Followers

ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం

 ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం

మహారాణి పేట, పెన్ పవర్

5వ రోజు దీక్షా శిబిరంలో అజశర్మ పిలుపు యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజా పోరాటాల ద్వారానే కాపాడుకోవాలని, అందుకు ప్రజలు సిద్ధం కావాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ. అజశర్మ 5వ రోజు నిరాహారదీక్ష లో కూర్చున్న వారికి పూలదండలు వేసి  పిలుపునిచ్చారు.దీక్షలో కూర్చున్న వారిలో సీబబీయూ నాయకలు పీతల అప్పారావు, అనపర్తి అప్పారావు, కె.కుమారి, పి. చెంకటరావు బేగం, పోతురాజు, ఎఐటీయూసీ నాయకులు వామనమూర్తి, చి.వెంకటేశ్వరరావు, బద్వా మౌనిక, యస్,. యఫ్.ఐ రాఘవేంద్రరావు తదితరులు దీక్షలో కూర్చొన్నారు.అజశర్మ మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం బరితెగించి ప్రభుత్వ రంగాన్ని అమ్ముతామని చెప్పడం సిగ్గుచేటన్నారు ఎన్నికల్లో ధరలు తగ్గిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో 15లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచాడు తప్పా ప్రభుత్వ పరిశ్రమలు అమ్ముతామని, ధరలు పెంచుతామని చెప్పలేదు. ఆ రకంగా చెప్పి ఉంటే ప్రధాని గా మోడీ ఉండేవారు కాదని అన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాఖనగరం ఆర్థిక రాజధాని గా మంచి పేరు ఉందంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటమే ఆది సాధ్యమైందన్నారు. నగరంలో అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి దొరుకుతుందంటే స్టీల్ ప్లాంట్ పరిశ్రమలు ఉన్నాయికాబట్టేనని తెలిపారు. లాభాల్లో వుండే పరిశ్రమలను, ప్రజల ఆస్టులు అమ్మితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రైతులు, కార్మికులు కలిసి పోరాడితే బిజెపికి పుట్టగతులు వుండవన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ఈ దీక్షలో సీఐటీయూ నగర అధ్యక్షులు ఆర్.కె.యస్ హీర్, ఏఐబీయూసీ జిల్లా అధ్యక్షులు పదాల రమణ, బద్వా కార్యదర్శి డా. జి.ప్రియాంక, యస్.యఫ్. ఐ కార్యదర్శి యల్.కె.నాయుడు, పిడియస్ఓ అధ్యక్షులు సురేష్, డివైయఫ్ ఐ కార్యదర్శి యు.యస్.యన్.రాజు, ఏఐటీయూసీ రెహమాన్, మన్మధరావు, సీఐటీయూ నగర కార్యదర్శి బి.జగన్, ప్రజానాట్యమండలి చంటి తదితరులు పాల్గొన్నారు.

అమ్మాపురం గ్రామములో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

 అమ్మాపురం గ్రామములో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

తొర్రూరు సిఐ కరుణాకర్ రావు

తొర్రూరు,  పెన్ పవర్

తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ గూడెల్లి సైదులు గారి తల్లిదండ్రులైనా గూడెల్లి రాములు లక్ష్మి జ్ఞాపకార్థంతో, స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం తొర్రూరు సిఐ కరుణాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... వేసవి కాలంలో గ్రామ ప్రజలకు దాహం తీర్చేందుకు, చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అన్నారు. ఈ యొక్క చలివేంద్రాన్ని గ్రామస్తులు ప్రతి ఒక్కరూ  సద్వినియోగం చేసుకోవాలని, కోరారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ కడెం యాకయ్య,ఉపసర్పంచ్ ముద్దం వీరారెడ్డి,ఎంపీటీసీ 1 (ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు) డోనుక ఉప్పలయ్య,ఎంపీటీసీ 2 (ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి) ముద్దం విక్రమ్ రెడ్డి, వార్డ్ మెంబర్ గద్ధల శ్రీకాంత్, తమ్మెర వీరభద్రరావు, తమ్మెర విశ్వేశ్వరరావు, ముద్దం మైబూ రెడ్డి, షాట్ అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి, మిమిక్రీ గట్టు నవీన్ కుమార్, తీగల ఉపేందర్ రెడ్డి, డోనుక సైదులు,డోనుక ఐలయ్య,యాకయ్య, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

