కోవిడ్ కేర్ సెంటర్లకు వైద్య బృందాలు నియామకం
విజయనగరం,
జిల్లా కేంద్రంలోని రెండు కోవిడ్ కేర్ సెంటర్లలో షిఫ్ట్ పద్ధతిలో విధులు నిర్వహించడానికి వీలుగా ఆరుగురు వైద్యులు, ఆరుగురు నర్సింగ్ సిబ్బందిని నియమిస్తూ జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డా.జి.నాగభూషణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని ఎం.ఆర్.పి.జి.కళాశాల, బాబామెట్టలోని కేంద్రీయ విద్యాలయంలో 24x7 పనిచేసేలా ఈ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎం.ఆర్.పి.జి.కళాశాల కేంద్రంలో తొలి షిఫ్టులో డా.కె.వసుధ, స్టాఫ్ నర్స్ కె.జమిమా విధులు నిర్వహిస్తారు. రెండో షిఫ్ట్ లో డా.ఎం.వి.ప్రసాద రావు, స్టాఫ్ నర్స్ బి.పద్మావతి, మూడో షిఫ్ట్ లో డా.వి.వి.వి.ఎన్.ఎస్.రవిశంకర్, స్టాఫ్ నర్స్ యు.ధనలక్ష్మి విధులు నిర్వహిస్తారు.
బాబామెట్టలోని కేంద్రీయ విద్యాలయంలో తొలి షిఫ్టులో డా.పి.వంశీకృష్ణ, డా.జె.లక్ష్మణ రావు, స్టాఫ్ నర్స్ వి.జ్యోతి, రెండో షిఫ్ట్ లో డా.జె.లక్ష్మణ రావు, స్టాఫ్ నర్స్ ఎల్.త్రినాధమ్మ, మూడో షిఫ్ట్ లో డా.ఎం.బి.మల్లికార్జున రావు, స్టాఫ్ నర్స్ ఎం.దీపిక లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
No comments:
Post a Comment