Followers

సబ్బం హరి మృతికి సంతాపాన్ని ప్రకటించిన గవర్నర్ బండారు

 సబ్బం హరి మృతికి సంతాపాన్ని ప్రకటించిన  గవర్నర్ బండారు 

విశాఖపట్నం, పెన్ పవర్

అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారనే వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. సబ్బం హరి మరణం చాలా బాధాకరం అని, విశాఖపట్నం అభివృద్ధికి అతను ఎంతగానో కృషి సల్పారని, నాకు సబ్బం హరి అత్యంత ఆత్మీయ పరిచయస్తులని అన్నారు. నేను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పలు సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కరింపచేసేవారని, రాజకీయ పరిజ్ఞానం మెండుగా గల సబ్బం హరి అనేక విషయాలను లోతుగా అధ్యయనం చేసేవారని గుర్తుచేసుకున్నారు.అలాంటి వ్యక్తి ప్రస్తుతం మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ దివంగత సబ్బం హరి  ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

కోవిడ్ నిబంధనల నడుమ విగ్రహ ప్రతిష్ఠ

కోవిడ్ నిబంధనల నడుమ విగ్రహ ప్రతిష్ఠ

గుమ్మలక్ష్మీపురం,  పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట రామాలయం ఆలయ ప్రాంగణంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కోవిడ్ నిబంధనల నడుమ జరిగింది. గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన  విశ్రాంత ఉపాధ్యాయుడు మద్ది. ఢిల్లీశ్వరరావు,కుసుమా దంపతులు సుమారు లక్షా తొంభై వేల రూపాయలు సొంత నిధులను వెచ్చించి ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్ర్తోత్తమంగా నిర్వహించారు  ఈ కార్యక్రమంతో పాటుగా కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

గాంధీ వచ్చిన వేళ...

 గాంధీ వచ్చిన వేళ...

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ర్యాలీ స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద అనుష్ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న గాంధీ ర్యాలీ  వచ్చిన వేళ  అనే  వేషధారణలతో ఆన్లైన్లో వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నారు  ఈ పోటీలో పాల్గొని చిన్నారులను గాంధీ వేషధారణతో మాస్కు ధరించి పోటీలో పాల్గొనాలని సూచించారు అలాగే కరోనా సెకండ్ వే విజృంభన భారతదేశంలో   అత్యధిక వ్యాధి బారిన పడడంతో  ప్రజలందరికీ ఓ సందేశం ఇవ్వాలని ఈ ఆన్లైన్ పోటీలు నిర్వహించామని  ఆ సంస్థ అధ్యక్షుడు మోహిత్  అన్నారు. ఈ పొటీ కి సంబంధించిన వీడియోలన్నీ  మంగళవారం సాయంత్రం  లోపు మాకు పంపించవలసిందిగా కోరుచున్నాము. అలాగే వీటిలో ఉత్తమమైన వీడియోస్ 10 వీడియోస్  విజేతగా ప్రకటించి వారికి బహుమతులు అందచేయడం జరుగుతుంది.

