నిరుపేదలకు అందించే కిట్లకు రూ.25 వేలు ఆర్ధిక సహాయం అందించిన వాకా సుబ్బారెడ్డి
(పెన్ పవర్, పొదిలి)
పట్టణంలోని నిరుపేదలకు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ప్రోద్బలంతో రూ.600 విలువ చేసే కిట్లను గురువారం నుంచి అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైసీపీ నాయకులు వాకా సుబ్బారెడ్డి ఎమ్మెల్యే కు 50 కిట్లకు సంబంధించి రూ.25 వేలు నగదును గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, జి శ్రీను, ఉడుముల పిచ్చిరెడ్డి, యక్కలి శేషగిరిరావు, కంకణాల రమేష్ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment