Followers

మేరు సంఘం ఆద్వర్యంలో మాస్కుల పంపిణీ

 మేరు సంఘం ఆద్వర్యంలో మాస్కుల పంపిణీ...

బోథ్, పెన్ పవర్

రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా బుధవారం బోథ్ మండకేంద్రంలోని బస్టాండ్ మెయిన్  రోడ్డు పరిసర ప్రాంత ప్రజలకు మేరు సంఘం తరపున ఫేస్ మాస్క్ లను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మేరుసంఘం అధ్యక్షుడు గట్ల గంగాధర్  మాట్లాడుతూ ప్రజలు తమ స్వీయ రక్షణ కోసం మాస్కులు ప్రతీ ఒక్కరూ విధి గా వాడాలని శాని టైజర్ ఉపయోస్తూ భౌతిక దూరం పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మేరు సంఘ సభ్యులు కొట్టూరి సత్యనారాయణ, కొట్టూరి విజయ్.భాస్కర్,బోథ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు సాగిర్, ఎస్.కే మహమ్మద్, విలాస్, కృష్ణ, ఆదర్శ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కొట్టూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకి పాలాభిషేకం

 ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి  కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకి పాలాభిషేకం

గొల్లపల్లి , పెన్ పవర్

గొల్లపల్లి మండల కేంద్రంలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లోడాక్టర్ సుంకిశాని రాజ సుమన్ రావు, పిఎసిఎస్ చైర్మన్ఆధ్వర్యంలో  వ్యవసాయ కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి  మంత్రి  కొప్పుల ఈశ్వర్  చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో ఎం. పీ. పీ నక్క శంకరయ్య,  జెడ్పిటిసి గోసుకుల జలంధర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లం రమేష్, ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆవుల సత్యం. పీఏసీఎస్ వైస్ చైర్మన్ నవ్వ.,  తిరుపతి టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మారంపల్లి బాబు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా నెంబర్ దొనకొండ శేఖర్, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు గండ్ర సత్యం రావు, పిఎసిఎస్ డైరెక్టర్లు ముస్కు నారాయణ రెడ్డి, కచ్చు కొమురయ్య, రంగు మోహన్, కనపర్తి దామోదరరావు,  ఏ ఏం సి డైరెక్టర్ సత్యనారాయణ గౌడ్,  నాయకులు కొక్కుల శ్రీనివాస్, శ్రీనివాస్  కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

మాస్కులు ధరించకుంటే చర్యలు

 మాస్కులు ధరించకుంటే చర్యలు; జిల్లా ఎస్పీ

 వనపర్తి,పెన్ పవర్

రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు  మాస్కులను ధరించాల్సి  ఉంటుందని, కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య ఘణనీయంగా పెరుగుతున్నాయని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి అపూర్వరావు తెలిపారు.కరోనా వ్యాధిని నియంత్రించడం కేవలం మాస్క్ ద్వారా సాధ్యపడుతుందని తెలిపారు.  ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులను ధరించాల్సి ఉంటుందని, ఎవరైన వ్యక్తులు మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినట్లయితే వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుండి 60 సెక్షన్లు, 188 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సదరు వ్యక్తులపై తీసుకునే చర్యల్లో భాగంగా జరిమానాలను విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 30వ తేది వరకు అమలులో ఉంటాయని, కరోనా వ్యాధి ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు తమవంతు సహకారం అందిచాల్సి వుంటుందని. వనపర్తి జిల్లా పరిధిలో నమోదయ్యే కరోనా కేసులపై దృష్టి సారిస్తూ, పోలీస్ పరంగా అప్రమత్తంగా వ్యవహరించడం జరుగుతోందని, ఇందుకు అనుగుణంగా అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, నిర్వహించవద్దని, ప్రజలు గుంపులగా ఉండరాదని, వివిధ పండుగలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఈ అంక్షలు వర్తిస్తాయని జిల్లా ఎస్పీ  తెలియజేసారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రజలు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా కరోనా వ్యాధి అరికట్టడం సాధ్యపడుతుందని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

