Followers

ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం.

ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం.

నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్.

 ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైకిళ్ళు

 ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు  నష్టం.

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

ఒకే పార్టీ నాయకుల మధ్య తలెత్తిన వర్గపోరు ప్రభుత్వ లక్ష్యాన్ని సైతం నీరుగార్చింది. పేద వికలాంగులకు ఉపయోగపడే మూడు చక్రాల సైకిలు అందించాలని ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి వీల్చైర్ లను సమకూరిస్తే ఆదిపత్య పోరుతో  అవి కాస్త పంపిణీకి నోచుకోలేదు. పది నెలలుగా ఎండలో ఎండి వానలో తడవడం వల్ల మూడు చక్రాల సైకిళ్ళు తుప్పు పట్టి పోయాయి. వాటిని వికలాంగులకు అందించిన వాటిని స్క్రాప్ కింద  కిలోల లెక్కన అమ్ముకోవాల్సిందే.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు ను  2020 ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా  మండల పరిషత్ కార్యాలయాలకు చేరాయి. అధికారులు వాటిని స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ జరగాల్సి ఉంది. కానీ జిల్లాలో పాయకరావుపేట  నియోజకవర్గం  ఎస్ రాయవరం మండలం లో వికలాంగులు సైకిళ్ళు   పంపిణీ జరగలేదు. ప్రభుత్వం ఉచితంగా మూడు చక్రాల సైకిలు  ఇస్తుందని  వికలాంగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పది నెలలు అవుతున్న వీల్చైర్ ల పంపిణీ కి  నోచుకోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే  అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీల మధ్య తలెత్తినా వర్గ వివాదం  సంక్షేమ పథకాలను మూలకు చేరుతున్నాయి. మండలంలో గుర్తించిన వికలాంగులకు అవసరమైన  80  వికలాంగు సైకిళ్లను ఆగస్టులో పరికరాలు తెచ్చి బిగించారు. నేతల మధ్య పోరు మూడు చక్రాల సైకిల్ పంపిణీకి గ్రహణం పట్టింది.

వాటిని పంపిణీ చేయడానికి  స్థానిక ఎంపిడిఓ  చొరవ చూపకపోవడంతో  మూడు చక్రాల సైకిలు మూలకు చేరాయి. వాటిని మండల కేంద్రంలో రెల్లి వీధి ఆర్ బి కె   వద్ద పడేశారు. ఆగస్టు తర్వాత కురిసిన వర్షాలు  ఆతర్వాత ఎండలకు వికలాంగులు సైకిల్ లు పూర్తిగా పాడైపోయాయి. వాటిని చూస్తే  కాలం చెల్లిన మూడు చక్రాల సైకిలు  అనుకోక తప్పదు. తుప్పు పట్టి పోయి సీట్లు  కూలిపోయి గుట్టలుగా పడి ఉన్న స్క్రాప్ ల  దర్శనమిస్తుంది. వికలాంగుల కోసం  ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తే  ఇరువురు నేతల వర్గ పోరు తో  అవి కాస్త బూడిదలో పోసిన పన్నీరు అయింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలు పేదలకు చేరుతున్నాయి అని ఆశిస్తున్నారు. కానీ అక్కడ అక్కడ పార్టీ నాయకుల్లో  తలెత్తిన అవాంతరాల కారణంగా  పధకాలు పేదలకు చేరడం లేదన్న నగ్నసత్యం  పెరుమాళ్ళకెరుక. మూడు చక్రాల సైకిల్ నష్టాన్ని ఎవరు పూడుస్తారు. ఈ నాయకులా? లేక సంబంధిత అధికారులా?..

జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్ష

జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్ష

 అభివృద్ధిలో పచ్చదనానికి ప్రాధాన్యత 

రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్

విజయనగరం, పెన్ పవర్

అభివృద్ధి కార్యక్రమాల్లో పచ్చదనానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, భూ సేకరణ, ఇతర అంశాలపై శుక్రవారం తన చాంబర్లో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నం-రాయపూర్ జాతీయ రహదారి, విజయనగరం బైపాస్ రోడ్డు, సాలూరు బైపాస్, మానాపురం ఆర్వోబి, పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని 12 రోడ్ల నిర్మాణం, వాటి ప్రస్తుత స్థితి పై ఆరాతీశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,  రహదారుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారి నిర్మాణంలో మొక్కలు వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు.  విజయనగరం బైపాస్ రోడ్డులో మొక్కలు నాటే పనులను వెంటనే ప్రారంభించలన్నారు. ఈ నెలాఖరు నాటికి డివైడర్ లో మట్టిని నింపి, ఇరువైపులా మొక్కలను నాటేందుకు గోతులు సిద్ధం చేయాలన్నారు. జూన్1 నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ ఎక్కువై, కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. దీనిని అరికట్టాలంటే  మొక్కలను నాటడమే ఏకైక మార్గమన్నారు. అందువల్ల ఒకవైపు రహదారిని పూర్తి చేస్తూనే, మరోవైపు మొక్కలు నాటడం మొదలు పెట్టాలని సూచించారు. రోడ్డు పూర్తి అయ్యేటప్పటికి, మొక్కలుకుడా బాగా పెరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్డీసి హెచ్వి జయరాం, ట్రాన్స్ కో  ఎస్ఈ వై.విష్ణు, ఆర్అండ్బి ఎస్ఈ విజయశ్రీ, పిఆర్ ఎస్సీ గుప్త,. ఉద్యానశాఖ డిడి శ్రీనివాస్, నేషనల్ హైవేస్ ఏఇ ఈ సురేష్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం లో సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం

 గుమ్మలక్ష్మీపురం లో సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం


లాక్డౌన్ కి మద్దతు ఇచ్చిన వర్తకులకు కృతజ్ఞతలు

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలి

సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్రావు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో శని,ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం పడింది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ విధించింది.మధ్యాన్నం 12 నుండి ఉదయం 6గంటల వరకు పోలీసులు సహకారంతో ప్రభుత్వం కర్ఫ్యూ నిర్వహిస్తుంది. అయినప్పటికీ పంచాయతీ పరిధిలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్న తరుణంలో గ్రామ సర్పంచ్ గౌరీశంకర్రావు పిలుపు మేరకు వ్యాపార వర్గాలు శని,ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ చేయడానికి స్వచ్చంధంగా ముందుకు వచ్చాయి. కరోనా వ్యాప్తిని అరికట్టాలనే మంచి ఉద్దేశంతో వ్యాపార సముదాయాలను మూసివేయడానికి ముందుకు వచ్చిన వర్తకులకు సర్పంచ్ గౌరీశంకర్రావు కృతజ్ఞతలు తెలియచేసారు.

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

సంతబొమ్మాలి, పెన్ పవర్

మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. మర్రిపాడు పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువకులు, వీధుల్లో , మురికి కాలువలలో బ్లీచింగ్ వెదజల్లారు. పరిసరాల పరిశుభ్రత తో ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించారు. సంతబొమ్మాలి లో  సర్పంచ్ కళింగపట్నం లక్ష్మి ప్రతినిధి కళింగపట్నం అప్పారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.వీరితో పాటుగా అంగన్వాడి ఆశా కార్యకర్తలు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే దండుగోపాలపురం పంచాయతీలో సర్పంచ్ మార్పు అశోక చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శులు పీ రామకృష్ణ , సిద్ధార్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది అన్ని వీధుల్లోను బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ మార్పు నాగభూషణ్,  గ్రామస్తులు పాల్గొన్నారు.

మే 15 తర్వాత మొదటి డోస్ టీకా

 మే 15 తర్వాత మొదటి డోస్ టీకా 

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శృతి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మే 15  తేదీ వరకు మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి డోసు టీకా వేసుకున్న వారు చాలామంది ఉన్నారని వారికి  మే 15వ తేదీ లోపు రెండో డోసు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతము మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.  కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రెండవ డోసు పూర్తి చేసిన తరువాత మే15 తరువాత మరల మొదటి డోసు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడతామని ఆమె తెలిపారు.ఈవిషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రస్తుతము మొదటి డోసు టీకా  వేసుకున్న వారిని గుర్తిస్తున్నాం అని అన్నారు. వారికి పూర్తి కాగానే మొదటి డోసు టీకా మళ్లీ వేస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ వి పద్మలత, సూపర్వైజర్  వెంకటాద్రి, హెల్త్ అసిస్టెంట్ రవి, ఏఎన్ఎంలు జయశీల, లతా, పార్వతి, ఆశా కార్యకర్తలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అర్హులైన అందరికీ వ్యాక్సిన్.

