Followers

కోవిడ్ వాక్సిన్ ను 45సంవత్సరాలు దాటిన ప్రజలు వేయించుకోవాలి

 కోవిడ్ వాక్సిన్ ను 45సంవత్సరాలు దాటిన ప్రజలు వేయించుకోవాలి

వి.ఆర్.పురం, పెన్  పవర్

వి.ఆర్.పురం మండలం రేఖపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోప్రభుత్వ  రెవెన్యూఅధికారులకు అంగన్వాడి టీచర్లకు కోవిడ్ వాక్సిన్ వేయటం డాక్టర్ సందీప్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ నాయుడు మాట్లాడుతూ శనివారం ప్రభుత్వ  రెవెన్యూ అధికారులకు అంగన్వాడి టీచర్లకు 45 సంవత్సరాలు దాటిన యువతీ యువకులకు 80 మందికి కోవిడ్ వాక్సిన్ మొదటి డోస్ ఇవ్వటం జరిగింది. మండలంలోని స్త్రీలు కానీ పురుషుల కానీ 45 సంవత్సరాలు దాటిన వారు.ఎవరైనా రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ వాక్సిన్ చేయించుకోవచ్చు దీనివలన ఎలాంటి ప్రమాదము లేదు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఏన్.  శ్రీధర్ ఎంపీడీవో శ్రీనివాస రావు సి డి పి ఓ శంషాద్ బేగం  ఏవో పవిత్ర వి.ఆర్.పురం ఎస్ ఐ వెంకట్ సూపర్వైజర్ శ్రీనివాస రావు అంగన్ వాడి టీచర్లు రెవెన్యూ శాఖ సిబ్బంది. వైద్యశాల సిబ్బంది. ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

స్పెషల్ ఆఫీసర్ పార్వతి పర్యవేక్షణ లో వాక్సిన్ వేయించుకున్న సచివాలయ సిబ్బంది

 స్పెషల్ ఆఫీసర్ పార్వతి  పర్యవేక్షణ లో వాక్సిన్ వేయించుకున్న సచివాలయ  సిబ్బంది

మహారాణి పేట, పెన్ పవర్

జీవీఎంసీ  జోన్ 4 స్థానిక  కుమ్మరి వీధి  సచివాలయం లో   కరోనా  నివారణకు వాక్సిన్  జీవీఎంసీ, సచివాలయం  సిబ్బందికి  స్పెషల్ ఆఫీసర్ పార్వతి  పర్యవేక్షణ లో  వేయటం జరిగింది. వాక్సిన్  వేయించు కోవటం వలన  వైరస్ బారి నుండి  రక్షణ పొందవచ్చని తెలియ చేశారు  హెల్త్ సిబ్బంది  వాక్సిన్  వేసి  తగు జాగ్రత్తలు  తెలియచేసారు. ఈ కార్యక్రమం లో  వేంకటేశ్వ రమెట్ట, టి.ఎస్.ఆర్ కాంప్లెక్స్, గౌరి స్ట్రీట్ సచివాలయం  సెక్రటరీలు, వాలంటీర్ లు  తదితరులు పాల్గొన్నారు.

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ  నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు

గోపాలపట్నం, పెన్ పవర్

విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రిడా  శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు  శనివారం  దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి దంపతులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో  సింహాచలం బోర్డ్ సభ్యులు,  స్థానిక నాయకులు, ఆలయ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

49వ వార్డు బర్మా కోలనిలో అన్న సమారాదన కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు

 49వ వార్డు బర్మా కోలనిలో అన్న సమారాదన కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు 

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు బర్మా కోలనిలో నూకాంబిక అమ్మవారు పండుగ మహోత్సవం సందర్బంగా ఆలయకమిటి ఆధ్వర్యంలో అన్నసమారాదన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రజలకు అన్నసమారాదన చేసిన  విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఈ కార్యక్రమంలో 49వార్డు కార్పొరేటర్ అల్లు శంకరావు,బి.యన్.రాజు,నీలి రవి,లక్ష్మణ్,దీపక్, ఐ.రవికుమార్,చంద్రమౌళి,ఆలయ కమిటీ,49వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపాలి...వామపక్షాలు ధర్నా

 ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపాలి...వామపక్షాలు ధర్నా

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ నగరంలోని బీచ్‌ రోడ్‌లో 13.59 ఎకరాలతో పాటు మొత్తం 18 ఆస్తులు విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటాన్ని సిపిఐ(ఎం), సీపీఐ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తక్షణమే ఈ చర్యను ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది.నేడు బీచ్ రోడ్ లో ఉన్న  ఎపిఐఐసి భూముల వద్ద వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి డా.బి.గంగారావు మాట్లాడుతూ మిషన్‌ బెల్డ్‌ ఏపి పేర నగరంలో వున్న ప్రభుత్వ భూములను పెద్దఎత్తున అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవడం సిగ్గుచేటు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విశాఖబీచ్ రోడ్లో చంద్రబాబు లూలూ సంస్థకు భూమిని అప్పనంగా కట్టబెట్టాలని చూసింది. 9.12 ఎకరాల స్థలం ఇవ్వడానికి సిద్దపడితే లూలూ సంస్థ సరిపోదని తెలిపింది. ప్రక్కనే వున్న సి.యం.ఆర్ స్థలం 3.4 ఎకరాలు కూడా తీసుకొని లూలూకు కేటాయించిన సంగతి అందరికీ తెలిసిందే. సి.యం.ఆర్ కి ఉడా నగర నడిబోడ్డులో వున్నా ఖరీదైన స్థలాలను రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించి మరీ కట్టబెట్టింది. దీనిపై వామపక్షాలతో పాటు నాడు ప్రతిపక్షం లో వున్న జగన్ పార్టీ కూడా వ్యతికించింది. విశాఖ వైకాపా నాయకులూ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.