 ఘనంగా  భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

దేశంలో  ఇంటింటికి నరేంద్ర మోడీ అభివృద్ధి ఫలాలు

కొత్తగూడ , పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడ  మండల  కేంద్రంలో జెండా ఆవిష్కరణ కొత్తగూడ   మండల ప్రధాన కార్యదర్శి ఆవిష్కరించడం జరిగినది,  ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ పార్టీ ఆ విర్భావం నుంచి ఇప్పటివరకు జాతీయవాద సిద్ధాంతాన్ని ఏకాత్మక మానవతా సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తూ పార్టీ శ్రేయస్సుకు పార్టీ  నిరంతరం కష్టపడుతూ ప్రతి కార్యకర్త మొక్కవోని విశ్వాసంతో ముందుకు వెళ్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి ఫలాలను ప్రతి చిట్టచివరి వ్యక్తికి అందించే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందున్నదని చెప్పవచ్చు ఈరోజు నరేంద్రమోడీ  ప్రభుత్వం ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ  ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పవచ్చు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి మురళి బిజెపి, రాష్ట్ర వన బంధు కన్వీనర్ బోడ నవీన్ నాయక్, జిల్లా కార్యదర్శి భూపతి, తిరుపతి కొత్తగూడ బూత్ అధ్యక్షులు బిక్షపతి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి వజ్జ రవి, కోశాధికారి ఈసంనరేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు కొట్టి శ్రీనివాస్, మంజుల పల్లి అరవింద్, చీర బోయిన యాకయ్య, కల్తీ సతీష్, తోటకూరి మధు తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై శిక్షణా తరగతులుఆర్ డి ఓ లక్ష్మారెడ్డి

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై శిక్షణా తరగతులుఆర్ డి ఓ లక్ష్మారెడ్డి

పెన్ పవర్, కొవ్వూరు

కొవ్వూరు డివిజన్ యం.పిటిసి, జెడ్.పి.టిసి ఎన్నికలకు సంభందించి  ఓట్ల లెక్కింపు ప్రక్రియ కు తణుకు ఆకుల శ్రీరాముల ఇంజనీరింగ్ కాలే జీలో ఏర్పాటు చేస్తున్నట్లు కొవ్వూరు రెవెన్యూ డివిజన ల్ అధికారి డి. లక్ష్మారెడ్డి అన్నారు. మంగళ వారం యువరాజ్ ఫంక్షన్ హాలు లో కొవ్వూరు డివి జన్ పరిధిలో 306 ఎ న్నికల  ఓట్ల లెక్కింపు సూపర్ వైజర్ లకు ఓట్ల లెక్కింపు ప్ర క్రియ పై శిక్షణా తరగతులు నిర్వహణ కార్యక్రమం లో ఆర్డీవో పాల్గొ న్నారు.  ఈ సందర్భంగా లక్ష్మా రెడ్డి మాట్లా డుతూ  ఓట్ల లెక్కిం పు కేంద్రము లో ఎన్ని కలు నిభందలన మేరకు పగడ్బంది ఏర్పాట్లు చే సే విధంగా చర్య లు తీసుకుంటున్నామని అన్నా రు.  ఈ కేంద్రాల్లో మౌళిక సదు పాయాలు కల్పిన్చే విధంగా  చ ర్యలు తీసుకుంటున్నామని   అన్నారు.  డివిజన్ పరిధిలో మొత్తం 1847 మంది పి. ఓ లు, ఏపీ ఓ లను ఏర్పాటు చేశా మని అన్నారు.2213 మంది ఓ.పి. ఓ లను నియమించామ నీ అన్నారు.

 ముందుగా కౌంటిం గ్ ప్రారంభం లో భాగంగా బ్యా లెట్ బాక్స్ లో గల మొత్తం ఓట్ల సంఖ్య ను లెక్కించి సరి చూచి న తరువాత 25 బ్యాలెట్స్ ల ను కట్టలుగా కట్టి వేరుగా యం.పిటిసి, జెడ్.పి.టిసి బ్యాలెట్ లను వేరు వేరు చేస్తారన్నారు. యంపిటిసి, జెడ్.పి.టిసి ఎన్ని కల కు టేబుల్స్ కు వెయ్యి చొ ప్పున ఒక్కో రౌండ్ లెక్కింపు న కు ఇస్తారని అన్నారు. లెక్కింపు చేసే సమయంలో, అనంతరం చేయవలసిన విధులపై సూపర్ వైజర్ లకు పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా జిల్లా మాస్టర్ ట్రైన ర్, బి.ఫణి కుమా ర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మండల తాహిసి ల్దా ర్,  బి. నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మందమర్రి,  పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండలం, పట్టణం లోని అన్ని పోలింగ్ బూత్ లలో పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జులు పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు డివి దీక్షితులు, పట్టణ అధ్యక్షులు మద్ది శంకర్, మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జ్ మార్త కుమారస్వామి, మండల యువమోర్చా అధ్యక్షులు పెంచల రంజిత్, మండల మహిళా అధ్యక్షురాలు సుమలత, నాయకులు అందుగుల లక్ష్మణ్, సేపూరి లక్ష్మణ్, గాజుల ప్రతాప్, వంజరి వెంకటేష్, అల్లంల నగేష్, సప్పిడి నరేష్, ఎర్రోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సుబ్బారావు నగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు

సుబ్బారావు నగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు

రాజమహేంద్రవరం,పెన్ పవర్

ఈ రోజు స్థానిక రాజమండ్రి "49"వార్డ్ సుబ్బారావు నగర్ మాదిగ పేటలో బాబుజగజ్జీవన్ రామ్  యూత్ మరియు గ్రామ పెద్దలు కమిటీ వారు ఆధ్వర్యంలో బాబుజ్జీవన్ రామ్  113 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు వైరాల అప్పారావు,తోలేటి అప్పారావు,శ్రీను,ఉప్పాటి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

కొప్పుల వెలమ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘన సన్మానాలు

 కొప్పుల వెలమ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘన సన్మానాలు

వెనకబడిన వర్గాలవారిని పైకి తీసుకు రావడంలో వైసీపీ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుంది  

పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబు

సన్మాన గ్రహీతలు . దవులూరి దొరబాబు

చైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారుప్రకాష్

వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాదు 

పెద్దాపురం, పెన్ పవర్

 బీసీ సామాజిక వర్గాలకు సమన్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యపడుతుందని వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. పట్టణ మున్సిపల్ చైర్ ర్సన్ వెలమ సామాజిక వర్గానికి కేటాయించడంపైసోమవారంపట్టణకొప్పులవెలమసంక్షేమసంఘంఆధ్వర్యంలో కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసీమంగతాయారు,  వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, సీనియర్ రాజకీయ నాయకులుగోలి రామారావుతో పాటు ఆయా వార్డులకౌన్సిలర్లు సత్కార కార్యక్రమాలు నిర్వహించారు. సభలో కో-ఆర్డినేటర్ దొరబాబుమాట్లాడుతూ బీసీలకు కార్పోరేషన్లు ఏర్పాటుచేసి అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదేనన్నారు. పెద్దాపురంలో ఈ దఫా చైర్మన్ పీఠం వెలమ సామాజిక వర్గానికి కేటాయించి వారికి ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. 

అనంతరం వెలమలు సత్కారాలు నిర్వహించారు. చైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు ప్రకాష్ మాట్లాడు దశాబ్దాలుగా అగ్రవర్గాలకే చైర్మన్ పదవిని కట్టబెట్టారని . ఒకవైసీపీ ప్రభుత్వమే వెనకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నారాని అలాగే ఈసారి మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని బీసీలలొ వెలమలకి ఇవ్వడం పట్ల వెలమ సామాజిక వర్గం అంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబుకి మాకెంతో సహకరించిన వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలియజేశారు . వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ మాట్లాడుతూ . మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకబడిన వర్గాలపట్ల చూపిస్తున్న అభిమాననని ఎన్నటికీ మరువలేనిదని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొన్నా  పార్టీ నాయకులు కౌన్సిల్ సభ్యులు .ఆలేళ్ల విరఘువ ఆకుల కృష్ణ బాపూజీ గడప రామలక్ష్మి , విజ్జపు రాజశేఖర్ విడదాసరి  ఎస్. సత్య భాస్కరరావు నాగేంద్ర (రాజా) కొట్టి కిషోర్ పవన్ కనకాల మహాలక్ష్మి తాటికొండ పెద్దకాపు  నీలం శెట్టి అమ్మాజీ  గోకెడ అప్పారావు కట్ట రాజబాబు  బొబ్బిలి వీరవెంకట దుర్గ కడియాల కనకదుర్గశివ పేరిశెట్టి అంబిక యండమూరి విజయలక్ష్మి బాబి  వైఎస్ఆర్సిపి నాయకులు  కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, సయ్యద్ జానీ,, రబ్బాని   వెలమ సంక్షేమ సంఘం సభ్యులు పప్పల బుజ్జి బొకం రాంబాబు.తదితరులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...