 అర్హులైన అందరికీ వ్యాక్సిన్.

సంతబొమ్మాళి, పెన్ పవర్. 

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ కరోనా మొదటి మరియు రెండో డోస్ వ్యాక్సిన్ వేస్తున్నామని సంతబొమ్మాళి మండలం నౌపడ ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ కోదండ రావు తెలియజేశారు. గురువారం 176 మందికి మరియు  శుక్రవారం 69 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. గురువారం మొదటి డోస్ వేయించుకోవడానికి వచ్చిన వై ఎస్ ఆర్ సి పి జెడ్పిటిసి అభ్యర్థి పాల వసంత రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం రెండో విడత కరోనా వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన విలేఖర్ల బృందానికి వేశారు. ఈ సందర్భంగా వైద్యులు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 1800 వ్యాక్సిన్ కేంద్రానికి రాగా వచ్చిన వ్యాక్సిన్ పూర్తిగా వెయడం జరిగిందని ఆయన తెలిపారు. ఫీవర్ సర్వే విస్తృతస్థాయిలో డోర్ టు డోర్ చేయిస్తున్నామని  ఇప్పటి వరకు జరిగిన కరోనా టెస్టుల్లో 51 మంది హాంఐసోలేషన్ లో ఉండగా 36 మంది పూర్తిగా కోలుకున్నారని తెలుపుతూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయపడకుండా ముందుకు వస్తున్నారని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ పూర్తిచేసి వ్యాక్సినేషన్ వేస్తున్నామని  ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్ కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపిన వరకు టీకా వేస్తున్నామని, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్లు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి శానిటేషన్ వినియోగిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఇంటి వద్ద ఉండి భద్రతా చర్యలు చేపట్టినట్లు అయితే కరోనాను  పూర్తిగా జయించొచ్చు అని, బలమైన ఆహారం తీసుకొని, అవసరం ఉన్నంత వరకు విశ్రాంతి తీసుకుంటూ, పలు ఆరోగ్య సూత్రాలను పాటించటం వలన కరోనా దరిచేరదని ప్రజలు భయపడవద్దని ఆయన తెలిపారు.

గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ

 గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ

ముంచంగిపుట్టు ,పెన్ పవర్

కరోనా  బారిన పడకుండా ఉపాధి కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని  భౌతిక దూరం పాటించాలని  ఎన్ఆర్ఈజీఎస్  వి ఆర్ పి వెంగడ  చంద్ర  అన్నారు.శుక్రవారం సుజన కోట పంచాయితీ గొడ్డి పుట్టు గ్రామంలో ఉపాధి కూలీలకు మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రెండవ దశ కరోనా విలయ తాండవం ఆడుతుందని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. మొదటి విడత కరోనా మాదిరి నిర్లక్ష్యం చేయవద్దని  ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. ఉపాధి కూలీలు పనులు చేసే సమయంలో  మాస్కులు  ధరించాలి అని  గుంపులు గుంపులుగా  ఉండకుండా  భౌతిక దూరం పాటించక తప్పదు అన్నారు. పనులు పూర్తి అయ్యాక కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలన్మారు. గ్రామం విడిచి వెళ్లవద్దని ఇల్ల కే పరిమితం కావాలని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఆశ కార్యకర్త ఏఎన్ఎం లను సంప్రదించాలని సూచించారు. నిత్యం ఉపాధి పనులు చేసే కూలీలు  మాస్కులు భౌతిక దూరం  తప్పనిసరిగా ఆచరించాలని వీ ఆర్ పి చంద్ర కోరారు. అతని వెంట టి ఏ కూడా పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...