైస్ సర్పంచ్ జె.పద్మనాభం, దేవస్థానం ఈవో భవాని ఎలక్ట్రికల్ ఏ.ఈ ఎస్. ఈశ్వరప్రసాద్, ఇరిగేషన్ ఏ. ఈ.ఈ పి. వీరబాబు, మెడికల్ పి హెచ్ సి లు సి.హెచ్ ఎం. ధనలక్ష్మి, ఏ. అనూష, పంచాయతీ కార్యదర్శి వి. రాజంబాబు, వీఆర్వో లు తదితరులు పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా పోరాడుదాం...

గెలుపే లక్ష్యంగా పోరాడుదాం...

పెన్ పవర్, ఆలమూరు 

ఆలమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు అన్నీ స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకు  వెళతామని పెనికేరు తెలుగుదేశంపార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని యనమదల స్వాతి తెలియజేశారు. మండల పరిధి కలవచర్ల, పెనికేరు గ్రామాల్లో ఆమె తన భర్త శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టిగా మండలంలోని అందరు అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనా శ్రీను (దత్తుడు),కుడిపూడి వెంకట్రావు (కొండ) పలువురు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

జెడ్పీటీసి, ఎంపిటిసి ఎన్నికలలో వైసీపీకి ఘన విజయం అందజేయాలి

జెడ్పీటీసి, ఎంపిటిసి ఎన్నికలలో వైసీపీకి ఘన విజయం  అందజేయాలి

పెన్ పవర్, ఆలమూరు 

ఈ నెల 8వ తేదీన జరిగే జెడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటును వేసి ఘన విజయం అందజేయాలని ఆలమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలో 18 గ్రామాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలుతో పాటు పలు సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో విజయఢంకా మోగించి ముఖ్యమంత్రి పాలనకు మరింత బలాన్ని అందజేయాలన్నారు. వైసిపి ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహంతో ఉన్నారని అన్నారు. మండలంలో మడికి గ్రామం నుండి జెడ్పిటిసి అభ్యర్థిని తోరాటి సీతామహాలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మడికి, చెముడులంక, గాంధీనగరం, బడుగువానిలంక, చొప్పెల్ల, జొన్నాడ, మూలస్థానం అగ్రహారం, ఆలమూరు   గ్రామాల్లో ఆయా ఎంపిటిసి అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు.  ఈ కార్యక్రమంలో తోరాటి లక్ష్మణరావు, యనమదల నాగేశ్వర్రావు, దియ్యన పెద్దకాపు, పడమటి రాంబాబు, అడబాల వీర్రాజు, తోరాటి రాంబాబు, అడ్డాల సత్యనారాయణరాజు   వివిధ గ్రామాల సర్పంచులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ శ్రేణులు  పాల్గొన్నారు.

రూట్ మరియు జోనల్ అధికారులు పోలింగ్ బూత్ లు పరిశీలన

రూట్ మరియు జోనల్ అధికారులు పోలింగ్ బూత్ లు పరిశీలన

తాళ్లపూడి, పెన్ పవర్

 సోమవారం ఎన్నికల ఆర్డర్ ప్రకారం రూట్ అధికారి జోడాల వెంకటేశ్వరరావు, జోనల్ అధికారి జి.రుచిత ఇద్దరు కలిసి వాళ్ళ  జోన్లలోని అనగా తాడిపూడి, పోచవరం, అన్నదేవరపేట, గజ్జరం, పైడిమెట్ట, ప్రక్కిలంక గ్రామాల్లో తిరిగి ఆయా పోలింగ్ బూత్ లలో కనీస సౌకర్యాలు మరియు పోలింగ్ కేంద్రాల నంబర్లు అన్నీ ఉన్నాయో, లేదో అని పరిశీలన చేశారు. వీరితో పాటు ఆయా పంచాయతీల సెక్రటరీలు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

రాపాక బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రాపాక బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామం లో దళిత జన ఆశాజ్యోతి దివంగత భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జీవన్ యూత్ ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాపాక  బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ యొక్క కీర్తిని కొనియాడారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని, ఇలాంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని యువత విధ్యా రంగంలో అభివృద్ధి చెంది దళితుల యొక్క అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. అదే విధంగా స్టూడెంట్స్ తరపున గడ్డం వినోద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ట్యూషన్ పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, పరీక్ష అట్టలు, సర్పంచ్ రాపాక రాజేశ్వరి, ఉప సర్పంచ్ మద్దిపాటి రామారావు  అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మద్దిపాటి ప్రకాష్ రావు, మద్దుకూరి విష్ణు రావు, మద్దుకూరి శ్రీనివాస్, యూత్ తరపున పరిటాల సతీష్, గడ్డం జగజ్జీవన్ రావు, రాజ్ కుమార్, సురేష్ పాల్గొనడం జరిగింది .

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...