కోవిడ్ నిబంధనలు పాటించకపోతే జరిమానా చెల్లించాలి

కోవిడ్ నిబంధనలు పాటించకపోతే జరిమానా చెల్లించాలి

పెన్ పవర్, కరప

కోవిడ్ నిబంధనలు పాటించకుండా బహిరంగంగా తిరిగితే జరిమానా విధించాలని మండల ఈఓపీఆర్డీ సీహెచ్ బాలాజీవెంకటరమణ కార్యదర్శులను ఆదేశించారు. కరప పేపకాయల పాలెం, ఆరట్లకట్ట, గొడ్డటిపాలెం, కొరుపల్లి తదితర గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించి, గ్రామకార్యదర్శులు, సచివాలయం సిబ్బందితో కల్సి ఇంటింటికీ తిరిగి కోవిడ్ నిబంధనలను, అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నకారణంగా బయట తిరగరాదని బయటకు వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అన్ని శుభకార్యాలపై నిషేధం విధించిందని, గ్రామాల్లో ఎవరికీ టెంట్ హౌస్ సామాన్లు అద్దెకు ఇవ్వరాదని, అలాచేస్తే ఎపిడమిక్ ఏర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని సప్లయి కంపెనీ నిర్వాహకులకు నోటీసులు జారీచేయాలని గ్రామకార్యదర్శులను ఈఓపీ ఆర్డీ బాలాజీ వెంకటరమణ ఆదేశించారు. నిర్దేశించిన సమయాల్లోనే దుకాణాలు తీయాలని, షాపులవద్ద భౌతిక దూరం పాటించేలా మార్క్ చేయాలని వ్యాపారస్తులకు ఆయన సూచనలు చేశారు. కరప శివారు రామకంచి రాజునగర్ కాలనీలో టెంట్వేసి శుభకార్యం నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని ఈఓపీఆర్ట్ వాలాజీ, కార్యదర్శి జి.త్రినాద్ అక్కడకు వెళ్లి కరోనా కేసులు పెరుగుతుంటే. చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల దృష్టికి తీసుకురావడంలో విఫలమైన గ్రామవలంటీర్, ఆశావర్కర్లపై చర్యలు తీసుకోవాలని పైఅధికారులకు సిఫార్సు చేసినట్లు ఈ వీడి తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, గ్రామాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, పలు సూచనలు చేశారు. గురంణాపల్లిలో సాయంత్రం ఆరుగంటలు దాటినా మాంసం అమ్మకాలు సాగిస్తుండటంతో సదరు చికెన్ షాపులోని కాటాను స్వాధీనం చేసుకున్నట్టు కార్యదర్శి కె.నాగేంద్రకుమార్ తెలిపారు.

వ్యవసాయ కూలీలకు మాస్కులు పై అవగాహన

 వ్యవసాయ కూలీలకు మాస్కులు పై అవగాహన

 వి.ఆర్.పురం, పెన్ పవర్

వి.ఆర్.పురం మండలం చింత రేవు పల్లి గ్రామం చుట్టుప్రక్కల పొలాల్లో రైతులు మిర్చి తోటలు  వేసినారు. పెద్ద మట్టపల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలు వ్యవసాయ మిర్చికూలి పనులు చేసుకొనుటకు  వస్తూ ఉంటారు. ఇది గమనించిన చిన్న మట్టపల్లి పంచాయతీ సర్పంచ్ పిట్టా రామారావు మిర్చి పనికి వచ్చిన కూలీలకు  కోవిడ్  పై అవగాహన  తెలియజేస్తున్నారు. మిర్చి పనికి వచ్చే కూలీలకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి.  మనిషి మనిషికి దూరం పాటించాలి. డెటాల్ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లో నుంచి బయటికి రావాలనుకుంటే పని ఉంటేనే బయటకు రావాలి. కొంతమంది మా స్కూలు ధరించకుండా పనిలోకి వస్తున్నారు. అలా రాకూడదని గ్రామ ప్రజలకు పిట్ట రామారావు తెలియజేసినారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు సర్పంచ్ పాల్గొన్నారు.

కరోనా నిర్మూలనకు కమిటీ

 కరోనా నిర్మూలనకు కమిటీ 


మోతుగూడెం, పెన్ పవర్

పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా శరవేగంగా కరోనా వ్యాప్తి చెందుతుంది. ఈ కరోనా వ్యాప్తి నిర్మూలనకు జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం మోతుగూడెం పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి జ్యోతి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో కమిటీ ఏర్పాటు చేశారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోతుగూడెం ఎసై వి సత్తిబాబు హాజరయ్యారు, దినిలో భాగంగా గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని, గుంపులు గుంపులుగా తిరుగుతున్న ప్రజలను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు, ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, గ్రామ వాలెంటీర్లు, ఆరోగ్య శాఖ కార్యకర్తలు , ఆశా వర్కర్స్ మరియు అంగనవాడీ సిబ్బందితో కరోనా నిర్మూలనకు పాటుపడలని ప్రతిజ్ఞ చేయించారు.

బి.జె.పి యువమోర్చా ఆధ్వర్యంలో ఆహారం వితరణ

 బి.జె.పి యువమోర్చా  ఆధ్వర్యంలో  ఆహారం వితరణ

రాజమహేంద్రవరం, పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఈ కరోనా విపత్కర సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ మరియు బి.జె.వై.యం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ పార్టీ శ్రేణులకు,యువతకు సూచనలు అందించారు.బిజెవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందికొండ రమేష్ మాట్లాడుతూ ఈరోజు నుండి వారం రోజుల పాటు రోగుల సహాయకులకు ప్రతీ రోజు 200మందికి ఉదయం అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.అదేవిధంగా బిజెవైయం జిల్లా అధ్యక్షులు కందుకూరి మనోజ్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ సెంటర్లు పరిశీలన జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కండవల్లి సాయి,డి. సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...