Followers

భారత ప్రభుత్వంచే వికలాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల పంపిణీ.

 భారత ప్రభుత్వంచే వికలాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల పంపిణీ...

 నార్నూర్, పెన్ పవర్ 

 ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో నార్నూర్ మండలం ఎస్సీ కాలనీ జీన్ గూడా వారికి వచ్చిన వైకల్యం గుర్తింపు కార్డులను శుక్రవారం అందించారు. ఈ కార్డులు వికలాంగులకు భారత ప్రభుత్వంచే గుర్తించ బడ్డ వికలాంగుల ప్రత్యేక గుర్తింపు కార్డులు గా కార్డులో వికలాంగుల పేరు పుట్టిన తేదీ చిరునామా మరియు 16 అంకెల నంబరు వైకల్యం శాతం చిరునామా కలిగి ఉన్నాయి. అన్ని సీ డి పి ఓ ఉమాదేవి అన్నారు. ఐ సి డి ఎస్ వారికి కేటాయించిన ప్రత్యేక ఫోన్ యాప్లో వికలాంగుల పూర్తి వివరాలు మరియు వారికి కార్డు అందిస్తున్నా ఫోటోను ఫోన్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు కర్మన్ కార్ పంచశీల, ఆడే సంగీత, జాదవ్ కవిత, లక్ష్మీ బాయి ఉన్నారు.

కరోనా టీకా సదస్సు

 కరోనా టీకా సదస్సు...

 నార్నూర్, పెన్ పవర్ 

గాడిగూడా మందల ఝరి ప్రభుత్వ ఆసుపత్రి లో శుక్రవారం కరోనా సదస్సు కార్యక్రమం డాక్టర్ ప్రవీణ్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమనా మందల జడ్పీటీసీ మెస్రం గంగుబాయి సొము, సమాచారం చట్టం హక్కు మండల అధ్యక్షులు మాడవి చంద్రహరీ, మొదటి టీకా తీసుకొని ప్రజలకు అవగానా  కలిపించారు. 40 సవంత్సరాలు పై బడిన వారూ ప్రతి ఒక్కరు కొవిడ్ 19 టీకాను తీసుకోవాలి, అన్నారు. వారి వెంట పది మంది ఒకేసారి టీకాను తీసుకున్నారు. వారి వెంట  సిబ్బంది సంజయ్ ఆడే, స్టాప్ నర్స్ మాడవి గర్జా, సంధ్య, మెస్రం శ్రీదేవి, ఏ యన్ యమ్ రత్న, సిబంది ఉన్నారు.

మాస్క్ కట్టు కరోనాను తరిమి కొట్టు

 మాస్క్ కట్టు కరోనాను తరిమి కొట్టు

 నార్నూర్,  పెన్ పవర్ 

గాడిగూడా మండల కేంద్రంలో లోకారి (కే ) మార్కెట్ లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మాస్క్ కట్టు కరోనా వైరస్ ను తరిమి కొట్టు అంటు స్థానిక సర్పంచ్ మెస్రం దేవరావు, పంచాయతీ సెక్రటరీ రవి అన్నారు. శుక్రవారం వివిధ ప్రాంతం నుంచి మార్కెట్ కు వస్తున్న ప్రజలకు కోవిద్ 19 గురించి అవగాహనా కలిపిస్తూ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, మాస్క్ లేనిచో రు.500  జరిమానా గ్రామపంచాయతి కు కట్టాలని  కొంరాంభీమ్ వద్ద కార్యక్రమం ను నిర్వహించారు. రాక పోక  వాహన దారులను నిలిపి జరిమానా విధించారు. వారివెంట ఎంపీటీసీ సిడం నాగోరావ్, సమాచారంచట్టం హక్కు మండల అధ్యక్షుడు మడవి చంద్రహరీ, ఇంద్రాబాన్, గ్రామ పటేల్ భీంరావు, కొంరాంభీమ్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు వ్యాపార వేతలు  పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

 జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల, పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో గురువారం రోజున జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్, ఎల్లారెడ్డి పేట, ప్రాథమిక ఆరోగ్యకేంద్రo ను ఆకస్మికంగా తనిఖీ చేశారు, అరోగ్య కేంద్రంలో జరుగుతున్న కొవిడ్ వాక్సినేషన్ మరియు కరోనా పరీక్షలు  వివరాలను అడిగి తెలుసుకున్నారు.  పి హెచ్ సి లో కోవిడ్ వ్యాక్సిన్ 112 మందికి ఇచ్చామని,113 మందికి కరోనా రాపిడ్ పరీక్షలు చేశామని సిబ్బంది జిల్లా కలెక్టరు కృష్ణ భాస్కర్ కు తెలియజేశారు, ఇదేవిధముగా ప్రతి ఒక్కరూ  45 సంవత్సరాల వయస్సు పై బడిన వారందరికి వాక్సినేషన్ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి 45 సంవత్సరాలు పై బడిన వారికి కో వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు...

వకీల్ సాబ్ సినిమాతో జనసేన నాయకుల సందడి

 వకీల్ సాబ్ సినిమాతో జనసేన నాయకుల సందడి

బెల్లంపల్లి ,  పెన్ పవర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోనీ బాలాజీ, రామకృష్ణ దియోటర్ లో వకీల్ సాబ్ సినిమా విడుదల తో హీరో పవన్ కళ్యాణ్ . అభిమానులు పెద్ద ఎత్తున తరిలి వచ్చి వీక్షించారు.ఈ సందర్భంగా జనసేన జిల్లా సీనియర్ నాయకులు శనిగారపు స్వామి మాట్లాడుతూ... ఈ యొక్క సినిమా లో నిరుద్యోగం, యురేనియం తవ్వకాలు, మహిళల పైన దాడులను,న్యాయ స్థానం పైన నమ్మకని పూర్తిగా వివరించడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, కొబ్బరి కాయలతో అబిమనని చాటుకున్నారు. దియేటర్ చుట్టూ ప్లెక్స్ లతో అలంకరించారు. డప్పుల తో నృత్యాలు చేశారు. ఈ కార్య క్రమం లో జన సేన జిల్లా నాయకులు  జిల్లపెల్లి మహేష్ ,ఆవుల సాగర్, గొడిసెల శంకర్, లింగంపల్లి భీమేష్, కుంటాల రాజేష్,తదితరులు పాల్గొన్నారు.

నూతన పంచాంగం డైరీ ఆవిష్కరణ

 నూతన పంచాంగం డైరీ ఆవిష్కరణ

మందమర్రి,  పెన్ పవర్

మందమర్రి పట్టణంలోని వెంకటేశ్వర దేవస్థానంలో శుక్రవారం శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్లవ నామ సంవత్సర పంచాంగం, డైరీ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్, బెల్లంపల్లి ఏరియా బి. సంజీవ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా జిఎం ఎం సురేష్ లు హాజరై నూతన పంచాంగం, డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్ధనగిరి అనంతాచార్యులు, ప్రధాన కార్యదర్శి అచి వెంకటరమణచార్య, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతి భాఫూలే జయంతి ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి

 మహాత్మా జ్యోతి భాఫూలే జయంతి ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.......జాజుల లింగంగౌడ్

తార్నాక ,  పెన్ పవర్  

అణగారిన వర్గాల పితా మహుడు మహాత్మా ఫూలే 194 వ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు.కరోనాను కారణంగా చూపుతూ మహనీయులైన ఫూలే,అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదన్నారు. బార్లకు, పబ్బులకు లేని కరోనా కేవలం మహనీయుల జయంతి ఉత్సవాలకే ఉంటుందా అని బీసీ సంక్షేమ సంఘం ప్రశ్నిస్తుందన్నారు. గత  ఏడాది కరోనా కాలంలో కూడా మాజీ ప్రధాని పీవీ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఎలా నిర్వహించారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ సంక్షేమ శాఖను పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఈ సందర్బంగా జాజుల లింగంగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...