Followers

పరిశ్రమలు, నిర్మాణ పనులకు నిబంధనలకు లోబడి అనుమతులివ్వండి



నిబంధనలకు లోబడి పని చేయడానికి పరిశ్రమలు, నిర్మాణ పనులకు అనుమతులివ్వండి జిల్లా కలెక్టర్ పోల భాస్కర్


(పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్, ఒంగోలు)



 నిబంధనలకు లోబడి పనిచేయడానికి పరిశ్రమలు, నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, అనుబంధ రంగాల పై గురువారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు సడలింపులు వున్నాయని తక్షణమే వాటిని పునఃప్రారంభించాలని కలెక్టర్ చెప్పారు. నాడు-నేడు పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన సూచించారు. రహదారులు, ఉపాధి హామీ పనులు, భవన, ఇతర నిర్మాణరంగ పనులకు షరతులతో అనుమతులు ఇవ్వాలని ఆయన చెప్పారు. ఇందుకోసం సిమెంటు, ఇసుక, ఇనుము కొరత ఏర్పడకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సిమెంటు కంపెనీలు, దుకాణాలు, అనుబంధ మైన వాటిని అనుమతించేలా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని ఆయన పలు సూచనలు చేశారు. లాక్ డౌన్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి అధికారులు పనిచేయాలని, అలాగే వివిధ రంగాలకు అనుమతులు ఇవ్వాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన భవనాలు, ఇతర నిర్మాణాలకు గుత్తేదారులనుంచి ఇండెంట్ వస్తే వాటిని సమకూర్చడానికి అధికారులు కృషి చేయాలని ఆయన వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, పి.ఆర్. ఎస్.ఇ. కొండయ్య, హౌసింగ్ పి.డి. సాయినాథ్ కుమార్ , ఆర్ఎండ్ బి ఎస్.ఇ మహేశ్వర రెడ్డి, ఇరిగేషన్ ఎస్.ఇ రెడ్డయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్స్ సంజీవరెడ్డి, డిఇఓ సుబ్బారావు, నగర పాలక సంస్థ కమీషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ ఇంజినీర్ సుందరరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...