రెవెన్యూ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి

 రెవెన్యూ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి

 మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు


వేములవాడ, పెన్ పవర్

వేములవాడ మున్సిపల్ ఆఫీస్ లో సోమవారం మరియు బుధవారం నిర్వహిస్తున్న రెవెన్యూ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు   అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు పేరు మార్పిడి జరిగి ఆన్లైన్లో నమోదు కాకున్నా , ఇంటి నెంబర్ వచ్చి ఆన్లైన్ లో ఎంట్రీ కాకున్నా ఇంటి నెంబర్ లో తప్పు ఉన్న అదేవిధంగా ఇంటి కొలతల  లో  హెచ్చు తగ్గులు ఉండి ఇంటి  టాక్స్ ఎక్కువ రావడం మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా  మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ కు  దరఖాస్తు చేసుకున్న వారికి  సత్వరమే సమస్య  పరిష్కరిస్తామని, అందులో భాగంగా నే గత బుధవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ మేళా లో మా దృష్టికి కమిషనర్  దృష్టికి వచ్చిన ఇంటి కొలతలలో హెచ్చుతగ్గులు ఉండి  12000 వేల రూపాయలు ఎక్కువ టాక్స్ వచ్చిన  సదరు వ్యక్తి కి సమస్య పరిష్కరించి టాక్స్ రసీదు అందజేయడం జరిగింది. పట్టణ ప్రజలు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా మున్సిపల్ ఆఫీస్ లో దరఖాస్తులు సమర్పించి సమస్యలను పరిష్కరించుకో గలరు అని వారు కోరారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కెసిఆర్ నిర్ణయం

 వరిధాన్యం కొనుగోలు కేంద్రాల  ఏర్పాటుకు కెసిఆర్ నిర్ణయం

రైతుల పక్షపాతి సిఎం కెసిఆర్

మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను. గత సంవత్సరాలాగే ఏర్పాటు చేయాలని సి.ఎం.కె.సి ఆర్. నిర్ణయం తీసుకోవడం పట్ల   మండల రైతాంగం పక్షాన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మార్కేట్ కమీటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్  ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి అన్నారు. అలాగే మండు వేసవిలో సిరిసిల్ల నియోజకవర్గానికి  వరప్రదాయిని అయిన  ఎగువ మానేరు ను కాళేశ్వరం జలాల ద్వారా నింపి సిరిసిల్ల రైతాంగానికి  మరో సారి తనది రైతు ప్రభుత్వం అని నిరూపించారని మార్కెట్ కమిటీ చైర్మెన్  రమేష్ అన్నారు.  ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొండాపురం  బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల శేఖర్ రెడ్డి,  టి. ఆర్.ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి. బాల్ రాజ్ నర్సాగౌడ్, లంబసత్యం  పాల్గొన్నారు.

కేటీఆర్ జన్మదినం సందర్భంగా అంబులెన్స్ ప్రారంభించిన ఎంపీ కవిత

 కేటీఆర్ జన్మదినం సందర్భంగా అంబులెన్స్ ప్రారంభించిన ఎంపీ కవిత


పెన్ పవర్, మరిపెడ

మహబూబుబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలం కేంద్రంలో స్థానిక మంగళవారం ఆర్. ఎన్. బి గెస్ట్ హౌస్ లో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన  గిఫ్ట్ ఏ స్మైల్ 108 ఆంబులెన్స్ ను భాగంగా ప్రారంభించడానికి  మహబూబాద్ ఎంపీ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, తమ సొంత ఖర్చులతో మరిపెడ మండలం కేంద్రంలోని అత్యాధునిక వసతులతో కూడిన ఉన్న టెక్నాలజీతో మరిపెడ మండలంలోని ప్రజలకు 24 అవర్స్ అందుబాటులోకి తెచ్చిన డోర్నకల్ శాసనసభ్యులు డి ఎస్ రెడ్యానాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్‌ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి  నవీన్ రావు, డోర్నకల్ కాంసెన్సీ ముఖ్య నాయకులు, ఎంపీపీ అరుణ రాంబాబు, జెడ్ పి టి సి శారద రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్  సింధూర, చాపల యాదగిరి రెడ్డి, కుడితి మహేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, డాక్టర్ రవి, డాక్టర్ అరుణ దేవి, ఆశా వర్కర్లు, వార్డు కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.

ఎర్రబెల్లి గూడెం లో పౌరహక్కుల సమావేశం

 ఎర్రబెల్లి గూడెం లో పౌరహక్కుల  సమావేశం...

 హాజరైన తాసిల్దార్ రమేష్ కుమార్,ఎస్సై జితేందర్


నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లి గూడెం లో జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఆదేశాల మేరకు తాసిల్దార్ అనంతుల రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి నెల్లికుదురు ఎస్ ఐ పి జితేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అనంతుల రమేష్, కుమార్ ఎస్సై పి. జితేందర్ లు  మాట్లాడుతూ..ప్రతి పౌరునికి చట్ట పరిధిలో స్వేచ్ఛగా జీవించేహక్కు ఉంటుందన్నారు. మానవ హక్కులకు ఎవరు భంగం కలిగించకూడదని, ఎవరి పరిధిలో వారు చట్టాన్ని అతిక్రమించ కుండా ఉండాలని మరియు అస్పృశ్యత అంటరానితనం అనే భావనలేకుండా  సమాజంలో ప్రతి పౌరుడు కుల మత వర్గ విభేదాలు విడనాడి అందరు సమాన సౌబాతృత్వాలతో జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మెర అశోక్ గౌడ్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు స్థానిక ఎంపీటీసీ బత్తిని అనిల్ గౌడ్ ఆర్.ఐ  మల్లయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...