 మరి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అదే అత్యంత ఖరీదైన స్థలాలు  అమ్మటానికి సిద్దపడితే  ఎందుకు నోరుమేదపటం లేదని అడుగుతున్నాం. జీవీఎంసి ఎన్నికలు  అయిపోయాయి కాబట్టి ఇప్పుడు భూములు అమ్మకానికి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని భావిస్తున్నమన్నారు.మొదటి దశలో మొత్తం 18 ఎకరాలకు పైగా అమ్మకానికి పెట్టారు. రెండోదశలో ప్రభుత్వ కంటి ఆసుపత్రి స్థలము, విశాలాక్షి నగర్‌ పోలీస్‌ క్వార్టర్స్‌, ఆంధ్రా యూనివర్సిటీ, జీవీఎంసి స్థలాలతోపాటు అనేకచోట్ల రెవెన్యూ స్థలాలను కూడా అమ్మేయాలని నిర్ణయించారు. ఈ భూములు  తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మకాన్ని ఆపి ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి యం.పైడిరాజు, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కే.యస్వీ.కుమార్, నాయకులు వై.రాజు,సుబ్బారావు,రెహ్మాన్, మన్మధరావు, చంద్రశేఖర్,కాసులరెడ్డి, యల్.జె.నాయుడు, కుమారి అప్పారావు, నరేంద్ర కుమార్ చంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ వ్యాక్షినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కె.కె.రాజు

 కోవిడ్ వ్యాక్షినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కె.కె.రాజు 

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

విశాఖ ఉత్తర నియోజకవర్గం 49,48వార్డులు బర్మాకోలని,బాపూజీ నగర్లో  జరుగుతున్న కోవిడ్ వ్యాక్షినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు  ఈ కార్యక్రమంలో 49వార్డు కార్పొరేటర్ అల్లు శంకరావు,బి.యన్.రాజు,48వార్డు ఇంచార్జ్ నీలి రవి,వసంతల అప్పారావు,నరేష్,అనిల్,చందు రెడ్డి,జి.వి.ఎమ్.సి, సిబ్బంది,49,48వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో ఏప్రిల్14 న గ్రామసభలు నిర్వహించాలి

 ఏజెన్సీ ప్రాంతంలో ఏప్రిల్14 న గ్రామసభలు నిర్వహించాలి

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ సభలు జరగక పోవడం వల్ల ఆదివాసీ గిరిజనులుతీవ్రంగా నష్ట పోతున్నారు. వారి సమస్యలు పరిష్కారం కోసం మళ్లీ గ్రామ సభలు జరపాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పృధ్వీ రాజ్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఈనెల 14వ తేదీ న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజు సందర్భంగా 1994 మూడంచెల పంచాయతీరాజ్ చట్టా ననుసరించి తప్పకుండా గ్రామ సభలు నిర్వహించావలసి ఉన్న ప్రభుత్వాల నిర్లక్ష్యం  వల్ల అలాగే స్పష్టమైన ఆదేశాలు జారీ చెడిపోవడంతో గిరిజన ప్రాంతంలో గ్రామసభలు జరగడం లేదు అందువల్ల ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకోవడానికి సరైన వేదిక లేకపోవడంతో దీర్ఘకాలిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్న మంచినీరు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని  అలాగే పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 90 రోజుల లోపు గ్రామసభ నిర్వహించక పోతే సర్పంచ్ తన పదవి నుండి కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ గ్రామ సభలు జరగకపోవడంతో పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధంగా ఐదేళ్ల పాటు సర్పంచులు కొనసాగుతు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారనీ ఐదేళ్లపాటు గ్రామ పంచాయతీల అభివృద్ధికి లక్షల రూపాయలు నిధులు వస్తున్న ఖర్చు పెట్టే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది.ఆయా శాఖలలో పనిచేస్తున్న అధికారులు గ్రామ పంచాయతీ అభివృద్ధికి చేపట్టిన పనులపై నివేదికలు గ్రామసభలో ఆమోదాం పొందాలి  కానీ ఆ బాధ్యత నుండి పంచాయితీ ప్రజాప్రతినిధులు అధికారులు తప్పుకుంటున్నరు  పంచాయతీ పరిపాలన లో ఇంత అవకతవకలు జరుగుతున్న ఉన్నతాధికారులు వారిపై తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నేటికీ మంచినీరు అందుబాటులో లేని గ్రామాలు నూటికి 60% పైబడి ఉన్నాయి ఇంటింటికి మంచినీరు అందించాలని లక్షల రూపాయలు నిధులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామ సభ నిర్వహించక పోవడం వల్ల పంచాయతీ వ్యవస్థ అభివృద్ధికి దూరమవుతుంది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామల అభివృద్ధికి చేపట్టవలసిన పనులు అనేకం పెండింగ్లోనే ఉంది. కావున వెంటనే ప్రభుత్వం గ్రామ సభల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయాలని గ్రామ సభలు నిర్వహించని సర్పంచ్ పై కార్యదర్శుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...