Followers

టోల్ ఫ్రీ నెం 1077 కలెక్టర్ పోల భాస్కర్


 


ఫొటో నెం. 102


సమస్యల నుంచి విముక్తి కల్గించేందుకు టోల్ ఫ్రీ నెం 1077 కలెక్టర్ పోల భాస్కర్


 


(పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్, ఒంగోలు)


 


సమస్యల నుంచి విముక్తి కల్పించాలని టోల్ ఫ్రీ నెంబరు 1077 ద్వారా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు నేరుగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో కరోనా నియంత్రణ పై కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు భరోసా నగదు రాలేదని మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామానికి చెందిన రైతు వెంకట్రామిరెడ్డి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇళ్ల మధ్య పేడ దిబ్బలు వేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పొదిలికి చెందిన ముక్కంటి చౌదరి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పారిశుద్ధ్యంతో పజల ఆరోగ్యం కాపాడాలని ఆయన కోరారు. వాహనాల రాకపోకలకు అనుమతులు ఇవ్వాలని పశ్చిమ ప్రాంతం నుంచి రాము కలెక్టర్ ను కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డి.ఆర్.ఓ. వెంకట సుబ్బయ్య, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించాలి. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...