Followers

జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ : ఎంపిపి వాకా వెంకటరెడ్డి


 


 


జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంపిపి వాకా వెంకటరెడ్డి


  ( పెన్ పవర్, పొదిలి)


 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నిత్యావసర సరుకులను ప్రింట్ మీడియా జర్నలిస్టులకు గురువారం మర్రిపూడి ఎంపిపి వాకా వెంకటరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో మీడియా ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఎళ్ళవేళలా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు. అదే సమయంలో మీడియా ప్రతినిధులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సువర్ణరావు, ఎంపిడిఓ కరిముల్ల, డిప్యూటీ తహశీల్దార్ రవి శంకర్, ఎంపిడిఓ కార్యాలయ ఏఓ రాంబాబు, ఈ ఓపిఆర్ డి శంకర్, వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ బోదా రమణారెడ్డి, చిమట త్రిమాన్ కమిటీ అధ్యక్షుడు మకినేని వెంకట్రావు, వైసీపీ సీనియర్ నాయకుడు మచేపల్లి నాగయ్య, మర్రిపూడి వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇనుకొల్లు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...